July 30, 2018

యేసయ్యకు నీవో ప్రత్యేకం! మాదిరికరంగా జీవిస్తున్నావా? Dr N Ajay Kishore M...

యేసయ్యకు నీవో ప్రత్యేకం! మాదిరికరంగా జీవిస్తున్నావా?

Dr N Ajay Kishore Wonderful and inspirational messages on youth trends and christian families life styles, Halleluya Pentecost Ministries, Christi Pilgrim Center, Kadapa,

నేటి క్రైస్తవ యువత ఆధునిక జీవనశైలి, ఫ్యాషన్ ప్రపంచం, వింతపోకడలు, వారిపై లోక ప్రభావాల గురించి, ఇంకా క్రైస్తవ కుటుంబాల ఆలోచనా విధానం, రాజీదోరణి, నిబద్ధత లేని జీవితాలు, లోకానుసార జీవితాలను గురించి సహోదరుడు Dr.N.Ajay Kishore, Jesus Pilgrim Center, Kadapa వారు తనదైన శైలిలో చాల క్లుప్తంగా వివరించారు, మార్పులేని క్రైస్తవ జీవితాలు ఎందుకూ కొరగావని.. దేవుని యెరిగి ఉన్నా సాతాను బంధకాలలో జీవిస్తూ మార్పులేని జీవితాలు ఏ నాటికీ యేసయ్య దరిచేరలేవని... మార్పు ఏనాడో కాదు నేడే రావాలని.. అందుకూ ప్రార్ధనా జీవితం నేటినుండే ప్రారంభించాలని హెచ్చరిస్తూ చేసిన ఈ వీడియో తప్పక యువతకూ, క్రైస్తవ కుటుంబాలకూ మార్గనిర్దేశం చేస్తుంది. తప్పక చూడండి. Amen.
బ్రదర్ అజయ్ కిషోర్, బ్రదర్ విజయ్ కిషోర్ సోదరులు దేవునిచే ఆశీర్వదించబడి.. బహుగా ఫలింపబడుతూ..
హల్లెలూయా పెంతెకోస్తు మిషన్, Jesus Pilgrim Center ల ద్వారా కడప పట్టాణంలో..దేవుని సువార్తను వేలాదిమందికి చాటుతూ ఆత్మలను తండ్రి సన్నిధికి చేరుస్తున్నారు. చిన్న వయసులో బహుభారముతో సోదరులు నడిపిస్తున్న సేవను గురించి మనమందరం ప్రార్ధించుదాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.
Praise the Lord.. Watch Share and Subscribe.


July 23, 2018

కష్టాలు కన్నీళ్ళూ శాశ్వతం కాదు..అవి రేపటి మీ సాక్షాలుగా మారబోతున్నాయి - ...

కష్టాలు కన్నీళ్ళూ శాశ్వతం కాదు.. అవి రేపటి మీ సాక్షాలుగా మారబోతున్నాయి !
Dr Ajay Kishore Wonderful and inspirational messages on suicides messages, helleluya pentecost ministries kadapa,


మన జీవితాలలో కష్టాలు కన్నీళ్ళు తప్పవు, శోధనలూ వేదనలూ తప్పవు. ఈ రోజు మనం అనుభవించే ఈ కష్టాలన్ని తప్పక రేపు మనకు మంచి సాక్షాలుగా మారుతాయి, రెండంతల ఆశీర్వాదాలు మనము పొందుకుంటాము. కష్టలు లేనిదెవరికి, అనుభవించనివారు ఎవరు. ఎక్కడో చదివాను... అరికాళ్ళు తడవకుండా సంద్రాన్ని దాటవచ్చట... కానీ కన్నీటిని విడువకుండా ఏ మనిషి జీవితాన్ని దాటలేడట. ఎంత కఠోర సత్యం. దేవుని కుమారుడైన యేసయ్య కూడా సాతాను శొషనలు భరించాల్సి వచ్చింది, శిలువయాగంలో మరెన్నో వేధనలు అనుభవించాల్సి వచ్చింది. యోబు గారు అన్నట్లూ.. నాకెన్ని కష్టాలు ఎదురైనా భరిచగలను తండ్రీ, నాచేతిని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ విడువకు అని ప్రార్ధిస్తాడు. మనమూ తండ్రిని అలాగే ప్రార్ధించుదాం. రేపటి సాక్ష్యంగా ప్రభువులో నిలుద్దాం. ఆమేన్.

ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.

July 17, 2018

దేవుని మనం ఎలా అడగాలి!? 15 GREAT MOTIVATIONAL VERSES IN THE BIBLE - 2018...

దేవుని మనం ఎలా అడగాలి!?
నిత్యం ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచే 15 అద్భుతమైన వాక్యాలు
15 GREAT MOTIVATIONAL VERSES IN THE BIBLE - 2018
Great Bible Verses -
Top Ten Encouraging Bible verses

Anchor: Sister Minny
Voice Over: Bro Koteswara Rao Mekala
Script: Dr.VijayaLakshmi Prasanth,
Tech support: Mahesh Chennuri.
Tech support: Pratheek Nathala
Visualization, Camera, Editing: HOPE Nireekshana TV Team


July 16, 2018

ఆత్మహత్యలు పరిష్కారం కానేకాదు - Dr Ajay Kishore - Christ Piligrim Center...

నీ సమస్యకి చావే ముగింపా...?
ఆత్మహత్యే పరిష్కారమా....?
కానేకాదు!
యేసు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు!!


ఈ రోజు ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ఆత్మహత్యల వార్తలే...
మనిషి రోజురోజుకు మానసికంగా బలహీనపడుతూ.. ఒంటరివాడుగా మిగిలిపోతున్నాడు, ఓంటరిగానే తన కధను అర్ధంతరంగా ముగించుకుంటున్నారు. నిరంతరం మన సెల్ ఫోన్స్ లో ఈ ఆత్మహత్యల వీడియోలే వైరల్ అవుతూ చావుని చాలా సులభతర పరిష్కార మార్గాలుగా అందర్నీ తప్పుత్రోవ పట్టిస్తున్నాయి.
అసలు సమస్య ఎక్కడ ప్రారంభమౌతుంది, ఎక్కడ ముగిసిపోతుందో తెలియని అయోమయంలో బ్రతికేస్తున్నాము,
ముందూ వెనుకా ఏ మాత్రమూ ఆలోచించక సమస్యలకి చావడం ఒక్కటే సులభతర పరిష్కార మార్గంగా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ చీకటి ఆలోచనలకు బలౌవుతున్నారు. మార్కులు తక్కువ వచ్చినా, అప్పుతీసుకుని సమయానికి వడ్డీ డబ్బులు కట్టలేకున్నా, ప్రేమలో విఫలమైనా, ఆర్ధిక సమస్యలైనా.. విషయం ఏదైనా.. వయసుతో సంబందం లేకుండా బలవంతపు మరణన్ని ఆశ్రయిస్తున్నారు.
తామే లెకుంటే తమ పిల్లల జీవితాలు ఏమి బాగుపడతాయిలే అని వారిని కూడా తమతోపాటు మరణానికి గురిచేస్తున్నారు. ఎంత దారుణం,
ఆలోచించాలి, ఈ జీవితం నీవు సంపాదించుకున్నది కాదు, నీ జీవితంపై నీకేలాంటి హక్కూ లేదు, భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని నాశనం చేయడానికి నిజంగా మనకేం హక్కు ఉంది.
బ్రదర్ అజయ్ కిషోర్ గారు ఎంతో వేదనతో, బహుబారమైన మనసుతో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ రోజు ఈ వాక్యం మీకందిస్తున్నారు, తప్పనిసరిగా ఇది దేవుని ప్రణాళిక, ఈ మెస్సేజ్ ద్వారా ఏ ఒక్కరికి ఉపకారం జరిగినా మా ప్రయాస దేవుని పట్ల నెరవేరినట్లే. ఆమేన్.




July 01, 2018

క్రీస్తు పునరుత్థానానికి వారంతా సాక్షులయ్యారు! మరి నీవు సాక్షిగా ఉన్నావ...

క్రీస్తు పునరుత్థానానికి వారంతా సాక్షులయ్యారు!
మరి నీవు సాక్షిగా ఉన్నావా?

Rev Guduri Ravikumar Messages, Martin Memorial Baptist Church, Ongole.
బ్రదర్ గూడూరి రవికుమార్ ఒంగోలు పట్టణంలో మార్టిన్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ సంఘమును నడిపిస్తూ దేశంలోని పలు నగరాలలో దేవుని సువార్తను ప్రకటిస్తూ యేసయ్య మహాకృపద్వారా ని ఆత్మల సంరక్షణ విషయంలో తనవంతు భాధ్యతను
నిర్వహిస్తున్నాడు. బాప్టిస్ట్ హోం పేరిట అనాధ బాలల శరణాలయాన్ని నిడిపిస్తున్నాడు. వీరికొరకు మన అనుదిన ప్రార్ధనలో ప్రభువుని వేడుకుందాం. అమేన్.
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.