February 18, 2018

Prayer of Jabez - యబ్బేజు ప్రార్ధన | Latest christian video message | HO...

❄❄❄ యబ్బేజు ప్రార్ధన ❄❄❄

Prayer of Jabez
బైబిల్ గ్రంధంలో యబ్బేజు ప్రార్ధనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. జన్మనిచ్చిన తల్లే అతనికి వేదన పుత్రుడని పేరు పెట్టి పిలుచుకుంది. ఐనా ఏమాత్రం నిరాశపడక మొక్కవోని అచంచల విశ్వాసంతో దేవుని వైపు తిరిగాడు, దేవుని ప్రేమించాడు, ప్రార్ధించాడు. అతని సోదరులలో మిక్కిలి ఘనతనొందేలా దేవునిచే ఆశీర్వదించబడ్డాడు. కేవలం నాలుగంటే నాలుగే మాటల్లో దేవునికి తనను తాను విన్నవించుకున్నాడు.
యబ్బేజు ఇశ్రాయెలీయుల దేవుని గుర్చి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్ధింపగా అతను మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. 1 దిన
4:10
ఎంతో గొప్ప నమ్మికతో అతను చేసిన ప్రార్ధన, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తావు అనే ఆ గొప్ప నమ్మకమే అతనిని దేవునికి ఇష్టునిగా మార్చింది. అంత గొప్ప ఘనతను ఆపాదించి పెట్టింది.


ఈ వీడియోని మర్చిపోకుండా మీ మిత్రులకు share చేసి పదిమందికి దేవుని సువార్తను చాటగలరు. మా HOPE Nireekshana TV YouTube chaanel ని మర్చిపోకుండా subscribe చెయ్యగలురు, మి మిత్రులతో కూడా subscribe చేయించగలరు. God bless You. Amen.


No comments:

Post a Comment

If you have any doubts, please let me know