Saturday, December 31, 2016

But grow in the grace and knowledge of our Lord and Savior Jesus Christ. 
To Him be the glory both now and forever. Amen. 
2 Peter 3:18

Happy New Year

God bless you All.

Thursday, December 29, 2016

దావీదు మహారాజు | తెలుగు | King David | Telugu Christian Bible Story | HO...

దావీదు మహారాజు పరిశుద్ధ గ్రంధములో  గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నవాడు, దేవుని ప్రేమ, ఆదరణ పొందినవాడు, గొర్రెలకాపరి నుండి ఇశ్రాయేలు రాజ్యానికి రాజుగా దేవునిచే నియమింపబడినవాడు. ఎంత ఎదిగినా తనను తాను తగ్గించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. యేసును దావీదుకుమారుడు అని పిలిపించుకునేంతటి గొప్ప స్థాయికి చేరుకున్నాడు.

మనము దావీదు వలే దేవుని యెడల భయభక్తులు కలిగి జీవించాలి, మన భవిష్యత్ తరాలను ఆ విధంగా తయారుచెయ్యలి. దేవునికి ఇష్టులైన వారిలా మన పిల్లల్ని తయారు చేయాలి.ఆమేన్.

Subscribe HOPE Nireekshana TV YouTube Channel

Sunday, December 25, 2016

మనయందు దేవుని నిర్దిష్ట ప్రణాళిక | తెలుగు | Bro.Pradeep Kumar Messages |...

Bro.Pradeep Kumar Christian Message

మనయందు దేవుని నిర్దిష్ట ప్రణాళిక, 
దేవునికి తన బిడ్డలైన ప్రతివానికి సంబంధించిన ఓ నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. మనల్ని తన అరచేతులలో చెక్కుకున్న ఆ దేవాదిదేవుడు చేరదీయకుండా, అవసరమైన సమయాలలో ఆదుకొనకుండా ఎలా ఉండగలడు? మనకు అవసరమైన చోట, కావలసిన సమయాన తప్పక ఆదుకుంటాడు, తన ప్రణాళికను అమలు పరుస్తాడు. అందుకు సంబందించిన పరిశుద్ధ గ్రంధములోని కొన్ని ఉదాహరణలతో బ్రదర్.ప్రదీప్ కుమార్ గారు చక్కగా అందరికీ అర్ధం అయ్యేలా వివరించారు.ప్రతిఒక్కరు తప్పక చూడవలసిన ప్రసంగం. అమేన్.
Subscribe HOPE Nireekshana TV YouTube Channel


Saturday, December 24, 2016

Bro.Anil Kumar | Latest Christian Worship Song | Jesus Miracles | HOPE N...

బ్రదర్.అనిల్ కుమార్ స్తుతి ఆరాధన

జీసస్ మిరాకిల్స్ మినిస్ట్రీస్ వారు విజయవాడలోని మందిరం 2వ వార్షికోత్సవం సందర్భంగా దేవుని సేవలో బహుగా వినియోగించబడుతూ దేశ విదేశాల్లో అధ్భుతమైన ప్రసంగాలు, మైమరపించే స్తుతి గీతాలతో దేవుని ఆరాదిస్తూ లక్షలాదిమందికి దేవుని సువార్తను అందిస్తున్న బ్రదర్.అనిల్ కుమార్ గారు ముఖ్య ప్రసంగీకులుగా వచ్చి దేవుని స్తుతించి మహిమపరచి ఘనపరిచారు. బ్రదర్ ప్రదీప్ కుమార్ గారు విజయవాడ మరియూ గుడివాడ పట్టణాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తూ గొప్పగా దేవుని పరిచర్యను చేస్తున్నారు. వారిద్దరి కలయికలో ఈ రోజు జీసస్ మిరకిల్స్ మినిస్ట్రీస్, విజయవాడ చర్చి దేవుని స్తుతి గీతాలతో, అరాధనతో, వాక్య పరిచర్యతో గొప్ప మహిమను సంతరించుకుంది, దైవజనుల ప్రసంగాలు, పాటలను విని దేవుని బిడ్డలు ఆత్మీయంగా బలపరచబడ్డారు.

Subscribe HOPE Nireekshana TV YouTube Channel 

Wednesday, December 21, 2016

మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ | తెలుగు | Latest Christian Telugu Vid...

మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ,

రిశుద్ధ గ్రంధంలో ఎవరికీ లభించని గొప్ప స్థానం మరియకు లభించింది, స్త్రీలలో ఆమె ఆశీర్వదించబడినది, దేవునిచే ఎన్నుకోబడినది, దేవుని కృపకు పాత్రురాలు అయ్యింది, ఎంతగా ఆశీర్వదించబడటానికి మరియలో ఉన్న అర్హతలు ఏంటి? పెండ్లికాని స్త్రీ గర్భవతి అయితే వారిపట్ల సమాజం చూసే చిన్న చూపు, కుటుంబ పరువు మర్యాదలు, ఆనాటి  యూదుల కఠిన సాంప్రదాయాలు, శిక్షలు... ఇవేవి ఆనాడు మరియ ఆలోచించలేదు, కేవలం పరమతండ్రి అయిన ఆ దేవదేవుని ఆజ్ఞకు బద్దురాలై రాజాధిరాజుకు జన్మనిచ్చింది. సిలువ మ్రానుపై వేలాడుతూ సర్వోన్నతుడు, పదివేలమందిలో అతిసుందరుడు ఐన తన బిడ్డ దేహమంతా గాయాలై, రక్తమోడుతూ చిత్రహింసలు అనుభవించి ప్రాణాలు విడిచినా.. ఆ భయంకరమైన వేధనను మౌనంగా భరించింది. దేవుని యెడల తన భాద్యతను గుర్తెరిగినదై మేడగదిలో యేసు శిష్యులతో కలిసి దేవుని ప్రార్ధించింది, స్తుతించింది.ఎంత గొప్ప స్త్రీ మరియ, అందుకే దేవుడు ఆమెను ఎన్నుకొన్నది. అందుకే ఆమె అంతగా ఆశీర్వదించబడిన స్త్రీ అయినది. అమేన్.

To watch our Latest Videos clik the links below
దేవా నీ ఆలయం ఎంతో ప్రియమైనది Latest Christian Classical Dance Song
బైబిల్ చరిత్ర Bible story and its importance
ప్రార్ధించు how to pray, with scripturesSubscribe Our HOPE Nireekshana TV YouTube Channel


Thursday, December 15, 2016

క్రొత్త సంవత్సరం వచ్చింది, కొత్త ఆశలను తెచ్చింది | Christian New Year So...

క్రొత్త సంవత్సరం వచ్చింది, కొత్త ఆశలను తెచ్చింది

అంటూ చక్కని సులభశైలిలో అందరూ పాడుకుంటూ దేవుని ఆరాధిచులాగున రాసిన ఈ పాట Happy Christmas అను ఆల్బం లోనిది. సూర్యాపేట్ జిల్లాలోని మోతే మండలంలోని మామిళ్ళగూడెములో JCGM ప్రార్ధనా మందిరం ద్వారా దేవుని పరిచర్య చేస్తూ క్రైస్తవలోకానికి అధ్భుతమైన గీతాలను, సుమధురమైన సంగీతంతో అందిస్తున్న మన SS Brothers ఈ పాటను అందించారు. Bro.Samson మరియు Bro.Stalin గార్ల కొరకు, వారి పరిచర్య కొరకు మన అనుదిన ప్రార్ధనల్లో జ్ఞాపకం చేసుకుందాం. ఈ పాటల CD లు కావలసినవారు ఈ ఫోను నంబర్లను సంప్రదించగలరు, Ph. 95055 80269, 85018 21130. Thank You, Praise the Lord, Amen.Subscribe HOPE Nireekshana TV YouTube Channel.

Praise the Lord, Amen.


Monday, December 12, 2016

క్రీస్తు జననం - రెండింతల ఆశీర్వాదం | Christmas Message | Bro.Pradeep Kum...

క్రీస్తు జననం రెండింతల ఆశీర్వాదం

ర్వలోకానికీ రక్షకుడిగా జన్మించిన యేసయ్య రాజులకు రాజై ఉండికూడా చాలా సామాన్యునిలా ఓ చిన్న గ్రామమైన బెత్లెహేములో, పశువుల పాకలో జన్మించాడు. ఆయన జననం సమస్త మానవాళికీ ఆనందాన్ని పంచగా.. వేధనా భరితమైన ఆ తండ్రి మరణం మనకు పరిపూర్ణమైన రక్షణను అనుగ్రహించింది, తద్వారా మనం మన పాపములనుండి విముక్తులం కావడమే కాక నూరంతల ఆశీర్వాదాన్ని కూడా పొందుకున్నాము.

జీసస్ మిరకిల్స్ సంఘాన్ని విజయవాడలో, గుడివాడలో అధ్భుతంగా నడిపిస్తూ అనేక ఆత్మలను దేవుని చెంతకు నడిపిస్తూ విశాఖపట్నములో కూడా మరియొక సంఘాన్ని నెలకొల్పి అక్కడకూడా దేవుని సేవను కొనసాగించాలనే ప్రయత్నంలో ఉన్నారు. మనమందరం ఆయన సంఘం కొరకు, ఆయన కొరకు మన ప్రార్ధనల్లో ఆ దేవుని వేడుకుందాం. బ్రదర్ ప్రదీప్ కుమార్ గారు 2015 లో ఈ యొక్క మెస్సేజ్ చెప్పియున్నాడు, త్వరలో 2016 సంవత్సర క్రిస్మస్ మెస్సేజ్ ను కూడా అందించగలము. మా కొరకు ప్రార్ధన చేయగలరు. ఆమేన్.

Subscribe HOPE Nireekshana TV YouTube Channel.Wednesday, December 7, 2016

అనుకూల సమయంలో ఆదుకునే దేవుడు | తెలుగు | Bro.Pradeep Kumar | Jesus Miracl...

అనుకూల సమయంలో ఆదుకునే దేవుడు
దేవుని సహాయత లేదని, పొందలేమని అనుకుంటూ నిస్సహాయస్థితిలోనికి వెళ్ళిపోతున్నారా? ఎంతో వేధన, అంతులేని ధుఃఖం ఎంతటికీ మన జీవితాల్లోనుండి వెళ్ళిపోవడం లేదని కలత చెందుతున్నారా? దేవుడు చూస్తూనే ఉన్నాడు, సరియైన సమయంలో తప్పనిసరిగా కావలసిన సహాయాన్ని తప్పక అందిస్తాడు, బెతెస్ద కొలనువద్ద వేచివున్న కుంటివానికి సమయం వచ్చినపుడు యేసయ్యే నేరుగా అతని వద్దకు వచ్చి అతనిని స్వస్థపరుస్తాడు, చనిపోయిన లాజరు వద్దకు నాల్గవరోజు వచ్చి తిరిగి అతనిని బ్రతికిస్తాడు, కాబట్టి మనం మన ఇరుకు ఇబ్బందులలో, వేధనల్లో, శోధనల్లో నిరుత్సాహపడక దానియేలు వలే, యోబువలే, యెబ్బేజువలే దేవుని యందు మిక్కిలి నమ్మకం కలిగి ప్రార్ధించినా.. తగు అనుకూల సమయంలో తప్పక మనల్ని ఆదరిస్తాడు, తగురీతిలో సహాయతను అందిస్తాడు. కాబట్టి దేవుని యండు నిరంతరం నమ్మిక కలిగి గొప్ప ప్రార్ధనాపరులమై ఆయన ఆదరణ, సహాయతల కొరకు ఎదురుచూద్దాము, ఆత్మీయ మేలులు పొందుకుందాము. ఆమేన్.కాబట్టి మనం మన ఇరుకు ఇబ్బందులలో, వేధనల్లో, శోధనల్లో నిరుత్సాహపడక దానియేలు వలే, యోబువలే, యెబ్బేజువలే దేవుని యందు మిక్కిలి నమ్మకం కలిగి ప్రార్ధించినా.. తగు అనుకూల సమయంలో తప్పక మనల్ని ఆదరిస్తాడు, తగురీతిలో సహాయతను అందిస్తాడు. కాబట్టి దేవుని యండు నిరంతరం నమ్మిక కలిగి గొప్ప ప్రార్ధనాపరులమై ఆయన ఆదరణ, సహాయతల కొరకు ఎదురుచూద్దాము, ఆత్మీయ మేలులు పొందుకుందాము. ఆమేన్.

Subscribe HOPE Nireekshana TV YouTube Channel, Praise the Lord, Amen.


Monday, December 5, 2016

బైబిల్ చరిత్ర | తెలుగు | Telug Christian Messages | 2016 | HOPE Nireeksh...

బైబిల్ చరిత్ర

నిషికి దేవునికి మద్య వారధిగా నిలిచిన బైబిల్ లేదా పరిశుద్ధ గ్రంధము చాలా పవిత్రమైనది. ఎంతోమంది చెసిన కృషి ఫలితం కారణంగానే ఈ రోజు బైబిల్ గ్రంధం మనకు లభ్యం అవుతున్నది. అంతటి అమూల్యమైన పవిత్రమైన గ్రంధము యందు మనం యేమరు పాటు కలిగి ఉంటున్నము. రేపు మనం పొందబోయే తీర్పు మనం ఈ రోజు అనుభవిస్తున్న.. ఆచరిస్తున్న జీవితంపై అధారపడి ఉండబోతుంది అనే విషయం మన అందరికీ తెలుసు, అయినా సాతాను శోధన, అలసత్వం, నిర్లక్ష్యాల కారణంగా రేపు ఆ దేవుని రాజ్యాన్ని పొందలేమేమో ఆలోచించండి. ఇప్పటికీ మించిపోయింది లేదు, త్వరపడి ఆ ప్రభువు వైపు మన అడుగులు వడివడిగా పడేలా, ఆ కరుణామయుని చేతిని అందుకునేలా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఆమేన్.Subscribe HOPE Nireekshana TV YouTube Channel