నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.కీర్తనలు 55:22 నీ హృదయము వేదనతో నిండిన సమయంలో.. బాధల బందకాలతో కృంగిన వేళలో... అనారోగ్యము నీ శరీరమును కృశింపజేసే ఘడియలో... ఆప్పుల సమస్యలలో సతమయ్యే కాలంలో... ఆర్ధిక పరిస్థితులన్ని నీకు అననుకూలంగా మారే ధుర్భరకాలంలో... నా అనుకున్న వారే నిను గెంటివేసే పరిస్థితిలో... శత్రుసమూహం నీమీదికి లేచి నిన్ను అల్లకల్లోలం చేయు విషమస్థితిలో... తల్లి తండ్రులు.. భార్యా పిల్లలు.. అక్కచెళ్ళెళ్ళు, అన్నతమ్ముళ్ళు, బంధుమిత్రుల ఆదరణ రవ్వంత కూడా నీవు నోచుకోక నిరాశా నిస్పృహలతో మరణమే శరణము అనుకునే స్థితిలో... అంతా నిరామయం... చీకటి... కనుచూపు మేరలో కానరాని అవకాశం... అప్పుడు... అప్పుడు...సరిగ్గా అలాంటి స్థితిలో నీవు మహోన్నతుడు.. సర్వశక్తిమంతుడు.. సర్వాధికారి.. రాజులకు రాజు.. ప్రభువులకు ప్రభువు.. పరమవైద్యుడు ఐన ఆ యేసయ్య వైపు తిరిగి నీ చేతిని చాచగలిగితే... నీ యొక్క సమస్త భారమును ఆయన తీసివేసి నీకు శాంతిని కలుగజేస్తాడు.
ఆయన మనుష్య కుమారుడిగా వచ్చింది మనకోసం, ఆ అందాల మోముపై ఉమ్మి వేయించుకుంది మనకోసం, శరీరం గాయాలతో నెత్తుటి జల్లెడల చేసుకుంది మనకోసం, శిలువమ్రానుపై రోధించి..వేదనచెంది మనణానికి తనను తాను అప్పగించుకుంది మనకోసం... మూడవ రోజు మరణపు ముల్లు విరిచి మృతుంజయుడు అయ్యింది కూడా కేవలం మనకోసమే... ఆయన వైపు చూస్తే విజయం నీవెంట వస్తుంది, యేసోపును.. యోబును.. ఆశీర్వదించిన మన దేవుడు మనల్ని కూడా తప్పక ఆదరిస్తాడు. మనల్ని మనము ఆయనకు ఆప్పగించుకోగలిగితే... ఎడారిలో ఉన్నా.. అగాధసముద్రాలలో ఉన్నా.. నీవే స్థితిలో ఉన్నా..నీకు భయం లేదు.. ఈ రోజు నీవు ఏస్థితిలో ఉన్నా చేతినందించి ఆదుకునేవారు ఒకరు నీకొరకు సిద్దంగా ఉన్నారని మరువకు.. ఈ రోజే నీసమస్యల పరిధిలోనుండి బయటకు రా!!! నీ ఎదురుగా నిలబడి చేతులు చాచి ఎదురుచూస్తున్న నీ నా యేసయ్యను చూద్దాము!!! మన భారము యేసయ్య మీద మోపుదాము, ఆయనే నిన్ను నన్ను ఆదుకొనును, త్వరపడి యేసయ్య సన్నిదికి చేరుదాం..రక్షణ పొందుదాం. ఆమేన్.. ---------------------- Watch and Subscribe HOPE Nireekshana TV YouTube Channel.... God bless you.
September 23, 2016
నీవు దేవుని ప్రియ కుమారునివి, కుమార్తెవు.
తప్పులు చేసినా, పడిపోయినా ఆయన నీచేయి విడువడు. ఆయన ప్రేమను గుర్తెరిగి ఆయన దరి చేరుకోగలిగితే నీవెంతటి ఘోరపాపివైనా, నిన్ను క్షమించి అక్కున చేర్చుకునే గొప్ప తండ్రి యేసయ్య. లోకసంబంధమైన పాపములో పడిపోయి అవి శాశ్వతం అని భావించకు, సాతాను శోధనలో పడి యేసయ్యను మరువకు. అశాశ్వతమైన ఈ శరీరాన్ని.. మనది కాని ఈ లోకాన్నీ శాశ్వతం అనుకోకు, సౌలుగా లోకంలో పడిపోయినా దేవుని గుర్తెరిగి పౌలుగా, అపోస్తలుడిగా మారాడు.. క్షణికావేశంలో చెవి నరికినా... పలుమార్లు దేవుని నేనెరుగను అని పలికినా... విరిగినలిగిన హృదయముతో తనను తాను తగ్గించుకున్న పేతురు దేవుని చిత్తములో స్థిరమైన బండరాయిగా ప్రభువు ప్రేమలో నిలిచిపోయాడు.
మనమూ అదే రీతిలో దేవుని ప్రేమను.. ఆయనలోని కరుణను.. తెలిసికొని ప్రియకుమారునిగా.. కుమార్తెగా మారుదాము. ఆమేన్.
subscribe our HOPE Nireekshana TV Christian Devotional YouTube Channel.
Watch and Subscribe HOPE Nireekshana TV YouTube Channel..
God bless You
September 22, 2016
“Love your enemies,do good to those who hate you, bless those who curse you, pray for those who mistreat you” - (Luke 6:27-28).
It is easy to be good to those who are good to us. It is much harder to be good to those who harm us. However, this is exactly what Christ commands us to do. In fact, He took this thought a step further by commanding us to love those who are our enemies.
“You have heard that it was said, ‘Love your neighbor and hate your enemy.’ But I tell you, love your enemies and pray for those who persecute you,”(Matthew 5:43-44). Jesus admonished His followers to respond to those who hurt them with love so that His followers would become sons and daughters of God (Matthew 5:45).
If we are honest, then we must admit that often our first reaction to Christ’s words is one of defensiveness. We want to proclaim our rights and demand justice. God, however, has a different route for us to take and that is one of mercy and grace. He instructs us to treat others the way we would want to be treated.
Paul is quick to remind the Galatian believers that their hearts must be set on God’s goodness because goodness is an essential fruit of the Spirit. Sometimes, this means being good to those who have been bad to us. Not fair, you say?
The next time you feel as though an injustice has been committed against you, remember the Savior. He endured both rejection and insult, and He continued to demonstrate God’s infinite love and mercy even to those who crucified Him.
Let Jesus’ ultimate display of love be your inspiration as you respond in love to everyone you encounter today—even to those who have hurt you in the past. The evidence of Christ’s life within is the outward display of His goodness, mercy and grace. May the Lord bless you as you seek to be more like Him each day.
గుణవతియైన భార్య దొరుకుట అరుదు...అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది. (సామెతలు 31:10)
Wife Appreciation Day. On: Sept 20.2015 ------------------------------------------------------- నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని వానికి సాటియైన సహాయము కావాలని ఆరు రోజులు ఆలోచించి మరీ యెహోవా దేవుడు స్త్రీని అధ్భుతంగా మలిచాడు(ఆదికాండము 2:18). ఆ మలచడంలో కూడా ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీలేదు (1 కొరింథీ 11:11) అనే భావాం వ్యక్తమయ్యేలా ఆమెను పురుషుని నుండే గ్రహించి విశిష్ట స్థానాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. ఒక తల్లిగా.. చెల్లిగా.. అత్తగా.. కోడలిగా.. కూతురుగా.. భార్యగా.. ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారు మనకు బైబిల్ లో చాలమంది తారసపడతారు. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో స్త్రీ యొక్క ప్రాదాన్యత ఎంతగా ఉంటుందో వారు చెప్పకనే చెప్పారు. ఆమె ఏ రీతిగా ఉండాలో... ఎలా ఉందకూడదో చాలా సున్నితంగా హెచ్చరించారు కూడా. నెనరుగల (gracious) స్త్రీ ఘనతనొందును (సామెతలు 11:16) యవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెను (1 తిమోతి 5:14) ఆలాంటి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము (సామెతలు 12:4).
పురుషుడు కూడా తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు (ఆదికాండము 2:24) అని చక్కగా భార్యభర్తల స్థితిని బైబిల్ తెలియపరచింది. అలాగే ఉత్తమమైన భార్య జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును (సామెతలు 31:26), ఆమె తన యింటివారి నడతలను బాగుగా కనిపెట్టును, పనిచేయకుండ ఆమె భోజనము చేయదు (సామెతలు 31:27) అని ఆమెలోని కార్యదక్షత, కుటుంబం యెడల గల నిబద్దతని వివరించింది. కేవలం కుటుంబమే కాక దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి (1 పేతురు 3:5) అని దేవుని యెడల తమలో ఉన్న భక్తి విశ్వాసాలను వ్యక్తం చేశారు. నాణేనికి రెండవ వైపు వున్నట్టుగానే స్త్రీ అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము.. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును (సామెతలు 31:30). అని దిశానిర్దేశం చేశారు. అంతటి మహోన్నత స్థానాన్ని అలంకరించిన స్త్రీ నేటికినీ అదే విధంగా కుటుంబ వ్యవస్థకు మూలస్థంభమై ప్రపంచ భవిష్యత్తుకు బాటలు వేస్తున్నది. పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు (గలతీ 3:28) అని చెప్పిన విషయాన్ని మనమూ మరోమారు గుర్తుచేసుకుందాము.. మన చుట్టూ ఉన్న మన అమ్మ.. అక్క.. చెల్లెళ్ళను గౌరవిద్దాము. మన ఔన్నత్యాన్ని చాటుకుందాము. Amen... Watch and Subscribe HOPE Nireekshana TV YouTube Channel.