రెండవ భాగం: ఆదివారం ఎపిసోడ్
యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు అంటే శనివారం నుండి తరువాత యేసును శిలువవేసే శుక్రవారం వరకు మొత్తం 7 భాగాలుగా మీకు అందించాలనే తలంపుతో ఈ వీడియో ఎపిసోడ్స్ ను మీకు సీరియల్ గా అందిస్తున్నాము.
ఆదివారం శిష్యులు ముందుగా తనకై సిద్దపరచిన గాడిదపిల్లను అధిరోహించి ప్రజలందరూ హోసన్నా హోసన్నా అంటూ జేజేలు పలుకుతుండగా యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశిస్తాడు. ఆరోజు పండుగ వాతావరణంతో యెరుషలేము వీధులు జనసంద్రమై నిండిపోతాయి. ప్రజలందరూ యేసు గాడిదపిల్లపై వస్తున్న మార్గమంతా తమ బట్టలు దారిపొడవునా పరచి ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని ఆనందంతో కేకలు వేస్తారు. కట్టబడిన గాడిదనూ గాడిదపిల్లనూ వాటి కట్లు విప్పించబడటంలోనూ.. గాడిదపిల్లను అధిరోహించి రావడం లోనూ గొప్ప నిఘూడమైన మర్మాలు అందులో దాగివున్నాయి. మరికొద్ది రోజుల్లో తను శిలువ మరణం పొందబోతున్నానని తెలిసీ మనపై అంతులేని ప్రేమను కరుణను చూయించి మనకు తన మరణం ద్వారా రక్షణను అందించి తను చావును కౌగలించుకోబోతున్నాడు. ఎంత ప్రేమ, దయ, కరుణను మనపై చూయంచాడో మనం గమనించాలి. ఆ ప్రభువు కాళ్ళను ఆనాడు మరియలా మన కన్నీళ్ళతో కడిగి మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోగలగాలి. నిరంతరం దేవుని ప్రార్ధించుతూ కృతజ్ఞులమై తోటివారికి ప్రేమను పంచుతూ ఈ లోకంలో జీవించగలగాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే మీ మిత్రులకు, బంధువులకు, share చేసి subscribe చేయించగలరు. మీ అమూల్యమీన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.
లోక రక్షకుడు
మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన
మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన
మహిమార్ధమై మీరు
మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము.
ఆమేన్.
మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము.
ఆమేన్.
Our New Videos...
No comments:
Post a Comment
If you have any doubts, please let me know