Showing posts with label worship. Show all posts
Showing posts with label worship. Show all posts

February 11, 2018

స్నేహమే నా జీవితం | Happy Friendship Day | Telugu | 2016 | HOPE Nireeksh...

❄❄❄ స్నేహమే నా జీవితం ❄❄❄
Happy Friendship Day
అందరికీ స్నేహితులు ఉంటారు... వారు మంచివారా చెడ్డవారా అనేది మనచుట్టూ ఉన్న సమాజమే నిర్ణయించాలి. మంచి స్నేహం బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తే చెడు స్నేహం అధపాతాళానికి తీసుకెళుతుంది. అందుకే స్నేహం విషయంలో మిత్రుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి... లేదంటే జీవితకాలం నష్టపోతాం. అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు వీరందరు ఆ దేవుడు ఏర్పాటు చేసిన వారు..ఇందులో ఎంపిక ఉండదు, కానీ.. ఫ్రెండ్స్ ను మాత్రం మనమే సంపాదించుకోవాలి. ఈ వీడియో లో మంచి స్నేహం గురించి మంచి స్నేహితాల గురించి అలాగే చెడ్డ మిత్రులను వదిలివేయడం ఎంత ముఖ్యమో కూడా చెప్పడానికి ప్రయత్నించాం. మీకు నచ్చుతుందని, మంచి భవిష్యత్తుకు నిచ్చెన మెట్లవంటి గొప్ప మిత్రులను ఎంచుకుని లైఫ్ ను ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాము. మీకు ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి share చేయడం మరువకండి.


February 04, 2018

బైబిల్లో పక్షిరాజు (డేగ) కు ఎందుకంత ప్రాముఖ్యత?.. దాని ప్రత్యేకత ఏమిటి??...

బైబిల్లో పక్షిరాజు (డేగ) కు ఎందుకంత ప్రాముఖ్యత..?

దాని ప్రత్యేకత ఏమిటి ...???
మనకు డేగ, గ్రద్ద.. ఈగిల్ గా పిలుచుకునే పక్షి గురించి చాలా తక్కువగానే తెలుసు! డేగలో మనం తెలుసుకోవలసినవి.. అనుకరించవలసినవి... అనుసరించవలసినవి ఎన్నో ఉన్నాయి. మన బైబిల్లో కూడా పక్షులలో రాజుగా పక్షిరాజుగా డేగను పిలిచారు.. ఎంతో గొప్పగా పొగిడారు. అంతటి గొప్ప లక్షణాలు కలిగిన పక్షిగురించి.. దానిలో ఉన్న ఆ గొప్ప లక్షణాలగురించి మనం తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
ఎవరికీ అందనెత్తులో ఎగురుతూ..
తన ఆహారాన్ని తానే సేకరించుకుంటూ..
పరిస్థితులుకు తగ్గట్టు తనను తానే మార్చుకుంటూ..
మరో కొత్త జన్మకు ఊపిరి పోసుకుంటూ...
పక్షిరాజుగా మన్ననలూ అందుకుంటూ...
ఆకాశంలో విహరించే పక్షులకు మహరాణిగా పిలిపించుకుంటూ..
దర్జాగా జీవించే డేగ మనకు ఎప్పటికీ ఆదర్శమే..
Praise the Lord, Amen.
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పక మీ బంధువులకు స్నేహితులకు share చెయ్యండి. చానెల్ ను subscribe చేయించండి. praise the Lord, Amen.


January 25, 2018

ఉదయకాల ప్రార్ధన - Morning Prayer - ఉదయాన్నే ఎందుకు ప్రార్ధించాలి! - HOPE...

ఉదయకాల ప్రార్ధన - Morning Prayer...

ఉదయాన్నే ఎందుకు ప్రార్ధించాలి!

ఉదయకాల ప్రార్ధనలో ఎన్ని ఆశీర్వాదాలో...

మనం ప్రతిదినం ఉదయాన్నే ప్రార్ధించడం ప్రారంభించగలిగితే దేవుని సన్నిధిని మనం ఎంతవరకు అనుభవించగలమో... ఎన్ని రకాల లాభాలు మనకు ఒనకూరుతాయో ఈ వీడియోలో సాధ్యమైనంత విపులంగా వివరిచడానికి ప్రయత్నించాము. ఈ వీడియో మీకు తప్పక నచ్చుతుందని భావిస్తున్నాము. నచ్చినట్లైతే తప్పక మీ బంధుమిత్రులకు share చెయ్యగలరు.

Anchor: Sister Geetha Kiran,

Script: Dr.VijayaLakshmi Prasanth,

Tech support: Mahesh Chennuri.

Visualization, Camera, Editing: HOPE Nireekshana TV Team

subscribe Us...

January 06, 2018

యేసుక్రీస్తు ఎప్పుడు జన్మించాడు - అద్భుతమైన విశ్లేషణ - Rev Dr Edward Wil...

యేసుక్రీస్తు ఎప్పుడు జన్మించాడు 
ఎడ్వర్డ్ విలియం గారి అద్భుతమైన విశ్లేషణ

By Rev Dr Edward William Kuntam 

క్రీస్తు పుట్టీ లోకమంతా పండుగ చేసుకుంటున్న ఈ శుభసమయంలో యేసయ్య ఈ లోకాన జన్మించిన రోజు గురించిన ఎన్నో అనుమానాలకు... సవాళ్ళకూ ఎవరికీ ఇబ్బంది కలుగకుండా చారిత్రక ఘట్టాలను ఉదహరిస్తూ క్యాలెండర్ పుట్టు పూర్వోత్తరాలను విశదీకరిస్తూ ఆద్యంతం అద్భుతమైన రీతిలో చక్కగ వివరించారు ఎడ్వర్డ్ విలియం గారు. ప్రతిఒక్కరూ చూచి తెలుసుకోవలసిన ఎన్నో విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి.

Watch and Subscribe our Channel for more videos... 
Praise the Lord.. amen. 

August 28, 2017

ఈ ఆరు కారణాలు చాలు, నీవు దేవునిపై నమ్మిక ఉంచుటకు | Telugu Christian Mess...

ఈ '6 కారణాలు చాలు - నీవు దేవునిపై నమ్మిక ఉంచుటకు!

ఈ హడావుడి జీవిత ప్రయాణంలో ఒకరినొకరు పలుకరించుకునే తీరిక ఓపిక లేని కాలంలో మనం జీవిస్తున్నాము. సమస్య వచ్చినప్పుడు ఒంటరిమై పోయి వేధనకరమైన స్థితిలో రవ్వంత తోడుకొరకు, మాటలు ఆలకించే వారికొరకు ఎదురుచూస్తున్నాము. ఎవరు నిన్ను చేయి విడిచినా నేను నిన్ను విడువను, ఎడబాయను, నిన్ను కన్న తల్లి ఐనా నిన్ను మరిచిపోతుందేమో కాని నేను నిన్ను మరువను అని ఎంతో ప్రేమగా ఆ తండ్రి మనతో పరిశుద్ధగ్రంధంలో చెప్పాడు కదా. అందుకే మనం మనమున్న స్థితి ఏదైనా కావచ్చు, భయపడాల్సిన పని లేదు, భీతిల్లవలసిన అవసరం అంతకన్నాలేదు. ఈ ఆరు వాక్యాలు మీకు ఎంతో ధైర్య్యాన్ని అందిస్తాయని, ఆదరిస్తాయని ఆశిస్తున్నాము.



ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Watch Our latest Videos..

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

August 12, 2017

యాకోబు 12మంది కుమారుల పేర్లు - అందులో యేసు పుట్టుక రహస్యం | Telugu Chris...

❄❄❄ యాకోబు 12మంది కుమారుల పేర్లు  ❄❄❄
❄❄❄ యేసు పుట్టుక రహస్యం ❄❄❄

Jacob 12 Son names and its meaning

ఇస్సాకు కుమారుడైన యాకోబుకు మొత్తం 13 మంది సంతానం కదా! అందులో చివరిసంతానం ఆడపిల్ల కాగా మిగిలిన పన్నెండు మంది పురుష సంతానం. ఆనాడు యాకోబు మగపిల్లలకి పెట్టినపేర్లు బహుశా మనందరికీ తెలిసే ఉంటాయి. లేదా ఆదికాండము 29, 30 ఇంకా 35 అధ్యాయాలలో వీరి పేర్లను మనం చూడవచ్చు. కానీ వారి పేర్ల యొక్క అర్ధాలను తెలుసుకుంటే మాత్రం తప్పక ఆశ్చర్యపోతాము. యాకోబు ఆనాడు యాదృచ్చికంగా తన 12మంది మగపిల్లలకి ఆ యా పేర్లు పెట్టాడు అని భావించలేము. అది ఖచ్చితంగా దేవుని తలంపే. పాతనిబంధనలో ఎంతో మంది ప్రవక్తలు యేసుప్రభుని పుట్టుకను గూర్చి ప్రవచనాలు చెప్పియున్నరు. అదే రీతిలో యాకోబు తన సంతానానికి పెట్టిన పేర్లద్వారా కూడా దేవాదిదేవుడు క్రీస్తుయొక్క రాకడను గూర్చి, ఆయన రాకలోని అంతరార్ధాన్ని గురించి ఈ లోకానికి ముందుగానే సెలవిచ్చియున్నాడు. ప్రతిఒక్కరు ఈ వీడియోని చూసి మీకు నచ్చితే తప్పక మీ మిత్రులకు share చెయ్యగలరు. అమేన్.



ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజ
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

August 03, 2017

క్రైస్తవ కుటుంబమా! యెఫ్తా అతని కుమార్తె మనకు మాదిరి కాదా? | Bro Ravi Kum...

❄ యేసులో నీ స్థితి ఏమిటి - యెషయా ప్రవక్త హెచ్చరిక ❄

Rev Guduri Ravi Kumar Messages, Ongole. 

న్యాయాధిపతుల గ్రంధంలో 11వ అధ్యాయంలో మనం యెఫ్తా ను గురించి అధ్యయనం చేయవచ్చు. వేశ్యకు జన్మించి అందరికీ దూరమై.. తనచుట్టూ అల్లరిమూకలు చేరినా దేవుని మరువక, విడువక తన జీవితాన్ని కొనసాగించాడు, ఇశ్రాయేలీయులు తమకు సారధ్యం వహించి శత్రువులనుండి కాపాడమనగా యెహోవాదేవుణ్ణి ప్రార్ధించి, దేవునితో చేసిన సత్యప్రమాణాన్ని బట్టి ఒక్కగానొక్క లోకం తెలియని కూతుర్ని బలిపీఠాన్ని ఎక్కించాడు. తండ్రికి తగ్గ తనయగా యెహోవా దేవునికి తన తండ్రి చేసిన ప్రమాణాన్ని బట్టి చావుకు వెరవక సంతోషంగా స్వీకరించడానికి సిద్దపడింది యెఫ్తా కుమార్తె. ఈ రోజు ఎంతమంది ఈ తండ్రి బిడ్డలవలే దేవునిపట్ల విధెయత కలిగి, ఆడినమాట తప్పక దేవుని యెడల నిభందన కలిగి జీవిస్తున్నారు.

తనదైన శైలిలో చక్కగా.. సూటిగా బ్రదర్ గూడూరి రవికుమార్ ఈ వాక్య సందేశాన్ని మనకు అందించారు. ప్రతిఒక్కరూ తప్పక వినడమే కాక తమ తమ జీవితాల్లోకి అన్వయించుకుని యేసయ్యను వెంబడించగలగాలి. ఆమేన్.

బ్రదర్ గూడూరి రవికుమార్ ఒంగోలు పట్టణంలో మార్టిన్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ సంఘమును నడిపిస్తూ దేశంలోని పలు నగరాలలో దేవుని సువార్తను ప్రకటిస్తూ యేసయ్య మహాకృపద్వారా ని ఆత్మల సంరక్షణ విషయంలో తనవంతు భాధ్యతను నిర్వహిస్తున్నాడు. బాప్టిస్ట్ హోం పేరిట అనాధ బాలల శరణాలయాన్ని నిడిపిస్తున్నాడు. వీరికొరకు మన అనుదిన ప్రార్ధనలో ప్రభువుని వేడుకుందాం. అమేన్.



ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

April 20, 2017

అమూల్యమైన దేవుని సమయం | Bro Praveen Messages | Dominion Power Center | H...

❄❄❄ అమూల్యమైన దేవుని సమయం ❄❄❄

బ్రదర్ ప్రవీణ్ గారి అద్భుత ప్రసంగం 

దైవిక అభిషేకంతో ఆశీర్వదించబడి దేవునిచే బహుగా వాడబడుచున్న బ్రదర్ ప్రవీణ్, డొమీనియన్ పవర్ సెంటర్ వారి సువార్త ప్రసంగాలు అన్యులను సైతం ఆకట్టుకుంటూ ఎన్నో ఆత్మలను దేవుని వైపు నడిపించబడటం ఎంతో ఆశీర్వాదకరం. వారి ప్రసంగాలు వినడం ద్వారా ఆత్మీయ మేలులు పొందినవారు మాకు ఫోన్ల ద్వారా మాతో మాట్లడటం చాలా సంతోషదాయకం. మీరు ఇంకా బలమైన నడిపింపు పొందాలని.. దేవునిలో ఇంకా ఇంకా ఆశీర్వదించబడాలని ఆ దేవుని ప్రార్దిస్తున్నాము.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen. 



లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Watch Our latest Videos...

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Monday - Part 3



యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.


January 25, 2017

Bro.Praveen Message | Dominion Power Center | Telugu | HOPE Nireekshana TV

Bro.Praveen Kumar's Latest Telugu Christian Video 


Message


Bro.Praveen young man of God and annointed by Holy Spirit and spreading the Gospel through Dominion Power Center, Vijayawada, AP. He was blessed with healing power and powerful gospel ministry. We are praying that so many souls may get salvation and accepting Jesus as their Savior. Amen.









Share and Spread the Gospel and be blessed, Amen



హోప్ నిరీక్షణ టీవీ చానెల్ ను subscribe చేసి మీ మిత్రులకు share చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి అందించి దేవుని కృపకు పాత్రులు కాగలరు. మరచిపోకుండా like చేసి comment పెట్టగలరు. praise the Lord, Amen.



దావీదు మహారాజు

మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ

బైబిల్ చరిత్ర 



Watch, Share and Subscribe Our HOPE Nireekshana TV YouTube Channel. 


November 28, 2016

తళుకు తళుకున మెరిసెను నక్షత్రం | తెలుగు | New Christian Song | 2016 | HO...

Latest Telugu Christian Song
తళుకు తళుకున మెరిసెను నక్షత్రం అను ఈ పాట 'హ్యాపీ క్రిస్మస్ అను నూతన అల్బం లోనిది. బ్రదర్ స్యాంసన్ మరియు బ్రదర్ స్టాలిన్ గార్లు Suryapet జిల్లాలోని మామిళ్ళగూడెం నందు JCGM Jesus Christ Glory Temple ప్రార్ధనా మందిరాన్ని దేవునికృపచే అధ్భుతకరంగా నడిపిస్తూ దేవుడు వారికి ఇచ్చిన తలంపులను బట్టి దేవుని గీతాలును స్వయంగా రాస్తూ వర్ధమాన సంగీత దర్శకులు మరియూ గాయనీ గాయకుల ద్వారా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి దేవుని మహిమార్ధమై రూపొందిస్తున్నారు. వారు విడుదల చేసిన ఆల్బంలు అన్నీ కూడా సంగీత సాహిత్య విలువలు కలిగి వాక్యానుసారం రూపొందించబడినవి,


మన చానెల్ లో వీరి పాటలు ఇప్పటికే కొన్ని చేర్చియున్నాము, దేవుని చిత్తాన్ని బట్టి మరికొన్ని పాటలు మీకొరకు త్వరలో చేరుస్తాము. సాంసన్ మరియు స్టాలిన్ గార్ల గురించి, వారి పరిచర్యను గురించి మీ అనుదిన ప్రార్ధనల్లో ప్రార్ధించండి. మా కొరకు కూడా ప్రార్ధించగలరు. వీరి పాటల CD లు కావలసినవారు mobile no. 95055 80269 ను సంప్రదించగలరు.
Subscribe HOPE Nireekshana TV YouTube Channel

November 21, 2016

శాపాలు ఆశీర్వాదాలుగా | తెలుగు | Bro.Pradeep Kumar | Jesus Miracles | HOP...

శాపం ఆశీర్వాదమై.. దుఃఖం సంతోషమై... కన్నీరు చిరునవ్వై....

మనం తెలిసో తెలియకో పాపాలు చేసి ఉండొచ్చు, అవి శాపాలై మనల్ని వెంటాడుతుంటే ఏమి చేయాలో తెలియని అయోమయమైన స్థితిలో ఉండి ఉండవచ్చు. ఆ శాపాలు మనకు, మన వారికి, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళుగా మిగిలిపోతుంటే ఆ పరిస్థితి ఎంత వేదనాభరితంగా ఉంటుందో ఆ స్థితిని అనుభవించిన వారికి తెలుస్తుంది. కొన్ని సందర్భాలలో మారని మన స్థితులను బట్టి దేవుడే మనలను కపెర్నహోము, కొరాజీను, బేత్సయిదా పట్టణాలను ఒకానొక సందర్భంలో శపించినట్లు మనం పరిశుద్ధ గ్రంధంలోని మత్తయి సువార్త 11:21-24 వాక్యాలలో మనం గమనించవచ్చు.









కాబట్టి మనము మన శాపాలను, పాపాలను క్షమియించమని తండ్రిని వేడుకుంటే తప్పక ఆయన మన యొక్క శాపాలను ఆశీర్వాదాలుగా, దుఃఖమును సంతోషంగా, కన్నీటిని ఆనందంగా మార్చి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలవాడు.



subscribe HOPE Nireekshana TV YouTube Channel.

November 17, 2016

మరియ | దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ | తెలుగు | Christian Message | HOPE N...

మరియ

దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ 

ఆనాడు దేవుడు లోక పాప పరిహారర్ధమై ఈ లోకానికి తన తనయుని పంపించుటకై మరియ గర్భాన్ని ఎన్నుకున్నాడు. స్త్రీలలో ఎన్నుకొనబడినదై, దేవునిచే ధన్యురాలుగా కీర్తింపబడిన మరియ చాల చిన్న వయసులోనే సర్వోన్నతుని శక్తి కమ్ముకొనగా ఈ లోకానికి రారాజును, పదివేల మందిలో అతి సుందరుడునూ ఐన యేసయ్యకు జన్మ నిచ్చింది. ఎన్నో బాధలనూ, శ్రమలనూ, పురిటినొప్పులనూ, ఓర్చుకొని తన గర్భంలో ఉన్న దేవుని బిడ్డను నవమాసాలు మోసి బెత్లెహేములోని ఓ పశువుల పాకలో లోకరక్షకునికి జన్మను ఇచ్చింది. అపురూపంగా పెంచుకున్న తన బిడ్డ, ఏ పాపం ఎరుగని తన ముద్దుల కొడుకు సకలమానవాళి కోసం పాపపరిహారర్ధ బలిగా దేహమంతా రక్తసిక్తమై, గాయాలమయమై సిలువమ్రానుపై మరణించగా ఆ తల్లి మనసు తల్లడిల్లి సొమ్మసిల్లిపోయి ఉంటుంది. యేసు మూడవరోజు తిరిగిలేచాక తనుకూడా యేసు శిష్యులతో కలిసి మేడగదిలో చేరి దేవుని ప్రార్ధించింది. మనము కూడా మరియ వలే మన పిల్లల యెడల మిక్కిలి ప్రేమగలిగి యేసయ్యను, దేవుని ప్రేమను తెలుసుకుని జీవించేలా పెంచగలిగాలి.





మరియ లోని గొప్పతనం, దేవుని యెడల నమ్మకం, విశ్వాసం, యెంతటి కటిన స్థితిని ఐనా ఆ దేవుని కొరకు భరించే గొప్ప గుణాలు కలిగి ఉండాలి. అలా మనల్ని మనం తయరుచేసుకోవాలి, అలాంటి జీవితాన్ని, మనసును, సిద్దపాటుని దయచేయమని దేవాదిదేవుణ్ణి ప్రార్ధిద్దాము. అమేన్.



Subscribe HOPE Nireekshana TV YouTube Channel

November 14, 2016

ఓటమిలో విశ్వాసంతో... | తెలుగు | Bro.Pradeep Kumar | Jesus Miracles | HOP...

ఒటమిలో విశ్వాసంతో..

మనం మనుషులం, లోకంలో జీవిస్తున్నం, కాబట్టి ఈ లోక సంబంధమైన విషయాల్లో సాతాను ప్రేరణను బట్టి పడిపోతుంటాం, లేస్తుంటాం. మనం నడుస్తున్న నీతి మార్గాన్ని బట్టి, అనుసరిస్తున్న విధానాలను బట్టి, మనలో ఉన్న నమ్మకాన్ని బట్టి పడిపోయినా లేస్తుంటాం.. మన ప్రేమగల తండ్రి మనల్ని తప్పక ఆదరిస్తాడు, చేరదీస్తాడు. సాతాను శోదనల్లో పడినప్పటికీ అది తాత్కాలికమైన శోధన అని గ్రహించాలి, దానినుండి బయటపడటానికి, ఎదిరించి నిలబడి పోరాడే శక్తిని మాత్రం మనకు ఇవ్వమని మన తండ్రిని అడగాలి. మనం ఆయనవైపు చూడగలిగితే చాలు...నీకు కావాల్సిన శక్తిని దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు, నిన్ను ఈ లోకాశల నుండి విడిపించి.. సాతానుపై గెలిపించి నిలబెడతాడు. ఆమేన్.







Share and Subscribe HOPE Nireekshana TV YouTube Channel.

God bless You abundantly. Amen.

November 10, 2016

జోలాలి జోలాలి నా యేసయ్యా! | తెలుగు | Christian Song | 2016 | HOPE Nireek...

'జోలాలి జోలాలి నా యేసయ్యా'
Telugu Christian Song

ఈ పాట 'హ్యాపీ క్రిస్మశ్ అను నూతన అల్బం లోనిది. బ్రదర్ స్యాంసన్ మరియు బ్రదర్ స్టాలిన్ గార్లు నల్గొండకు జిల్లాలోని మామిళ్ళగూడెం నందు JCGM Jesus Christ Glory Temple ప్రార్ధనా మందిరాన్ని దేవునికృపచే అధ్భుతకరంగా నడిపిస్తూ దేవుడు వారికి ఇచ్చిన తలంపులను బట్టి దేవుని గీతాలును స్వయంగా రాస్తూ వర్ధమాన సంగీత దర్శకులు మరియూ గాయనీ గాయకుల ద్వారా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి దేవుని మహిమార్ధమై రూపొందిస్తున్నారు. వారు విడుదల చేసిన ఆల్బంలు అన్నీ కూడా సంగీత సాహిత్య విలువలు కలిగి వాక్యానుసారం రూపొందించబడినవి,



మన చానెల్ లో వీరి పాటలు ఇప్పటికే కొన్ని చేర్చియున్నాము, దేవుని చిత్తాన్ని బట్టి మరికొన్ని పాటలు మీకొరకు త్వరలో చేరుస్తాము. సాంసన్ మరియు స్టాలిన్ గార్ల గురించి, వారి పరిచర్యను గురించి మీ అనుదిన ప్రార్ధనల్లో ప్రార్ధించండి. మా కొరకు కూడా ప్రార్ధించగలరు.
వీరి పాటల CD లు కావలసినవారు మమ్మల్ని కానీ లేదా 9505580269 ను సంప్రదించగలరు.
Subscribe HOPE Nireekshana TV YouTube Channel

November 07, 2016

దేవునిలో నుండి జారిపోతున్నవా?
మనం ఎంతటి పాపులమైనా.. ఎటువంటి పాపకరమైన జీవితంలో ఉన్నా దేవాదిదేవుడు తప్పక దరిచేర్చుకుంటాడు. నిన్ను దూరంగా ఉంచువాడు కాదు
తండ్రి, తప్ప్పిపోయిన కుమారుని కొరకు తండ్రి ఎదురుచూస్తాడే కానీ మరచిపోయి జీవించడు. కాపరి తన గొర్రెలమందలో ఒక గొర్రె తప్పిపోతే మిగిలని గొర్రెలను వదిలి తప్పిపోయిన గొర్రె గురించి వెదికి తిరిగి తన మందలోకి ఆహ్వానిస్తాడు. కాబట్టి సాతాను చీకటి ఆలోచనలకు, వాడు చేసే మాయలలో పడిపోకుండా నీవు నీ తండ్రి ఇంటికి తిరిగి రా. మన తండ్రి మహోన్నతుడు, సర్వాధికారి, దయామయుడు. నీవు తనని మరచిపోయినా.. నిన్ను మరువడు.. విడువడు... కాబట్టి నీకు నీవుగా దేవుని విడనాడకు. ఎంతటి వేదనాకరమైన స్థితిలో అయినా తన చేయి విడువకు, ప్రార్ధించడం మరువకు.

ఎందుకంటే తను నీ కొరకు ఉన్న స్థితికంటే గొప్పగా ఆశీర్వదించ తలచాడేమో.. అందుకే నీవు చేయు పనిలో ఆటంకాలు వస్తూ ముందుకు పోలేక పోయి ఉండవచ్చు, కాబట్టి ఆయన ప్రేమను ఎరిగి ఆయన నుండి దూరంగా వెళ్ళకు, సాతాను గాడి మాయలో పడి జారిపోకు. ఆమేన్.

Subscribe HOPE Nireekshana TV YouTube Channel
దేవునిలో నుండి జారిపోతున్నవా?
మనం ఎంతటి పాపులమైనా.. ఎటువంటి పాపకరమైన జీవితంలో ఉన్నా దేవాదిదేవుడు తప్పక దరిచేర్చుకుంటాడు. నిన్ను దూరంగా ఉంచువాడు కాదు
తండ్రి, తప్ప్పిపోయిన కుమారుని కొరకు తండ్రి ఎదురుచూస్తాడే కానీ మరచిపోయి జీవించడు. కాపరి తన గొర్రెలమందలో ఒక గొర్రె తప్పిపోతే మిగిలని గొర్రెలను వదిలి తప్పిపోయిన గొర్రె గురించి వెదికి తిరిగి తన మందలోకి ఆహ్వానిస్తాడు. కాబట్టి సాతాను చీకటి ఆలోచనలకు, వాడు చేసే మాయలలో పడిపోకుండా నీవు నీ తండ్రి ఇంటికి తిరిగి రా. మన తండ్రి మహోన్నతుడు, సర్వాధికారి, దయామయుడు. నీవు తనని మరచిపోయినా.. నిన్ను మరువడు.. విడువడు... కాబట్టి నీకు నీవుగా దేవుని విడనాడకు. ఎంతటి వేదనాకరమైన స్థితిలో అయినా తన చేయి విడువకు, ప్రార్ధించడం మరువకు.

ఎందుకంటే తను నీ కొరకు ఉన్న స్థితికంటే గొప్పగా ఆశీర్వదించ తలచాడేమో.. అందుకే నీవు చేయు పనిలో ఆటంకాలు వస్తూ ముందుకు పోలేక పోయి ఉండవచ్చు, కాబట్టి ఆయన ప్రేమను ఎరిగి ఆయన నుండి దూరంగా వెళ్ళకు, సాతాను గాడి మాయలో పడి జారిపోకు. ఆమేన్.

Subscribe HOPE Nireekshana TV YouTube Channel

October 24, 2016

మనిషి స్వేచ్చ - దేవుని ప్రేమ | Bro. Pradeep Kumar Messages | HOPE Nireek...

మనిషి స్వేచ్చ - దేవుని ప్రేమ

మనిషిగా మలుచుకున్న తన బిడ్డలను దేవుడు చాలా ప్రేమించాడు, కావలసినంత స్వేచ్చను అనుగ్రహించాడు, ఎంతటి పాపాత్ములనైనా కరుణించి ఆలింగనం చేసుకుని తిరిగి తన బిడ్డలనుగా చేసికొని ఆదరించే వాడు యేసయ్య. ఆదాముకు స్వేచ్చను ఇచ్చాడు, పండు తినవద్దన్నా వినక తిని పాపంలో పడిపోయాడు, గొర్రెల కాపరి ఐన దావీదును ఇశ్రాయేలు జనాంగానికి రాజుని చేసాడు, దావీదు పాపం చేసినా క్షమించాడు, ఆ మొద్దు నుండే తను చిగురుగా వచ్చి తన గొప్ప ప్రేమను చాటుకున్నాడు. అలాంటి దృష్ట్యాంతాలు మనం బైబిల్ లో చాల చూడవచ్చు, ఆలాంటి దేవుని ప్రేమ గురించి బ్రదర్ ప్రదీప్ కుమార్ గారు తన ప్రసంగంలో చక్కగా వివరించారు. ఈ వీడియో మీకు నచ్చితే మీ తోటివారికి share చేయగలరు. తప్పక HOPE Nireekshana TV channel ని subscribe చేయగలరు.
ఆమేన్.

October 10, 2016

ఎవరు!!! యేసయ్య కృపకు పాత్రులు? | Bro.Pradeep Kumar Messages | HOPE Niree...

యేసయ్య కృపకు ఎవరు పాత్రులు కాగలరు!!!

 భక్తిపరుడా! ధనవంతుడా! దైవజనులా!

ఎవరు ఆ తండ్రి కరుణకు, కృపకు, వర్ణించనలవికాని ప్రేమకు పాత్రులు కాగలరు. దీనికి బైబిల్ లో ఎన్నో చోట్ల సమాధానాలు దొరుకుతాయి. తనను తాను తగ్గించుకొని, ఎవరైతే దేవుని పాదాల చెంత మోకరిల్లి తనను తాను అర్పించుకొని క్రీస్తు యేసుని ఆరాధిస్తారో వారే ఆ ప్రభువు కృపకు పాత్రులు కాగలరని బ్రదర్ ప్రదీప్ కుమార్ తన వాక్య సందేశంలో విపులంగా వివరించారు. ప్రతి ఒక్కరు తప్పక విని ఆ యేసయ్య కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాము.

అమేన్.





Subscribe HOPE Nireekshana TV

October 03, 2016

ఓటమిలో విజయం | Bro.Pradeep Kumar Messages | Jesus Miracles | HOPE Nireekshana TV

ఓటమిలో విజయం

యేసయ్యను నీవు విశ్వాసంతో నమ్మి వెంబడించగలిగితే నీ జీవితంలో అపజయాలు ఎదురైనా అవి తాత్కాలికమే.. ఆ అపజయంలో నుండే నీవు విజయం సాధిస్తావు. మనం పరిశుద్ధ గ్రంధములో అలా ఓటమి పాలైనా మొక్కవోని విశ్వాసంతో తిరిగి రెట్టింపు, ఏడంతలుగా ఇంకా ఎన్నో రెట్లు ఆశీర్వదించబడిన వారిని మనం చూస్తాము. యాకోబు జీవితంలో పెనూయేలు సంఘటన తరువాతే తను ఇశ్రాయేలుగా మారి దేవునిచే దీవించబడ్డాడు. యోబు సర్వస్వం కోల్పోయినా దేవుని చేతిని విడువక మరింతగా ఆశీర్వదించబడ్డాడు.

ప్రియ మిత్రులారా!

ఈ రోజు నువ్వూ నేనూ ఓటమి అంచుల్లో ఉండిఉండవచ్చు, చావే శరణ్యం అని నీ పరిస్థితులు అనిపించవచ్చు, ఒక్కసారి యేసయ్య వైపు చూడు..

నీ ఓటమి విజయం వైపు పయనిస్తుంది,

నీవున్న చోటనే గొప్పగా అశీర్వదించబడతావు..

అమేన్.

Subscribe: HOPE Nireekshana TV YouTube Channel