October 21, 2017

మరియనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆమెకున్న అర్హతలేంటి?? మీకు తెలుసా???...

మరియనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? 
ఆమెకున్న అర్హతలేంటి?? మీకు తెలుసా???

మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ,

పరిశుద్ధ గ్రంధంలో ఎవరికీ లభించని గొప్ప స్థానం మరియకు లభించింది, స్త్రీలలో ఆమె ఆశీర్వదించబడినది, దేవునిచే ఎన్నుకోబడినది, దేవుని కృపకు పాత్రురాలు అయ్యింది, ఎంతగా ఆశీర్వదించబడటానికి మరియలో ఉన్న అర్హతలు ఏంటి? పెండ్లికాని స్త్రీ గర్భవతి అయితే వారిపట్ల సమాజం చూసే చిన్న చూపు, కుటుంబ పరువు మర్యాదలు, ఆనాటి యూదుల కఠిన సాంప్రదాయాలు, శిక్షలు... ఇవేవి ఆనాడు మరియ ఆలోచించలేదు, కేవలం పరమతండ్రి అయిన ఆ దేవదేవుని ఆజ్ఞకు బద్దురాలై రాజాధిరాజుకు జన్మనిచ్చింది. తల్లిగా ఆమెలో విభిన్న కోణాలను మనం చూడవచ్చు. సిలువ మ్రానుపై వేలాడుతూ సర్వోన్నతుడు, పదివేలమందిలో అతిసుందరుడు ఐన తన బిడ్డ దేహమంతా గాయాలై, రక్తమోడుతూ చిత్రహింసలు అనుభవించి ప్రాణాలు విడిచినా.. ఆ భయంకరమైన వేధనను మౌనంగా భరించింది.లోక పాప పరిహారార్ధం తన బిడ్డ శిలువ మ్రానుపై మరణవేదన అనుభవిస్తూ కూడా దేవుని ఆజ్ఞకు లోబడి నడుచుకుంది. దేవుని యెడల తన భాద్యతను గుర్తెరిగినదై మేడగదిలో యేసు శిష్యులతో కలిసి దేవుని ప్రార్ధించింది, స్తుతించింది. ఎంత గొప్ప స్త్రీ మరియ, అందుకే దేవుడు ఆమెను ఎన్నుకొన్నది. అందుకే ఆమె అంతగా ఆశీర్వదించబడిన స్త్రీ అయినది. అమేన్.

No comments:

Post a Comment

If you have any doubts, please let me know