September 23, 2016

నీవు దేవుని ప్రియ కుమారునివి, కుమార్తెవు.
ప్పులు చేసినా, పడిపోయినా ఆయన నీచేయి విడువడు. ఆయన ప్రేమను గుర్తెరిగి ఆయన దరి చేరుకోగలిగితే నీవెంతటి ఘోరపాపివైనా, నిన్ను క్షమించి అక్కున చేర్చుకునే గొప్ప తండ్రి యేసయ్య. లోకసంబంధమైన పాపములో పడిపోయి అవి శాశ్వతం అని భావించకు, సాతాను శోధనలో పడి యేసయ్యను మరువకు. అశాశ్వతమైన ఈ శరీరాన్ని.. మనది కాని ఈ లోకాన్నీ శాశ్వతం అనుకోకు, సౌలుగా లోకంలో పడిపోయినా దేవుని గుర్తెరిగి పౌలుగా, అపోస్తలుడిగా మారాడు.. క్షణికావేశంలో చెవి నరికినా... పలుమార్లు దేవుని నేనెరుగను అని పలికినా... విరిగినలిగిన హృదయముతో తనను తాను తగ్గించుకున్న పేతురు దేవుని చిత్తములో స్థిరమైన బండరాయిగా ప్రభువు ప్రేమలో నిలిచిపోయాడు.

మనమూ అదే రీతిలో దేవుని ప్రేమను.. ఆయనలోని కరుణను.. తెలిసికొని ప్రియకుమారునిగా.. కుమార్తెగా మారుదాము. ఆమేన్.
subscribe our HOPE Nireekshana TV Christian Devotional YouTube Channel.



No comments:

Post a Comment

If you have any doubts, please let me know