Showing posts with label kumar. Show all posts
Showing posts with label kumar. Show all posts

August 10, 2017

శిలువ ఏడుమాటల్లో... నీ తండ్రి ప్రేమను ఊహించగలవా? | Bro Ravi Kumar, Ongo...

❄ సిలువ ఏడుమాటల్లో నీ తండ్రి ప్రేమను ఊహించగలవా? ❄ 

Bro Guduri Ravi Kumar wonderful message, 

Martin Memorial Baptist Church, Ongole.

మన తండ్రి అయిన యేసయ్య శిలువలో తాను మరణిస్తూ ఏడుమాటలను పలికాడు. ఆ ఏడుమాటల్లో ఎంతటి అర్ధమున్నదో.. మరెంతటి పరమార్ధమున్నదో ఎన్ని సార్లు విన్నా కొత్తగానే ఉంటుంది, అశ్చర్యకరంగానే ఉంటుంది. ఎందుకంటే గొల్గొత కొండమీద పలికిన ఆ ఏడుమాటల్లో తండ్రికి మనపట్ల ఉన్న బాధ్యత, ప్రేమ చెప్పకనే అర్ధం అవుతుంది. ఆ ఏడుమాటల్లో గల వైవిధ్యాన్ని మరోకోణంలో చక్కగా వివరించాడు బ్రదర్ రవికుమార్. ప్రతిఒక్కరు తప్పక చూసి దేవుని ఆత్మీయ మేలులను పొందుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ మిత్రులకు share చెయ్యగలరు. వందనాలు.



ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Watch Our latest Videos...

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

January 16, 2017

నీ సంఘానికి ద్వారపాలకుడు నీవే! | Bro.Pradeep Kumar Messages | Jesus Mira...

నీ సంఘానికి ద్వారపాలకుడు నీవే!  
Bro.Pradeep Kumar Messages

ఆత్మలను సంఘానికి తీసుకుని వచ్చి వారికి రక్షణను అందించడం ఎంత అవసరమో.. రక్షించబడివారు తిరిగి దారి తప్పకుండా చూసుకోవలసిన అవసరం కూడా మనపైనే ఉంటుంది. మన సంఘంలోనికి ఏ సాతాను శోదనలు ప్రవేశించకుండా ద్వారపాలకునివలే చూసుకోవాలి, కొత్త ఆత్మలను సంపాదించుకోవాలి, సంపాదించిన ఆత్మలు తిరిగి దారితప్పకుండా సంరక్షించుకోవాలి. కేవలం చర్చికి వెళ్ళి మన బాద్యత ఐపోయిందని భావించక సంఘంలో భాగస్థులమై దావీదు వలే అలోచించి దేవునికి మరింతగా దగ్గర కావాలి. ఆమేన్.



దావీదు మహారాజు
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 

Watch, Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel. 







January 09, 2017

నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము | Bro.Pradeep Kumar Messag...

Watch Bro.Pradeep Kumar's telugu Christian video message 

నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము

నం ఏమి కావలెనో... ఏ విధంగా మనల్ని ఉపయోగించుకోవాలో మన పరమతండ్రికి ముందే తెలుసు, ఆయన నిర్ధేశించిన మార్గంలో మనం ప్రయాణించగలిగితే మనద్వారా అధ్ధుతాలు చేయిస్తాడు, అంతే కాక మనద్వారా మరికొన్ని ఆత్మలను ఆయన మందిరంలోకి నడిపిస్తాడు. మనం ఆయన మందిరపు ద్వారాల వద్ద కాపరులవలే ఉండగలిగిన నాడే మన ద్వారా మరికొన్ని ఆత్మలు రక్షించబడతాయి, దారి తప్పిపోతున్న వారిని తిరిగి సక్రమమైన మార్గంలో నడిపించబడటానికి తోడ్పడుతాము. దావీదు మహరాజు కూడా కీర్తనల గ్రంధం 84వ అధ్యాయం 10వ వచనంలో "నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుకంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నా కిష్టము. అని పలికాడు. అట్టి జీవితం మనకూ అనుగ్రహింపమని మన తండ్రిని వేడుకుందాము. అమేన్.







మా వీడియోలు మీకు నచ్చితే తప్పక like చేసి మీ మిత్రులకు share చేయగలరు

మా చానెల్ లోని ఈ క్రింది వీడియోలను మీరు క్లిక్ చేసి వెంటనే చూడవచ్చు.

దావీదు మహారాజు

మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ

బైబిల్ చరిత్ర 

Watch, Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel. 


January 02, 2017

మన నిజమైన పిలుపు | తెలుగు | Bro.Pradeep Kumar | Jesus Miracles Ministrie...

మన నిజమైన పిలుపు

బ్రదర్ ప్రదీప్ కుమార్ గారి అధ్భుతమైన దేవుని వాక్య ప్రసంగం, దేవుని యొక్క తలంపులను, ఆశీర్వాదాలను, ప్రణాళికలు మనకు అర్ధం కానేకావు, మనకు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఎవ్వాలో ఆ దేవాదిదేవునికి తెలుసు. మనం కోరుకున్నదానిని పొందుకోలేకపోతున్నామనే చింతలో జీవించవద్దు, మనల్ని, మన ఆలోచనలను, మన భవిష్యత్తుని యేసయ్య చేతులకు అప్పగించినా.. రెట్టిపు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. సణగడం వలన ఉపయోగం ఏముంటుంది? నమ్మిక కలిగి జీవించాలి, దేవుడు ఇచ్చే ఫలాలను ఆనందంగా అందుకోవాలి.







ఈ వీడియో మీకు నచ్చితే తప్పక మీ మిత్రులకు, బంధువులకు share చేయండి, వారిని కూడా మన channel subscribe చేసేలా ప్రోత్సహించండి. ధన్యవాదాలు.


December 25, 2016

Bro.Anil Kumar | Latest Christian Worship Song | Jesus Miracles | HOPE N...

బ్రదర్.అనిల్ కుమార్ స్తుతి ఆరాధన

జీసస్ మిరాకిల్స్ మినిస్ట్రీస్ వారు విజయవాడలోని మందిరం 2వ వార్షికోత్సవం సందర్భంగా దేవుని సేవలో బహుగా వినియోగించబడుతూ దేశ విదేశాల్లో అధ్భుతమైన ప్రసంగాలు, మైమరపించే స్తుతి గీతాలతో దేవుని ఆరాదిస్తూ లక్షలాదిమందికి దేవుని సువార్తను అందిస్తున్న బ్రదర్.అనిల్ కుమార్ గారు ముఖ్య ప్రసంగీకులుగా వచ్చి దేవుని స్తుతించి మహిమపరచి ఘనపరిచారు. బ్రదర్ ప్రదీప్ కుమార్ గారు విజయవాడ మరియూ గుడివాడ పట్టణాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తూ గొప్పగా దేవుని పరిచర్యను చేస్తున్నారు.







 వారిద్దరి కలయికలో ఈ రోజు జీసస్ మిరకిల్స్ మినిస్ట్రీస్, విజయవాడ చర్చి దేవుని స్తుతి గీతాలతో, అరాధనతో, వాక్య పరిచర్యతో గొప్ప మహిమను సంతరించుకుంది, దైవజనుల ప్రసంగాలు, పాటలను విని దేవుని బిడ్డలు ఆత్మీయంగా బలపరచబడ్డారు.

Subscribe HOPE Nireekshana TV YouTube Channel 

October 31, 2016

యేసయ్య... ప్రేమామయుడు | Bro.Pradeep Kumar Messages | Jesus Miracles | HO...

యేసయ్య... ప్రేమామయుడు

న ప్రియ ప్రభువైన యేసు నమ్మదగినవాడు, ప్రేమమూర్తి, దయామయుడు, సమస్తమూ ఎరిగిన వాడు, మనదోషములను ఎంచక, మన పాపములను క్షమించి..పశ్చాతాపముతో వచ్చిన ప్రతిఒక్కరిని అక్కున చేర్చుకుని ఆదరించే ప్రేమామయుడు. అంతటి మహిమాన్వితుడు కాబట్టే తను ఏర్పరచిన జనం తన మొహం మీద ఉమ్మి వేస్తారని తెలిసినా ప్రేమించాడు, కొరడా దెబ్బలతో వళ్ళు తూట్లు పొడిచి అతి సుందరమైన తన శరీరాన్ని జల్లెడ చేస్తున్నా భరించలేని ఆ భాధను మౌనంగా భరించాడు. శిలువమ్రానుపై కాళ్ళూచేతుల్లో మేకులు కొట్టి పక్కలో పొడిచినా "తండ్రీ వీరేమిచేయుచున్నారో వీరికే తెలియదు, వీరిని క్షమించండి మనకొరకు అంతటి వేదనకరమైన సమయంలోను మన కొరకు మనము చేయు పాపముల కొరకు తన తండ్రిని వేడుకున్నాడు.







అంతటి ప్రేమామయుని బిడ్డలుగా మనము అటువంటి లక్షణాలే అలవరచుకుని సాతి మనుషుల యెడల ప్రేమను పంచుదాం. యేసయ్య బిడ్డలుగా పరిపూర్ణులవుదాము.

subscribe HOPE Nireekshana TV YouTube Channel


October 24, 2016

మనిషి స్వేచ్చ - దేవుని ప్రేమ | Bro. Pradeep Kumar Messages | HOPE Nireek...

మనిషి స్వేచ్చ - దేవుని ప్రేమ

నిషిగా మలుచుకున్న తన బిడ్డలను దేవుడు చాలా ప్రేమించాడు, కావలసినంత స్వేచ్చను అనుగ్రహించాడు, ఎంతటి పాపాత్ములనైనా కరుణించి ఆలింగనం చేసుకుని తిరిగి తన బిడ్డలనుగా చేసికొని ఆదరించే వాడు యేసయ్య. ఆదాముకు స్వేచ్చను ఇచ్చాడు, పండు తినవద్దన్నా వినక తిని పాపంలో పడిపోయాడు, గొర్రెల కాపరి ఐన దావీదును ఇశ్రాయేలు జనాంగానికి రాజుని చేసాడు, దావీదు పాపం చేసినా క్షమించాడు, ఆ మొద్దు నుండే తను చిగురుగా వచ్చి తన గొప్ప ప్రేమను చాటుకున్నాడు. అలాంటి దృష్ట్యాంతాలు మనం బైబిల్ లో చాల చూడవచ్చు, ఆలాంటి దేవుని ప్రేమ గురించి బ్రదర్ ప్రదీప్ కుమార్ గారు తన ప్రసంగంలో చక్కగా వివరించారు. ఈ వీడియో మీకు నచ్చితే మీ తోటివారికి share చేయగలరు. తప్పక HOPE Nireekshana TV channel ని subscribe చేయగలరు.
ఆమేన్.

October 03, 2016

ఓటమిలో విజయం | Bro.Pradeep Kumar Messages | Jesus Miracles | HOPE Nireekshana TV

ఓటమిలో విజయం

యేసయ్యను నీవు విశ్వాసంతో నమ్మి వెంబడించగలిగితే నీ జీవితంలో అపజయాలు ఎదురైనా అవి తాత్కాలికమే.. ఆ అపజయంలో నుండే నీవు విజయం సాధిస్తావు. మనం పరిశుద్ధ గ్రంధములో అలా ఓటమి పాలైనా మొక్కవోని విశ్వాసంతో తిరిగి రెట్టింపు, ఏడంతలుగా ఇంకా ఎన్నో రెట్లు ఆశీర్వదించబడిన వారిని మనం చూస్తాము. యాకోబు జీవితంలో పెనూయేలు సంఘటన తరువాతే తను ఇశ్రాయేలుగా మారి దేవునిచే దీవించబడ్డాడు. యోబు సర్వస్వం కోల్పోయినా దేవుని చేతిని విడువక మరింతగా ఆశీర్వదించబడ్డాడు.

ప్రియ మిత్రులారా!

ఈ రోజు నువ్వూ నేనూ ఓటమి అంచుల్లో ఉండిఉండవచ్చు, చావే శరణ్యం అని నీ పరిస్థితులు అనిపించవచ్చు, ఒక్కసారి యేసయ్య వైపు చూడు..

నీ ఓటమి విజయం వైపు పయనిస్తుంది,

నీవున్న చోటనే గొప్పగా అశీర్వదించబడతావు..

అమేన్.

Subscribe: HOPE Nireekshana TV YouTube Channel

September 27, 2016

నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. కీర్తనలు 55:22
నీ హృదయము వేదనతో నిండిన సమయంలో..
బాధల బందకాలతో కృంగిన వేళలో...
అనారోగ్యము నీ శరీరమును కృశింపజేసే ఘడియలో...
ఆప్పుల సమస్యలలో సతమయ్యే కాలంలో...
ఆర్ధిక పరిస్థితులన్ని నీకు అననుకూలంగా మారే ధుర్భరకాలంలో...
నా అనుకున్న వారే నిను గెంటివేసే పరిస్థితిలో...
శత్రుసమూహం నీమీదికి లేచి నిన్ను అల్లకల్లోలం చేయు విషమస్థితిలో...
తల్లి తండ్రులు.. భార్యా పిల్లలు.. అక్కచెళ్ళెళ్ళు, అన్నతమ్ముళ్ళు, బంధుమిత్రుల
ఆదరణ రవ్వంత కూడా నీవు నోచుకోక
నిరాశా నిస్పృహలతో మరణమే శరణము అనుకునే స్థితిలో...
అంతా నిరామయం... చీకటి... కనుచూపు మేరలో కానరాని అవకాశం...
అప్పుడు... అప్పుడు...సరిగ్గా అలాంటి స్థితిలో నీవు
మహోన్నతుడు..
సర్వశక్తిమంతుడు..
సర్వాధికారి..
రాజులకు రాజు.. ప్రభువులకు ప్రభువు..
పరమవైద్యుడు ఐన ఆ యేసయ్య
వైపు తిరిగి నీ చేతిని చాచగలిగితే...
నీ యొక్క సమస్త భారమును ఆయన తీసివేసి నీకు శాంతిని కలుగజేస్తాడు.


ఆయన మనుష్య కుమారుడిగా వచ్చింది మనకోసం,
ఆ అందాల మోముపై ఉమ్మి వేయించుకుంది మనకోసం,
శరీరం గాయాలతో నెత్తుటి జల్లెడల చేసుకుంది మనకోసం,
శిలువమ్రానుపై రోధించి..వేదనచెంది మనణానికి తనను తాను అప్పగించుకుంది మనకోసం...
మూడవ రోజు మరణపు ముల్లు విరిచి మృతుంజయుడు అయ్యింది కూడా కేవలం మనకోసమే...
ఆయన వైపు చూస్తే విజయం నీవెంట వస్తుంది,
యేసోపును.. యోబును.. ఆశీర్వదించిన మన దేవుడు మనల్ని కూడా తప్పక ఆదరిస్తాడు.
మనల్ని మనము ఆయనకు ఆప్పగించుకోగలిగితే...
ఎడారిలో ఉన్నా.. అగాధసముద్రాలలో ఉన్నా.. నీవే స్థితిలో ఉన్నా..నీకు భయం లేదు..
ఈ రోజు నీవు ఏస్థితిలో ఉన్నా చేతినందించి ఆదుకునేవారు ఒకరు
నీకొరకు సిద్దంగా ఉన్నారని మరువకు..
ఈ రోజే నీసమస్యల పరిధిలోనుండి బయటకు రా!!!
నీ ఎదురుగా నిలబడి చేతులు చాచి ఎదురుచూస్తున్న నీ నా యేసయ్యను చూద్దాము!!!
మన భారము యేసయ్య మీద మోపుదాము, ఆయనే నిన్ను నన్ను ఆదుకొనును,
త్వరపడి యేసయ్య సన్నిదికి చేరుదాం..రక్షణ పొందుదాం.
ఆమేన్..

----------------------
Watch and Subscribe HOPE Nireekshana TV YouTube Channel....
God bless you.

September 23, 2016

నీవు దేవుని ప్రియ కుమారునివి, కుమార్తెవు.
ప్పులు చేసినా, పడిపోయినా ఆయన నీచేయి విడువడు. ఆయన ప్రేమను గుర్తెరిగి ఆయన దరి చేరుకోగలిగితే నీవెంతటి ఘోరపాపివైనా, నిన్ను క్షమించి అక్కున చేర్చుకునే గొప్ప తండ్రి యేసయ్య. లోకసంబంధమైన పాపములో పడిపోయి అవి శాశ్వతం అని భావించకు, సాతాను శోధనలో పడి యేసయ్యను మరువకు. అశాశ్వతమైన ఈ శరీరాన్ని.. మనది కాని ఈ లోకాన్నీ శాశ్వతం అనుకోకు, సౌలుగా లోకంలో పడిపోయినా దేవుని గుర్తెరిగి పౌలుగా, అపోస్తలుడిగా మారాడు.. క్షణికావేశంలో చెవి నరికినా... పలుమార్లు దేవుని నేనెరుగను అని పలికినా... విరిగినలిగిన హృదయముతో తనను తాను తగ్గించుకున్న పేతురు దేవుని చిత్తములో స్థిరమైన బండరాయిగా ప్రభువు ప్రేమలో నిలిచిపోయాడు.

మనమూ అదే రీతిలో దేవుని ప్రేమను.. ఆయనలోని కరుణను.. తెలిసికొని ప్రియకుమారునిగా.. కుమార్తెగా మారుదాము. ఆమేన్.
subscribe our HOPE Nireekshana TV Christian Devotional YouTube Channel.



ఈ లోకాన్ని మనం ప్రేమించాలా...? | తెలుగు | with scriptures | HOPE Nireeks...

Watch and Subscribe HOPE Nireekshana TV YouTube Channel..

God bless You



September 22, 2016


“Love your enemies, do good to those who hate you, bless those who curse you, pray for those who mistreat you” - (Luke 6:27-28).

It is easy to be good to those who are good to us. It is much harder to be good to those who harm us. However, this is exactly what Christ commands us to do. In fact, He took this thought a step further by commanding us to love those who are our enemies.

“You have heard that it was said, ‘Love your neighbor and hate your enemy.’ But I tell you, love your enemies and pray for those who persecute you,”(Matthew 5:43-44). Jesus admonished His followers to respond to those who hurt them with love so that His followers would become sons and daughters of God (Matthew 5:45).


If we are honest, then we must admit that often our first reaction to Christ’s words is one of defensiveness. We want to proclaim our rights and demand justice. God, however, has a different route for us to take and that is one of mercy and grace. He instructs us to treat others the way we would want to be treated.

Paul is quick to remind the Galatian believers that their hearts must be set on God’s goodness because goodness is an essential fruit of the Spirit. Sometimes, this means being good to those who have been bad to us. Not fair, you say?

The next time you feel as though an injustice has been committed against you, remember the Savior. He endured both rejection and insult, and He continued to demonstrate God’s infinite love and mercy even to those who crucified Him.

Let Jesus’ ultimate display of love be your inspiration as you respond in love to everyone you encounter today—even to those who have hurt you in the past. The evidence of Christ’s life within is the outward display of His goodness, mercy and grace. May the Lord bless you as you seek to be more like Him each day.

Amen.

September 19, 2016

నీ ఓటమిలో దేవుని ఉద్ధేశం | Bro.Pradeep Kumar Messages | Jesus Miracles |...

Watch Our New Video...
క్లిక్ చేసి వీడియో చూచి Subscribe ఛెయ్యగలరు.
www.youtube.com/edit?video_id=HSYGcIxtkgQ




నీ ఓటమిలో దేవుని ఉద్ధేశం | Bro.Pradeep Kumar Messages | Jesus Miracles |...

Watch Our New Video...
క్లిక్ చేసి వీడియో చూచి Subscribe ఛెయ్యగలరు.
www.youtube.com/edit?video_id=HSYGcIxtkgQ




నీ ఓటమిలో దేవుని ఉద్ధేశం | Bro.Pradeep Kumar Messages | Jesus Miracles |...

Watch Our New Video...
క్లిక్ చేసి వీడియో చూచి Subscribe ఛెయ్యగలరు.
www.youtube.com/edit?video_id=HSYGcIxtkgQ