Thursday, September 21, 2017

ఈ బైబిల్ ఖరీదు రూ.200 కోట్లు మాత్రమే! | Gutenberg Bible | Telugu | HOPE ...

ఈ బైబిల్ ఖరీదు రూ.200 కోట్లు మాత్రమే! 

జోహన్నెస్ గూటెన్ బర్గ్ బైబిల్ 

జర్మనీ దేశంలోని మయింజ్ పట్టణానికి చెందిన జోహన్నెస్ గూటెన్ బర్గ్ అనే స్వర్ణకారుడు క్రీ.శ.1440 సంవత్సరంలో ప్రింటింగ్ ప్రెస్ మిషన్ ని కనుగొన్నాడు మిషన్ ని కనుగొన్న మొదట్లో చిన్న చిన్న పాంప్లెట్స్ ప్రింట్ చేసేవాడు. కొన్నాళ్ళకి అతని మనసులో గొప్ప ఆలోచన ప్రారంభమైంది. అది ఏంటంటే పూర్తి బైబిల్ ను ముద్రించి ప్రజలకు బైబిల్ ను అందుబాటులోకి తీసుకురావాలని. అనుకున్నదే తడవుగా జోహన్నెస్ గూటెన్ బర్గ్ తన ఆలోచనని కార్యరూపం దాల్చాడు, రేయనకా పగలనకా అహర్నిశలూ శ్రమించాడు, చివరికీ అనుకున్నది సాధించాడు. అద్భుతమైన రీతిలో బైబిల్ గ్రంధం పూర్తిస్థాయిలో ముద్రితమైంది.

ప్రపంచంలో ప్రింటింగ్ మిషన్ ను కనుగొన్న తరువాత ముద్రించబడిన మొట్టమొదటి పుస్తకం బైబిల్. ప్రపంచం లోనే కాదు మన భారతదేశంలో కూడా మొట్టమొదట ప్రింటింగ్ ఐన గ్రంధం బైబిలే. జోహన్నెస్ గూటెన్ బర్గ్ ప్రింటింగ్ మిషన్ ని కనుగొన్న తరువత క్రీ.శ. 1450 ప్రాంతంలో సమగ్ర బైబిల్ని ముద్రించడానికి తన ప్రయత్నాలు ప్రారంబించాడు. సుమారు ఆరు సంవత్సరాలు కష్టపడిన మీదట క్రీ.శ. 1456 లో పూర్తి బైబిల్ ని ముద్రించడం జరిగింది.

మొదట 180 ప్రతులవరకు ప్రింటింగ్ చేయడం జరిగింది. కాలక్రమంలో వాడుకలో బాగంగా కొన్ని పుస్తకాలు పాడైపోగా ప్రస్తుతం మనకు ప్రపంచంలో 49 బైబిళ్ళు మాత్రమే లభ్యమౌతున్నట్లుగా తెలుస్తుంది.

బైబిల్ ను మొదట లాటిన్ బాషలో 36 లైన్లతో ముద్రించడం ప్రారంభించినా ఆ తరువాత పేపర్ని ఆదా చేయడంలో భాగంగా లైన్లని 40 కి పెంచి మరికొన్ని ప్రతులు ముద్రించారు. చివరికి 42 లైన్లతో నలుపు ఎరుపు రంగుల్లో సమగ్ర బైబిల్ను ముద్రించారు. అందువలనే జోహన్నెస్ గూటెన్ బర్గ్ బైబిల్ ని 42 లైన్ల బైబిల్ అనికూడా అంటారు. మొత్తం 1286 పేజీలతో రెండు వాల్యూములుగా ఈ బైబిల్ ముద్రితమైంది.ప్రస్తుతం ప్రపంచంలో అతి విలువైన పుస్తకాలుగా జోహన్నెస్ గూటెన్ బర్గ్ బైబిళ్ళు చెలామణి అవుతున్నాయి.

ఏది ఏమైనప్పటికీ అప్పట్లో ప్రింటింగ్ మిషన్ కనిపెట్టి ముద్రణా రంగంలో ఆధునిక ప్రింటింగ్ విప్లవాన్ని సృష్టించిన గూటెన్ బర్గ్ బైబిల్ ని ముద్రించి ప్రపంచానికి క్రైస్తవ్యాన్ని,అందులోని ప్రేమను అందించడంలో తనవంతు కృషి చేశాడని మనం భావించవచ్చు. అంతకుముందు యూరోపియన్ ప్రపంచం చూడనటువంటి ఊహించని రీతిలో అధునాతన పద్దతిలో ప్రింట్ అయిన బైబిల్ ప్రతులు విపరీతమైన ఆదరణను పొంది మార్కెట్లోకి వచ్చినవెంటనే అమ్ముడుపోయాయి.

నేటికీ ఆనాడు జోహన్నెస్ గూటెన్ బర్గ్ బైబిళ్ళకు ప్రపంచ మార్కెట్లో ప్రత్యేకమైన విలువ, విశిష్టత ఉంది. కాబట్టే 1978వ సంవత్సరంలో గూటెన్ బర్గ్ ముద్రించిన బైబిల్ ను వేలం వేయగా 2.2 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే మన రూపాయి విలువను బట్టి 14 కోట్ల రూపాయలు. అదే బైబిల్ నేదు 25 నుండి 35 మిలియన్ డాలర్ల ధర పలుకుతుందని అంచనా. అంటే సుమారు 150 కోట్ల రూపాయలనుండి 200 కోట్ల రూపాయల విలువ పలుకుతుందన్నమాట.

ఆశ్చర్యం అనిపించినా నమ్మవలసిన నిజం ఇది.దేవుని సువార్తను పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Watch Our latest Videos..

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

Monday, September 18, 2017

స్తుతి స్తోత్ర మహిమ నీకే నా యేసయ్య ! Latest Telugu Christian Songs 2017 ...

❄❄❄ స్తుతి స్తోత్ర మహిమ నీకే నా యేసయ్య ! ❄❄❄

ఆల్బం: యేసయ్య నీవే నా ప్రాణం,
గానం: యస్ పి బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: కరుణాకర్
రచన & స్వరకల్పన:  విజయ్ కుమార్ కొండవీటి 

బ్రదర్ విజయ్ కుమార్ కొండవీటి గారు దేవునిచే ప్రేరేపించబడి అద్భుతమైన ఎన్నో క్రైస్తవ గీతాలను రచించి స్వరపరచి  సంగీత విద్వాంసుల సారధ్యంలో ఎన్నో గొప్ప ఆల్బంలను క్రైస్తవ ప్రపంచానికి అందించారు. వాటిలో ఒకటైన యేసయ్య నీవే నా ప్రాణం ఆల్బం లో యస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసిన స్తుతి స్తోత్ర మహిమ నీకే నా యేసయ్య అనే పాటను మహాదేవుని గొప్ప కృపను బట్టి మీకు అందిస్తున్నాము. ఈ ఆరాధనా గీతం మీకు నచ్చినట్లైతే మీ బందువులకు, మిత్రులకు తప్పకుండా share చెయ్యండి. మీ కామెంట్ ను క్రింది బాక్స్ లో type చెయ్యండి. దైవజనుల గొప్ప వాక్యసందేశాలతో, పాటలతో, ప్రత్యేక వీడియోలతో మరలా కలుస్తాము. తప్పక చానెల్ ను subscribe చెయ్యగలరు. మా కొరకు ప్రార్ధించండి. ఆమేన్.పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos..

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

Friday, September 15, 2017

శిలువ నీడలో | Bro Ravi Kumar, Ongole | Martin Memorial Baptist Church | ...

❄❄❄ శిలువ నీడలో ❄❄❄

Bro Guduri Ravikumar, Martin Memorial Baptist Church, Ongole.

బ్రదర్ గూడూరి రవికుమార్ ఒంగోలు పట్టణంలో మార్టిన్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ సంఘమును నడిపిస్తూ దేశంలోని పలు నగరాలలో దేవుని సువార్తను ప్రకటిస్తూ యేసయ్య మహాకృపద్వారా ని ఆత్మల సంరక్షణ విషయంలో తనవంతు భాధ్యతను నిర్వహిస్తున్నాడు. బాప్టిస్ట్ హోం పేరిట అనాధ బాలల శరణాలయాన్ని నిడిపిస్తున్నాడు. వీరికొరకు మన అనుదిన ప్రార్ధనలో ప్రభువుని వేడుకుందాం. అమేన్.ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Watch Our latest Videos..

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

Wednesday, September 13, 2017

పరిశుద్ధాత్ముని సహవాసం | Bro Praveen message | Dominion Power Center | H...

❄❄❄ పరిశుద్ధాత్మునితో సహవాసం ❄❄❄

Bro Praveen's wonderful messages on Holy Spirit, 

పరిశుద్ధాత్మునితో సహవాసం అంటే నిత్యం మన దేవాదిదేవుని స్తుతించడమే.. ఆరాధించడమే.. మనం దేవునిసన్నిధిలో ఉన్నా ఆలోచనలు పరిపరివిధాలా పరిగెడుతుంటే దేవుని సన్నిధిని మనం ఎలా అనుభూతించగలం.. ఆయనతో మనం ఎలా సంభాషించగలం.. అంటే దేవుని సన్నిధిలో మన శరీరం ఉన్నా మనసు దేవుని మీద లగ్నం చేయలేకపోతే ఉపయోగం ఏముంటుంది ఆలోచించండి. మనసులో వేదన ఉండొచ్చు.. అశాంతి ఉండొచ్చు.. ఇబ్బందికరమైన పరిస్థితులు నిన్ను ఊపిరి ఆడకుండా నిలకడగా ఉండనీయకపోవచ్చు. ఐనా నీవు అవన్ని దాటుకుని దేవుని సన్నిధిలో నిలిచావు.. అంటే నీ ప్రయాణం దేవుని వైపు ప్రారంభమైంది.. చీకటిశక్తుల తాకిడికి భయపడక నిబ్బరం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్ధించు. పరిశుద్ధాత్మతో కలిసి దేవుని స్తుతించు.. తప్పక నీ చింత యావత్తూ మనతండ్రి తప్పక తీసివేస్తాడు.

బ్రదర్ ప్రవీణ్ గారి అధ్బుతమైన ఈ ప్రసంగం మన జీవితాల్లో వెలుగులు నింపాలి, పరిశుద్ధాత్ముని సహవాసాన్ని మనం పొందుకోవాలి. ఆమేన్. ఈ వాక్యసందేశాన్ని మీ మిత్రులకు share చేయగలరు.ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos..

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

Sunday, September 3, 2017

హతఃసాక్షులు - లోకానికి దీపాలు | Apostles' last days | Part 2 | Latest Me...

❄❄❄ హతఃసాక్షులు - లోకానికి దీపాలు ❄❄❄

Apostles' last days, part 2

యేసు శిష్యులను అపోస్తలులుగా పిలిచేవారు. వీరిలో విద్యావంతులు, వైద్యులు, సుంకాలు వసులుచేసే ఉద్యోగులు, వ్యాపారులు, మేధావులు ఇలా అన్ని వర్గాలవారినుండి యేసు తన శిష్యులను ఎంచుకున్నాడు. ఆనాడు క్రీస్తు శిలువలో మరణించి, మూడవరోజు తిరిగిలేచిన తరువాత స్వర్గారోహణుడవుతూ సర్వలోకానికి వెళ్ళి తన సువార్తను చాటమని శిష్యులకు చెప్తాడు. ఆయన ఆజ్ఞ మేరకు శిష్యులు ప్రపంచం లోని నలుమూలలు తిరిగి దేవుని సువార్తను చాటారు. ఆ క్రమంలో ఎన్నో అవమానాలు, తిరస్కారాలూ.. భరించారు. చివరికి చావును సైతం చిరునవ్వుతో స్వీకరించి దేవుని ప్రేమను అందులోని మాధుర్యాన్నీ ఈ లోకానికి చాటిచెప్పారు. ఆనాటి వారి త్యాగ ఫలితమే నేడు దేవుని వాక్యము మనకు అందుబాటులో ఉన్నదని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దేవుని వాక్యము మన పాదాలకు దీపమై మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నదంటే ఆ వెలుగును మనకు చేరువ చేసింది ఈ శిష్యులే కదా! దేవుని ప్రేమను వారు చవిచూడగలిగారు కాబట్టే నామట్టుకు బ్రతుకుట క్రీస్తే.. చావైతే లాభం అని అంత ధైర్యంగా అనగలిగారు. అలాంటి శిష్యులను గురించి మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా అవసరం. ఈ వీడియోని రెండు భాగాలుగా అందిస్తునాము. తప్పక రెండు భాగాలు చూసి subscribe చేసి comment boxలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు,
ఈ వీడియోలను LIKE చేసి మీ మిత్రులకు, బంధువులకూ SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.
ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.