యేసయ్య ఆలయపు తెర నడిమికి చించాడు...
మరి నీ మనసు తెర ????
పాతనిభంధనా కాలంలో మనకు ఆ యెహోవా దేవునికి మద్య ఓ తెర ఉండి ఆ తెరదాటి మామూలు జనం లోనికి వెళ్ళగలిగే వారు కాదు. కడపటి ఆదాముగా వచ్చిన మన యేసయ్య తన మరణంతో ఆ ఆలయపు తెర నడిమికి చించివేసి మనకు మన తండ్రికి మద్య ఉన్న ఆ అడ్డును తొలగించాడు.
ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది. హెబ్రీ 10:20, తన తండ్రికి మనకు ఉన్న ఆ అడ్డుతెరను ఆయన తొలగించి మార్గం సుగమం చేసి తండ్రిని మన తోటివారిని ఎలా ప్రేమించాలో చక్కగా వివరించారు.
నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ. నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ;
మార్కు 12:30-31
మరి ఎందుకు ఆలాంటి స్థితిని మనం పొందలేకపోతున్నాము. మన మనసు పొరలను అంటిపెట్టుకుని అడ్డుగా ఉన్న ఆ తెరను తొలగించి మనం బయటకు ఎందుకు రాలేకపోతున్నాము. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు
దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలె నను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము. 1 యోహాను 19-21
మరి ఆ విధంగా మనం ఉన్నట్లైతే ఈ కక్షలు.. గొడవలు.. పరస్పర విరుద్ద భావాలు ఎందుకు వస్తున్నాయి. ఇవి వ్యక్తుల మద్య మాత్రమే కాక రెండు ప్రాంతాల మద్య, దేశాలమద్య కూడా చిచ్చు పెడుతున్నాయి కదా.. క్రైస్తవాన్ని ఆచరిస్తున్నామని చెప్పే మనం నిజమైన ఆ క్రీస్తు వారసులమేనా ??
మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? 1 కొరింథీ 3:6 అంత మహోన్నతమైన సిం హా సనంపై ఆ దేవాది దేవుడు మనల్ని కూర్చోబెట్టాడు కదా.. మరి మనలో ఆయన ఆశించిన మార్పు ఎందుకు సాద్యపడటం లేదు.
ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను; 2 కొరింథీ 5:17
మరి ఆ నూతన సృష్టికి అంకురార్పణ ఎప్పుడు ???
మన్నయినది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. ప్రసంగి 12:7
మరి మనమూ మన్నయిన తరువాత..మన పరిస్థితి ?? మరి ఎందుకింక ఆలశ్యం.
ఈ క్షణమే మనమూ.. మన మనసును కప్పుకొనియున్న ఆ తెరను తొలగించి మనకూ మన పొరుగువారికి.. మనకూ ఆ దేవాదిదేవునికి మద్యన ఉన్న అడ్డుగోడను కూల్చి ఆ యేసయ్య రెండవ రాకడకొరకు సిద్దపడదాము.
ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. మత్తయి 24:42 అన్న ఆ మాటను నమ్మి నిత్యం ప్రభు వాక్యంలో ప్రార్ధనలో ఎదురుచూస్తూవుందాము.
ఆమేన్.

No comments:
Post a Comment
If you have any doubts, please let me know