Showing posts with label hope nireekshana tv. Show all posts
Showing posts with label hope nireekshana tv. Show all posts

January 25, 2021

మనష్షే మహారాజు (MANASSEH THE SON OF HEZEKIAH)

యూదా దేశాన్ని విజయపథంలో నడిపించి దేవునికి విధేయుడుగా నిలిచిన హిజ్కియా మహారాజు మొదటి కుమారుడు మనష్షే మహారాజు . యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో 14 వ రాజు ఈ మనష్షే మహారాజు. మనష్షే అనే మాటకు మరిచిపోవడం అని అర్థం. ఈయన పరిపాలనదుష్టబుద్ది, దేవుని యెడల అవిధేయత వలన దేవుడే ఈ మనష్షేను తన బిడ్డగ మరిచిపోయెంతగా  దుష్టప్రవర్తన కలిగిన సార్ధకనామధేయుడు. 29 యేళ్ళపాటు యూదాదేశాన్ని పరిపాలించిన హిజ్కియా మరణానంతరం మనష్షే తన పన్నేండవయేటనే రాజుగా సింహసనాన్ని అదిష్టించి 55 సంవత్సరాలు సుదీర్ఘకాలం యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. 

2 రాజుల గ్రంథము 21:1-18 ,                               2 దినవృత్తాంతముల గ్రంథము 32:33

2 దినవృత్తాంతముల గ్రంథము 33:1-20 ,         యిర్మియా గ్రంథము 15:4

         వచనంలలో మనష్షేను గురించిన సమాచారం మనకు లభిస్తుంది. ఇతన్ని యూదా రాజులు అందరిలో కూడా బహు దుర్మార్గుడు అయిన పాలకుడిగా బైబిల్ పండితులు భావిస్తారు. దేవునికి హేయమైన ప్రతిఒక్క కార్యాన్ని ఇతడు చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తాము. ఇతని పాలనలో తండ్రి హిజ్కియా పడగొట్టించిన బయలు దేవత విగ్రహాలను తిరిగి నిర్మించి వాటికి బలిపీఠాలను కట్టాడు. యూదా ప్రజలలో విగ్రహారాధనను ప్రోత్సహించాడు. యెహోవా దేవున్ని కాక , ఆకాశ నక్షత్రాలను పూజించాడు. యెహోవా దేవుని మందిరములో అన్యదేవతల బలిపీఠాలను నిర్మించాడు. చిల్లంగి, సోదేగాండ్రతో సహవాసము చేసి వాటిని ప్రొత్సహించాడు. చివరికి తన బిడ్డలను అగ్నిలోగుండ దాటేయటం వంటి దేవునికి అతి హేయమైన కార్యాలను ఎన్నిటినో చేసాడు. యేరుషలేము ప్రజలు అన్యజనుల కంటే మరింత అక్రమంగా ప్రవర్తించడానికి ఈ మనష్షేనే కారకుడు అయ్యాడు.  తద్వారా సర్వాధికారి అయిన ఆ దేవాదిదేవుని అగ్రహానికి గురయ్యాడు.

తన ప్రజలను తప్పు దారి పట్టిస్తూ తమ పితరులు ఎంతో భక్తితో సేవించి తరించిన దేవాదిదేవుని మరిచిన మనష్షే ఎంతమాత్రం క్షమార్హుడు కాదుకదా. అయినా యెహోవా దేవుడు తన జనుల ద్వార మనష్షేను హెచ్చరిస్తాడు. అతనిలో తగిన మార్పు రానందున దేవుడు అష్హూరు రాజు సైన్యాన్ని వారిమీదకు రప్పిస్తాడు. దేవుని కృపకు దూరమైన  మనష్షే అష్హూరు రాజు సైన్యాన్ని ఎదిరించి నిలబడలేక లొంగిపోవలిసి వస్తుంది. అష్హూరు సైన్యం మనష్షేను గొలుసులతో బంధించి  బబులోను రాజ్యానికి తరలించి చెరసాలలో బందిని చేస్తారు . అప్రతిహాతంగా   పరిపాలిస్తూ అదంతా తన ప్రతిభే అని భ్రమించిన మనష్షే తాను దేవాలయాలు, బలిపీఠాలు  నిర్మించి ఆరాధించిన  ఏఒక్క దేవుడూ తాను ఉన్న ఈ స్థితి నుండి కాపాడి రక్షించలేరని తేలుసుకోవడానికి ఆపై ఎంతో సమయం పట్టలేదు.

అన్యదేవతల విగ్రహాలను నిర్మించడానికి ఏ దేవుని ఆలయాలనైతే పాడుచేసాడో, జీవంలేని బయలును ఆశ్రయిస్తూ ఏ దేవుడినైతే తాను విడిచిపెట్టాడో  ఆ ఒక్క జీవము గల దేవుడే సర్వశక్తిమంతుడని, లోకరక్షకుడని, తానున్న ఈస్థితి నుండి తనను కాపాడి  రక్షించగలవాడని ఆ వేదనకరమైన స్థితిలో మనష్షే గ్రహించగలిగాడు. తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిని మొకాళ్ళు వంచి కన్నీటితో ప్రార్ధించాడు.   అతని ప్రార్ధన అలకించిన కరుణామయుడైన దేవుడు మనష్షేను చరలో నుండి తప్పించటమే కాకుండా తిరిగి తన దేశానికి పంపిస్తాడు. యూదా రాజుగా తన పూర్వవైభవాన్ని పొందుకునేలా చేసాడు. యెహోవా దేవుడే నిజదేవుడని గ్రహించిన మనష్షే తాను నిర్మించిన బయలు విగ్రహాలను, బలిపీఠాలను కూల్చివేసిన తరువాత ,  యెహోవా దేవుని ఆలయంలో యూదా జనాంగం తిరిగి భక్తి శ్రద్ధలతో  బలులు సమర్పించటం ప్రారంభిస్తారు.

ఆ తరువాత మనష్షే మరి కొంతకాలం దేశాన్ని సుభిక్షిణ్ణంగా పరిపాలించి ప్రజల మేప్పును సంపాదించుకున్నాడు. మనష్షే మహారాజు జీవితం మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. నూతన నిబంధనలో యేసయ్య చెప్పిన తప్పిపోయిన కుమారుని ఉపమానంలోని పాత్రలా పాత నిబంధనలోని మనష్షేను కూడా చరిత్రకారులు తప్పిపొయిన కుమారుడిలా అభివర్ణిస్తారు. నిజంగానే తప్పిపొయిన కుమారునిలా కనిపించే మనష్షే జీవితం  మనకందరికి ఒక గుణపాఠంలానే భావించాలి. ఈ మన జీవితం , సుఖసంతోషాలు, అస్థిపాస్థులు, అరోగ్యం అన్ని దేవుడు ఇచ్చినవే అని ఎప్పూడూ గుర్తుంచుకోవాలి. ఎంత ఎదిగిన దేవునికి విధేయులుగా జీవించటం నేర్చుకోవాలి. అప్పుడే ఆ దేవాదిదేవుని అశీస్సులు మనకూ, మన కుటుంబాలకు సదాకాలము తోడైఉండి ముందుకు నడిపిస్తాయి. అట్టి గొప్ప దేవుని కృప మనందరికి సదాకాలము తోడై ఉండాలని నిత్యమూ ప్రార్థించుదాం. అమెన్.

Dear Brothers and Sisters in Christ, If you like this post, kindly comment below the post and do share your response, Thank you for reading, God bless you abundantly, Yours HNTV Telugu Christian Channel

December 04, 2020

                                ఎలా ప్రార్ధించాలి? ( How to Pray ? )

ప్రార్థన (prayer) దేవుడు మనకు ఇచ్చిన బలమైన సాధనం, ప్రార్థించడం ద్వారా మనం మనకు కావలిసినవి పొందుకోవచ్చు,  నిరంతరం దేవునితో మనము బలమైన సంబంధాలు   కలిగి ఉండవచ్చు. మనల్ని మనం గెలుచుకోవచ్చు. కాబట్టి ప్రతిరోజు తప్పకుండా మనం దేవుణ్ణి ప్రార్థించాలి.  క్రైస్తవ జీవితాలలో ప్రార్థనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆనాడు దావీదు మహారాజు క్రమం తప్పకుండా ప్రతిదినం 7 సార్లు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని స్వయంగా చెప్పుకున్నాడు. దానియేలు ప్రవక్త కూడా రోజుకు మూడు సార్లు ప్రార్ధించాడు.

బైబిల్లో ఎంతో మంది ఎడతెగక దేవునికి ప్రార్థన చేసి  తమకు కావలిసినవి పొందుకున్నారు. మనం కూడా ప్రార్థించాలి. మన కొరకు, మన కుటుంబం కొరకు , తోటి సహొదరుల కొరకు, సంఘం కొరకు,  సమస్త మానవాళి కొరకు  ప్రార్థించాలి. దేవుణ్ణి ప్రార్థించే విషయంలొ ఎలా ప్రార్థించాలి, ఎందుకు ప్రార్థించాలి, ఎప్పుడు ప్రార్థించాలి, ఎవరి కొరకు ప్రార్థించాలి అనే సందేహాలు  చాలా వస్తాయి. ఆ సందేహాలకు సమాధానలను ఇప్పుడు తెలుసుకుందాం.

1.         దేనికొరకు ప్రార్థించాలి  ? (Why to Pray)

                      మనం దేవునితో మాట్లాడడం ఆయనకు ఎంతో ఇష్టం. మనం దేనికొరకైనా  సరే  దేవుణ్ణి ప్రార్థించవచ్చు. అది పెద్ద విషయమా, చిన్న విషయమా అన్నది పెద్ద సమస్య కానేకాదు. ప్రార్థించడమే ముఖ్యం. ఆలా ప్రార్థిచడం ద్వారా తండ్రి మన సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు.

2.         ఎప్పుడు,  ఎక్కడ  దేవుణ్ణి ప్రార్థించాలి? ( when and where to Pray )

                   మనం దేవుణ్ణి ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రార్థించవచ్చు.  ఆయన నిత్యం మనలో, మనతొ పాటు ఉండేవాడు కాబట్టి  దేవుని ప్రార్థించటానికి, మన సమస్యలు చెప్పుకోవడానికి ఒక ప్రత్యేక సమయం అంటూ ఏమి లేదు. మనం ఎక్కడ ఉన్నా పర్లేదు దేవునితో చక్కగా మాట్లాడవచ్చు.  మన సమస్యలని ప్రార్థన ద్వారా విన్నవించుకోవచ్చు. 

3.         ప్రార్థన ఎంత సేపట్లొ ముగించాలి ? ( How much time to Pray )

                   మనం దేవునితో ప్రార్థనలో ఏకిభవించి మట్లాడడమే చాలా ముఖ్యం. అది ఒక నిమిషం కావచ్చు, ఒక గంట కావచ్చు, లేదా ఒక రోజు కావచ్చు . సమయం ఎంతైన పర్లేదు ఎంత సేపు ప్రార్థించాం అన్నది సమస్య కానే కాదు. మనం ఎప్పుడు మాట్లాడినా,  ఎంత సేపు మాట్లాడినా దేవుడు వింటాడు. తగిన సమయంలో సమాధానమూ ఇస్తాడు.

4     ఇతరులతో కలిసి ప్రార్థించవచ్చా? ( Can I pray with others? )

                      ప్రార్థించవచ్చు, ప్రార్థించాలి కూడా! అలా ఇతరులతో కలిసి ప్రార్థించడం ఎంతో మంచిది, స్నేహితులతో , ఇతరులతో కలిసి ప్రార్థించడం వలన మీ స్నేహం ఇంకా బలంగా మారడమే గాక , దేవునిలో మీ విశ్వాసం మరింతగా బలపడుతుంది. ఎక్కడ ఇద్దరు, ముగ్గురు కూడి నా నామాన్ని ధ్యానిస్తారో అక్కడ నేను ఉంటాను అని యేసయ్య సెలవిచ్చాడు కదా.  కాబట్టి మనం ఎవరితో అయిన కలిసి దేవున్ని ప్రార్థించవచ్చు.

4.     ఎప్పుడూ చేతులు జోడించే ప్రార్ధించాలా? ( should I pray by joining Hands? )

                           చేతులు జోడించి, కన్నులు మూసి దేవుని ప్రార్థించడం ఒక మంచి అలవాటు, అలా ప్రార్థించడం వలన ఎకాగ్రత పెరుగుతుంది. తద్వారా మన మనస్సు మనం చేసే ప్రార్థన మీద లగ్నం అవుతుంది. అంతే కాదు మీరు ఎక్కడ ఏ పనిలొ ఉన్న మీకు అనుకూల సమయంలో మీ మనస్సులో మీరు మనసారా దేవుని ప్రార్థించవచ్చు,  చేతులు జోడించి ప్రార్థించాల్సిన  అవసరం లేదు.

5.         బిగ్గరగా ప్రార్థించవచ్చా   ? ( Can I pray loudly)

                     బిగ్గరగా ప్రార్థించిన, లేక మనస్సులో మౌనంగా ప్రార్థించిన నీ ప్రార్థన దేవుని సన్నిధికి   చేరుతుంది. మనం బిగ్గరగా ప్రార్థించడం వలన మన మనస్సుకు మంచి ఎకాగ్రత కుదురుతుంది. నీవు ఉన్న చోటును బట్టి   బిగ్గరగా గొంతెత్తి  ప్రార్థించాలా ,  లేక మౌనంగానే మనస్సులో ప్రార్థించాలా అనేది  నీ ఇష్టం. నీవు ఎలా ప్రార్థించినా నీ ప్రార్థన దేవుడు వింటాడు,  తప్పకుండా జవాబు ఇస్తాడు.

6 విధానాలను బట్టి మనం ప్రార్థన చేయడానికిదేవునితో సంభాషించడానికి ఓ సమయమంటూ ప్రత్యేకంగా లేదు,  ఇలా చేయాలి, అలా చెయ్యాలి అనే షరతులు కూడా లేవు. ఒక తల్లి తన బిడ్డతో మాట్లాడటానికి ఏ షరతులూ విధించదు  కదా. అలాగే ఒక తండ్రి  తన బిడ్డల అలనా పాలనా విషయంలో ఎలాంటి సమయ సమయాలు  చూడడు కదా. యేసయ్య మనకు అంతకంటే ఎక్కువ కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా మనసారా దేవున్ని ప్రార్థించండిసంభాషించండి, కావలసినవి పొందుకొండి. నిరంతరం దేవునిలో గడుపుతూ ఆయనకు ఇష్టులుగా జీవించండి. ఆమేన్.          

Dear Brothers and Sisters in Christ, If you like this post, kindly comment below the post and do share your response, Thank you for reading, God bless you abundantly, Yours HNTV Telugu Christian Channel

February 19, 2018

PSALM 1st Chapter | Vocal | Baby Eshitha | 2018 | HOPE Nireekshana TV

PSALM
1st Chapter
Vocal:
Baby Eshitha

1 Blessed is the man
Who walks not in the counsel of the ungodly,
Nor stands in the path of sinners,
Nor sits in the seat of the scornful

2 But his delight is in the law of the LORD
And in His law he meditates day and night.

3 He shall be like a tree
Planted by the rivers of water,
That brings forth its fruit in its season,
Whose leaf also shall not wither,
And whatever he does shall prosper.

4 The ungodly are not so,
But are like the chaff which the wind drives away.

5 Therefore the ungodly shall not stand in the judgement,
Nor sinners in the congregation of the righteous.

6 For the LORD knows the way of the righteous ,
But the way of the ungodly shall perish.

Watch and subscribe us..
Thanky You
Praise the Lord, amen.

January 10, 2018

బైబిల్లో పక్షిరాజు (డేగ) కు ఎందుకంత ప్రాముఖ్యత?.. దాని ప్రత్యేకత ఏమిటి??...

బైబిల్లో పక్షిరాజు (డేగ) కు ఎందుకంత ప్రాముఖ్యత..?

దాని ప్రత్యేకత ఏమిటి ??? 

మనకు డేగ, గ్రద్ద.. ఈగిల్ గా పిలుచుకునే పక్షి గురించి చాలా తక్కువగానే తెలుసు! డేగలో మనం తెలుసుకోవలసినవి.. అనుకరించవలసినవి... అనుసరించవలసినవి ఎన్నో ఉన్నాయి. మన బైబిల్లో కూడా పక్షులలో రాజుగా పక్షిరాజుగా డేగను పిలిచారు.. ఎంతో గొప్పగా పొగిడారు. అంతటి గొప్ప లక్షణాలు కలిగిన పక్షిగురించి.. దానిలో ఉన్న ఆ గొప్ప లక్షణాలగురించి మనం తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

ఎవరికీ అందనెత్తులో ఎగురుతూ..

తన ఆహారాన్ని తానే సేకరించుకుంటూ..

పరిస్థితులుకు తగ్గట్టు తనను తానే మార్చుకుంటూ..

మరో కొత్త జన్మకు ఊపిరి పోసుకుంటూ...

పక్షిరాజుగా మన్ననలూ అందుకుంటూ...

ఆకాశంలో విహరించే పక్షులకు మహరాణిగా పిలిపించుకుంటూ..

దర్జాగా జీవించే డేగ మనకు ఎప్పటికీ ఆదర్శమే..

Praise the Lord, Amen.

ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పక మీ బంధువులకు స్నేహితులకు share చెయ్యండి. చానెల్ ను subscribe చేయించండి. praise the Lord, Amen.

January 06, 2018

యేసుక్రీస్తు ఎప్పుడు జన్మించాడు - అద్భుతమైన విశ్లేషణ - Rev Dr Edward Wil...

యేసుక్రీస్తు ఎప్పుడు జన్మించాడు 
ఎడ్వర్డ్ విలియం గారి అద్భుతమైన విశ్లేషణ

By Rev Dr Edward William Kuntam 

క్రీస్తు పుట్టీ లోకమంతా పండుగ చేసుకుంటున్న ఈ శుభసమయంలో యేసయ్య ఈ లోకాన జన్మించిన రోజు గురించిన ఎన్నో అనుమానాలకు... సవాళ్ళకూ ఎవరికీ ఇబ్బంది కలుగకుండా చారిత్రక ఘట్టాలను ఉదహరిస్తూ క్యాలెండర్ పుట్టు పూర్వోత్తరాలను విశదీకరిస్తూ ఆద్యంతం అద్భుతమైన రీతిలో చక్కగ వివరించారు ఎడ్వర్డ్ విలియం గారు. ప్రతిఒక్కరూ చూచి తెలుసుకోవలసిన ఎన్నో విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి.

Watch and Subscribe our Channel for more videos... 
Praise the Lord.. amen. 

September 04, 2017

హతఃసాక్షులు - లోకానికి దీపాలు | Apostles' last days | Part 2 | Latest Me...

❄❄❄ హతఃసాక్షులు - లోకానికి దీపాలు ❄❄❄

Apostles' last days, part 2

యేసు శిష్యులను అపోస్తలులుగా పిలిచేవారు. వీరిలో విద్యావంతులు, వైద్యులు, సుంకాలు వసులుచేసే ఉద్యోగులు, వ్యాపారులు, మేధావులు ఇలా అన్ని వర్గాలవారినుండి యేసు తన శిష్యులను ఎంచుకున్నాడు. ఆనాడు క్రీస్తు శిలువలో మరణించి, మూడవరోజు తిరిగిలేచిన తరువాత స్వర్గారోహణుడవుతూ సర్వలోకానికి వెళ్ళి తన సువార్తను చాటమని శిష్యులకు చెప్తాడు. ఆయన ఆజ్ఞ మేరకు శిష్యులు ప్రపంచం లోని నలుమూలలు తిరిగి దేవుని సువార్తను చాటారు. ఆ క్రమంలో ఎన్నో అవమానాలు, తిరస్కారాలూ.. భరించారు. చివరికి చావును సైతం చిరునవ్వుతో స్వీకరించి దేవుని ప్రేమను అందులోని మాధుర్యాన్నీ ఈ లోకానికి చాటిచెప్పారు. ఆనాటి వారి త్యాగ ఫలితమే నేడు దేవుని వాక్యము మనకు అందుబాటులో ఉన్నదని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దేవుని వాక్యము మన పాదాలకు దీపమై మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నదంటే ఆ వెలుగును మనకు చేరువ చేసింది ఈ శిష్యులే కదా! దేవుని ప్రేమను వారు చవిచూడగలిగారు కాబట్టే నామట్టుకు బ్రతుకుట క్రీస్తే.. చావైతే లాభం అని అంత ధైర్యంగా అనగలిగారు. అలాంటి శిష్యులను గురించి మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా అవసరం. ఈ వీడియోని రెండు భాగాలుగా అందిస్తునాము. తప్పక రెండు భాగాలు చూసి subscribe చేసి comment boxలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు,
ఈ వీడియోలను LIKE చేసి మీ మిత్రులకు, బంధువులకూ SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Watch Our latest Videos..

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

August 17, 2017

నీ జీవితంలో దేవుని కార్యములు మర్చిపోకు | Bro Praveen | Dominion Power Ce...

❄❄❄ నీ జీవితంలో దేవుని కార్యములు మర్చిపోకు ❄❄❄

Bro Praveen Kumar Message, Dominion Power Center,Vijayawada. 

ఎందుకు ఆ నిరుత్సాహం.. ఎందుకు వేదన..
జీవితం నిస్సారంగా మారిపోతుందా! కనుచూపు మేరలో ఆశ అనేది కనిపించడం లేదా?
నిజమే.. మన సమస్యలో ఉన్న తీవ్రత మనకే తెలుస్తుంది, ఎదుటివారికి ఏమి తెలుస్తుంది ??? నిజమే కదా!
యేసయ్యని నమ్ముకున్న తరువాత నీ జీవితంలో మేలులే జరుగలేదా... ఆలోచించు...
తప్పక వచ్చి ఉంటాయి.. ఎందుకంటే సమస్యలే మన జీవితం అయితే  ఈ లోకంలో ఏ ప్రాణి బ్రతికి బట్టకట్టలేదు.
ఇది వాస్తవం. నీ జీవితంలో మేలులు అనుగ్రహించిన యేసయ్య నీ సమస్యలను తీసివెయ్యలేడా..
మరి ఎందుకంత నిరుత్సాహం, ఎందుకంత ఆందోళన, ఆలోచించు...
ఉపవాసాలు చేసినా.. రేయింబగళ్ళూ ప్రార్ధనలో గడిపినా
ఫలితం కనిపించకపోవడంలో ఆశ్చర్యపడకు..
అంతకు రెట్టింపు ఆశీర్వాదాలు నీకు అందించబోతున్నాడేమో ఆలోచించు..
నిజం.. ఎన్నో గొప్ప సాక్ష్యాలు వేదనకరమైన స్థితిలో నుండి పుట్టినవే..
మరణభయంలో నుండి బయటపడినవే...
అటువంటి భయంకరమైన సమస్యల్లో నుండి వారు బయటపడ్డారు కాబట్టే ఈ రోజు వారి సాక్ష్యాలు మనకు రెట్టింపు బలాన్ని అందిస్తున్నాయి.
మరి రేపటి తరానికి నీ సాక్ష్యం అంతటి ఉత్కృష్టంగా ఉంటుందేమో
భయపడకు.. వేదన చెందకు... కలతపడి సణగకు..
యేసయ్య నీతోనే ఉన్నాడు... నీలోనే ఉన్నాడు...
నీ రేపటికొరకు గొప్పగా ప్రణాళికలు రచించే ఉంటాడు.
ఎందుకంటే నీచేయి ఆయన చేతిలో ఉంది కాబట్టి. Amen.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Watch Our latest Videos..

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

August 09, 2017

నీ అద్భుతం నీ వెంటే | Bro Praveen message | Dominion Power Center | HOPE...

❄❄❄ నీ అద్భుతం నీ వెంటే ❄❄❄

Bro. Praveen's Message, Dominion Power Center, Vijayawada. 

అధ్భుతాలు ఎక్కడ ఉంటాయి! అధ్భుతాలు ఎలా వస్తాయి? ఎంతో మంది దేవుని బిడ్డలు ఎన్నో గొప్ప గొప్ప సాక్ష్యాలు పంచుకుంటూ మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తారు. ఒకింత అసూయ కూడా కలుగుతుంది. అధ్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో ఎందుకు జరగడం లేదు, మనలో ఉన్న లోపం ఏమిటి, అందిరిలాగే.. ఒకింత అందరికన్నా మిన్నగా నేను దేవునితో గడుపుతున్నాను కదా, మరి దేవుడు నన్నేందుకు అలక్ష్యం చేస్తున్నాడు అని ఏదో ఒక సందర్భంలో తప్పక సణుగుతాము. కానీ మన మనసులో జనించే ప్రతి ప్రశ్నకీ జవాబు పరిశుద్ధ గ్రంధంలో వెదుక్కోవచ్చు. అప్పటికప్పుడు మనం మన జీవితంలో ఏదో అద్భుతం జరగాలని కోరుకుంటాము. తాత్కాలికమైన ప్రతిఫలాన్ని ఆశిస్తాము. కానీ దేవుని దృష్టిలో నీ జీవితం వేరు. నీవు ఆశించిన దానికంటే రెట్టింపు ఆశిర్వాదాలు నీ జీవితంలో నీకు అనుగ్రహిస్తాడు. ఆయన ఇవ్వలేనిది ఈ చరాచర జగత్తులో ఏముంది ? కాని తగిన సమయం కొరకు నిరీక్షణను కలిగి జీవించాలి. అబ్రహాము మొదలు ప్రతిఒక్కరు ఆయా అనుకూల సమయాల్లో దేవుని నుండి బహుగా ఆశీర్వదింపబడినవారే. ఈ దినం నీదే కావచ్చు. విసిగిపోక ప్రార్ధనలో మెలకువ కలిగి జీవిద్దాం. ఆమేన్.

బ్రదర్ ప్రవీణ్ గారి వాక్యం ఈ రోజు ఎంతో మంది బిడ్డలను దేవునికి దగ్గరచేస్తూ.. ఆత్మీయ ఫలాలను అందుకునేలా ముందుకు నడిపిస్తుంది. ఈ వాక్య ప్రసంగం మీకు నచ్చితే తప్పకుండా మీ మిత్రులకు share చేయండి, రెగ్యూలర్ గా మన చానెల్ లోని వాక్య సందేశాలనూ, పాటలను చూసి అధ్యాత్మికంగా బలపడేందుకు తప్పనిసరిగా మన చానెల్ ని like చేసి subscribe చేయమని చెప్పండి. మరలా రేపటి బ్రదర్ గూడూరి రవికుమార్ గారి ప్రసంగంలో కలుసుకుందాం. ప్రభువు నామంలో అందరికీ వందనాలు, ఆమేన్.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Watch Our latest Videos...

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

August 08, 2017

దావీదు మహారాజు | తెలుగు | King David | Telugu Christian Bible Story | HO...

❄❄❄ దావీదు మహారాజు  -  King David ❄❄❄

దావీదు మహారాజు పరిశుద్ధ గ్రంధములో  గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నవాడు, దేవుని ప్రేమ, ఆదరణ పొందినవాడు, గొర్రెలకాపరి నుండి ఇశ్రాయేలు రాజ్యానికి రాజుగా దేవునిచే నియమింపబడినవాడు. ఎంత ఎదిగినా తనను తాను తగ్గించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. యేసును దావీదుకుమారుడు అని పిలిపించుకునేంతటి గొప్ప స్థాయికి చేరుకున్నాడు. మనము దావీదు వలే దేవుని యెడల భయభక్తులు కలిగి జీవించాలి, మన భవిష్యత్ తరాలను ఆ విధంగా తయారుచెయ్యలి. దేవునికి ఇష్టులైన వారిలా మన పిల్లల్ని తయారు చేయాలి. ఆమేన్.

\

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

July 25, 2017

ఎవరు యేసుప్రభుని శిష్యులుగా ఉండగలరు? | Who can be a disciple |David Karu...

❄❄❄ ఎవరు యేసుప్రభుని శిష్యులుగా ఉండగలరు? ❄❄❄

❄❄❄ Who can be a disciple to Lord Jesus Christ ❄❄❄ 

Bro.David Karunakar wonderful message,
బ్రదర్ డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, తిరుపతి

పుట్టుకతోనే పాపులుగా ఈలోకంలో జన్మించిన మనల్ని మన పాపాలనుండి విడుదలను చేసి తన బిడ్డలుగా మలచుకోవాలని ఆనాడు యేసయ్య ఈ లోకాన మనుష్యకుమారునిగా జన్మించాడు, మనకొరకు శిలువపై తన ప్రాణాన్ని అర్పించి మన పాపాలకు శాశ్వతమైన ప్రాయశ్చిత్తబలిగా తనను తాను అర్పించుకున్నాడు. యేసు తన పరిచర్య కాలంలో 12మందిని శిష్యులుగా చేసికొని సర్వలోకానికి వెళ్ళి తన సువార్తను చాటమని చెప్పాడు. వారి త్యాగాల ఫలితమే మనకు ఈనాడు పరిశుద్ధగ్రంధం లభించింది, ఈనాడు మనం యేసుక్రీస్తును ఆరాధిస్తున్నాం కాని ఎంతవరకు మనం యేసుని సువార్తను లోకానికి చాటి ఆత్మలను సంపాదిస్తున్నాము. యేసు కోరుకున్న రీతిలో నేడు మనం ఆయన శిష్యులుగా ఉండే అర్హతను సంపాదించుకున్నామా? రేపు తీర్పులో మనం ఏమని సమాధానం చెప్పుకోగలం. అందుకే నేడే మనల్ని మనం గుర్తెరిగి యేసుకు నిజమైన శిష్యునిగా, శిష్యురాలుగా తిరిగి జన్మించి మన జీవిత కాలంలో మరికొద్ది ఆత్మలనైనా సంపాదించి ఆ మహిమగల తండ్రికి నిజమైన శిష్యులుగా, నిజమైన బిడ్డలుగా జీవిద్దాము. ఆమేన్.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

July 22, 2017

ఈ వాక్యాలు ప్రతిరోజూ ఓసారి ధ్యానించండి చాలు గెలుపు మీదవుతుంది. యుద్దము య...

❄❄❄ ఈ వాక్యాలు ప్రతిరోజూ ఓసారి ధ్యానించండి చాలు గెలుపు మీదవుతుంది ❄❄❄
❄❄❄ యుద్దము యెహోవాదే ❄❄❄
Great Encouragement Verses 

మన దైనందిన జీవితంలో సమస్యలు లేనివారు ఎవరున్నారు? నిత్యం ఏదోఒక సమస్య మనచుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ సమస్యల్ని మనం ఒంటరిగా ఎదుర్కొనలేము, దేవుని వైపు తిరిగాల్సిందే. సమస్యలకు అధైర్యపడక, సహనాన్ని కోల్పోక మన తండ్రియైన దేవునితో సమస్యల్ని విన్నవించుకోగలిగితే మనతరపున యేసయ్యే యుద్దం చేస్తాడు. విజయాన్ని అందిస్తాడు.

మనల్ని మనం నిబ్బరపరచుకుంటూ ముందుకుసాగి పోవడానికి, ప్రతిరోజూ ధ్యానించుకోడనికి ఈ వీడియోలోని కొన్ని వాక్యాలు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచి ముందుకు నడిపిస్తుంది. ఆమేన్.

ఈ వాక్యాలు ప్రతిరోజూ ఓసారి ధ్యానించండి చాలు, గెలుపు మీదవుతుంది. యుద్దము యెహోవాదే

నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నాను. మీ హృదయములు జంకనియ్యకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీకొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. 1 దినవృత్తాంతములు 20:3-4.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

July 21, 2017

ఈ వాక్యాలు ప్రతిరోజూ ఓసారి ధ్యానించండి చాలు గెలుపు మీదవుతుంది. యుద్దము య...

❄❄❄ ఈ వాక్యాలు ప్రతిరోజూ ఓసారి ధ్యానించండి చాలు గెలుపు మీదవుతుంది ❄❄❄ 

❄❄❄యుద్దము యెహోవాదే ❄❄❄

Great Encouragement Verses 
మన దైనందిన జీవితంలో సమస్యలు లేనివారు ఎవరున్నారు? నిత్యం ఏదోఒక సమస్య మనచుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ సమస్యల్ని మనం ఒంటరిగా ఎదుర్కొనలేము, దేవుని వైపు తిరిగాల్సిందే. సమస్యలకు అధైర్యపడక, సహనాన్ని కోల్పోక మన తండ్రియైన దేవునితో సమస్యల్ని విన్నవించుకోగలిగితే మనతరపున యేసయ్యే యుద్దం చేస్తాడు. విజయాన్ని అందిస్తాడు.

మనల్ని మనం నిబ్బరపరచుకుంటూ ముందుకుసాగి పోవడానికి, ప్రతిరోజూ ధ్యానించుకోడనికి ఈ వీడియోలోని కొన్ని వాక్యాలు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచి ముందుకు నడిపిస్తుంది. ఆమేన్.

ఈ వాక్యాలు ప్రతిరోజూ ఓసారి ధ్యానించండి చాలు, గెలుపు మీదవుతుంది. యుద్దము యెహోవాదే

నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నాను. మీ హృదయములు జంకనియ్యకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీకొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. 1 దినవృత్తాంతములు 20:3-4.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Watch Our latest Videos...
యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

July 11, 2017

Want to become a Winner - This is for You | Top 10 Verses | HOPE Nireeks...

Want to become a Winner - This is for You 

Top 10 inspirational bible Verses at your disappoint situations.

every one should face the problems, hurdles and hopeless situations
in their regular life.
these 10 verse will give great encouragement and awesome spiritual support to every one at every bad situation
these verses are very much useful in our regular life.
must watch and share to your loved one and encourage them.

Subscribe our Channel to watch more christian related messages and stories

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 