September 18, 2016

గుణవతియైన భార్య దొరుకుట అరుదు...అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది. 
(సామెతలు 31:10)

Wife Appreciation Day. On: Sept 20.2015
-------------------------------------------------------

రుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని వానికి సాటియైన సహాయము కావాలని ఆరు రోజులు ఆలోచించి మరీ యెహోవా దేవుడు స్త్రీని అధ్భుతంగా మలిచాడు(ఆదికాండము 2:18).
 ఆ మలచడంలో కూడా ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీలేదు (1 కొరింథీ 11:11)
అనే భావాం వ్యక్తమయ్యేలా ఆమెను పురుషుని నుండే గ్రహించి విశిష్ట స్థానాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. 
ఒక తల్లిగా.. చెల్లిగా.. అత్తగా.. కోడలిగా.. కూతురుగా.. భార్యగా.. ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారు మనకు బైబిల్ లో చాలమంది తారసపడతారు. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో స్త్రీ యొక్క ప్రాదాన్యత ఎంతగా ఉంటుందో వారు చెప్పకనే చెప్పారు. ఆమె ఏ రీతిగా ఉండాలో... ఎలా ఉందకూడదో చాలా సున్నితంగా హెచ్చరించారు కూడా. 
నెనరుగల (gracious) స్త్రీ ఘనతనొందును (సామెతలు 11:16) 
యవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెను (1 తిమోతి 5:14) 
ఆలాంటి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము (సామెతలు 12:4).


పురుషుడు కూడా తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు 
(ఆదికాండము 2:24)
అని చక్కగా భార్యభర్తల స్థితిని బైబిల్ తెలియపరచింది. అలాగే ఉత్తమమైన భార్య జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును (సామెతలు 31:26), 
ఆమె తన యింటివారి నడతలను బాగుగా కనిపెట్టును, పనిచేయకుండ ఆమె భోజనము చేయదు (సామెతలు 31:27) 
అని ఆమెలోని కార్యదక్షత, కుటుంబం యెడల గల నిబద్దతని వివరించింది.
కేవలం కుటుంబమే కాక దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి (1 పేతురు 3:5) 
అని దేవుని యెడల తమలో ఉన్న భక్తి విశ్వాసాలను వ్యక్తం చేశారు.
నాణేనికి రెండవ వైపు వున్నట్టుగానే స్త్రీ అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము.. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును (సామెతలు 31:30). అని దిశానిర్దేశం చేశారు. 

అంతటి మహోన్నత స్థానాన్ని అలంకరించిన స్త్రీ నేటికినీ అదే విధంగా కుటుంబ వ్యవస్థకు మూలస్థంభమై ప్రపంచ భవిష్యత్తుకు బాటలు వేస్తున్నది.
పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు (గలతీ 3:28) 

అని చెప్పిన విషయాన్ని మనమూ మరోమారు గుర్తుచేసుకుందాము.. మన చుట్టూ ఉన్న మన అమ్మ.. అక్క.. చెల్లెళ్ళను గౌరవిద్దాము. మన ఔన్నత్యాన్ని చాటుకుందాము. 
Amen...

Watch and Subscribe HOPE Nireekshana TV YouTube Channel.

No comments:

Post a Comment

If you have any doubts, please let me know