October 27, 2017

తప్పిపోయిన కుమారుడు

యేసుక్రీస్తు తన శిష్యులకు బోధించిన అనేక ఉపమానాల్లో తప్పిపోయిన కుమారుడు (prodigal son) కూడా ఒకటి. లూకా సువార్త 15 వ అధ్యాయంలో ఈ కధ మనకు కనిపిస్తుంది. క్రైస్తవులకే కాక ఇతరులకు కూడా బాగా చిరపరిచితమైన కధ ఇది. ఎంతో గొప్ప లోతైన మర్మములు కలిగిన కధ. చెడిపోయిన బిడ్డలను తండ్రి తప్పక చేరదీసి క్షమించి ఆదరిస్తాడనే గొప్ప నమ్మకాన్ని ఈ కధ ద్వారా యేసయ్య మనకు వివరిస్తాడు. మనం ఎంతటి ఘోర పాపులమైనా.. అన్నీ కోల్పోయినా చివరకు నా అన్నవారే చీదరించినా తప్పక ఆ యేసయ్య మనల్ని ఆదరిస్తాడు, అక్కున చేర్చుకుంటాడు.

నేడు ఎంతోమంది నా అనేవాళ్ళు లేక, ఆదరించే వారు కానరాక, దారి తప్పి, అనాధలుగా జీవిస్తున్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. ఎంతో గొప్పగా మలుచుకోవలసిన అందమైన భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. నేటికైనా వారు తమ జీవితమేమిటో, తమ ప్రయాణం ఎటువైపుగా సాగిపోతుందో గ్రహించాలి, గమ్యంలేని తమ బ్రతుకులకు నిజమైన గమ్యం యేసే అని గ్రహించగలగాలి. అలా గ్రహించగలిగిన నాడు వారు మన కధలోని తప్పిపోయిన కుమారుని లాగే తన తండ్రి ఇంటికి తిరిగి వస్తారు. జీవితాన్ని తిరిగి కాంతిమయం చేసుకుంటారు.

తప్పిపోయిన కుమారుని కోసం ఆ తండ్రి చేతులు చాచి ఏవిధంగా ఐతే ఎదురుచూస్తున్నాడో అలాగే మన తండ్రి ఐన యేసయ్య కూడా నీ కొరకు నాకొరకు చేతులు చాచి ఎదురుచుస్తూనే ఉన్నాడు. ఎప్పటికైనా వాస్తవాల్ని గ్రహించి, సాతాను చెరను, ఆ సంకెళ్ళనూ విడిపించుకుని తన సన్నిధికి వస్తావని ఎదురుచూస్తూనే ఉన్నాడు. గొప్ప విందును చేయడానికి సిద్దపడి ఆశగా నీవైపు చూస్తున్నాడు.

సహోదరుడా.. గ్రహించు.. మన బంగారు భవిష్యత్తు చీకటికూపాల్లో పడి ఆరిపోకూడదు, నిత్యనరకాగ్నిలో పడి మాడి మసి అవ్వకూడదు. ఆలోచించండి. మన జీవిత ప్రయాణం ఎటువైపు ?
 సాతను చీకటి ప్రపంచం వైపా..? లేక నాడు నీకొరకు నా కొరకు సిలువపై ప్రాణాలొడ్డిన మన తండ్రివైపా..? ఆలోచించు, రక్షణ మార్గం అనుసరించు, యేసులో తిరిగి జన్మించు. ఆమేన్.

Watch and subscribe 
తప్పిపోయిన కుమారుడు - Prodigal Son

No comments:

Post a Comment

If you have any doubts, please let me know