మరియ
దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
ఆనాడు దేవుడు లోక పాప పరిహారర్ధమై ఈ లోకానికి తన తనయుని పంపించుటకై మరియ గర్భాన్ని ఎన్నుకున్నాడు. స్త్రీలలో ఎన్నుకొనబడినదై, దేవునిచే ధన్యురాలుగా కీర్తింపబడిన మరియ చాల చిన్న వయసులోనే సర్వోన్నతుని శక్తి కమ్ముకొనగా ఈ లోకానికి రారాజును, పదివేల మందిలో అతి సుందరుడునూ ఐన యేసయ్యకు జన్మ నిచ్చింది. ఎన్నో బాధలనూ, శ్రమలనూ, పురిటినొప్పులనూ, ఓర్చుకొని తన గర్భంలో ఉన్న దేవుని బిడ్డను నవమాసాలు మోసి బెత్లెహేములోని ఓ పశువుల పాకలో లోకరక్షకునికి జన్మను ఇచ్చింది. అపురూపంగా పెంచుకున్న తన బిడ్డ, ఏ పాపం ఎరుగని తన ముద్దుల కొడుకు సకలమానవాళి కోసం పాపపరిహారర్ధ బలిగా దేహమంతా రక్తసిక్తమై, గాయాలమయమై సిలువమ్రానుపై మరణించగా ఆ తల్లి మనసు తల్లడిల్లి సొమ్మసిల్లిపోయి ఉంటుంది. యేసు మూడవరోజు తిరిగిలేచాక తనుకూడా యేసు శిష్యులతో కలిసి మేడగదిలో చేరి దేవుని ప్రార్ధించింది. మనము కూడా మరియ వలే మన పిల్లల యెడల మిక్కిలి ప్రేమగలిగి యేసయ్యను, దేవుని ప్రేమను తెలుసుకుని జీవించేలా పెంచగలిగాలి.
మరియ లోని గొప్పతనం, దేవుని యెడల నమ్మకం, విశ్వాసం, యెంతటి కటిన స్థితిని ఐనా ఆ దేవుని కొరకు భరించే గొప్ప గుణాలు కలిగి ఉండాలి. అలా మనల్ని మనం తయరుచేసుకోవాలి, అలాంటి జీవితాన్ని, మనసును, సిద్దపాటుని దయచేయమని దేవాదిదేవుణ్ణి ప్రార్ధిద్దాము. అమేన్.
Subscribe HOPE Nireekshana TV YouTube Channel

No comments:
Post a Comment
If you have any doubts, please let me know