February 21, 2018

ఈ ఆరు కారణాలు చాలు, నీవు దేవునిపై నమ్మిక ఉంచుటకు | Telugu Christian Mess...

ఈ ఆరు కారణాలు చాలు, నీవు దేవునిపై నమ్మిక ఉంచుటకు

ఈ హడావుడి జీవిత ప్రయాణంలో ఒకరినొకరు పలుకరించుకునే తీరిక ఓపిక లేని కాలంలో మనం జీవిస్తున్నాము. సమస్య వచ్చినప్పుడు ఒంటరిమై పోయి వేధనకరమైన స్థితిలో రవ్వంత తోడుకొరకు, మాటలు ఆలకించే వారికొరకు ఎదురుచూస్తున్నాము. ఎవరు నిన్ను చేయి విడిచినా నేను నిన్ను విడువను, ఎడబాయను, నిన్ను కన్న తల్లి ఐనా నిన్ను మరిచిపోతుందేమో కాని నేను నిన్ను మరువను అని ఎంతో ప్రేమగా ఆ తండ్రి మనతో పరిశుద్ధగ్రంధంలో చెప్పాడు కదా. అందుకే మనం మనమున్న స్థితి ఏదైనా కావచ్చు, భయపడాల్సిన పని లేదు, భీతిల్లవలసిన అవసరం అంతకన్నాలేదు. ఈ ఆరు వాక్యాలు మీకు ఎంతో ధైర్య్యాన్ని అందిస్తాయని, ఆదరిస్తాయని ఆశిస్తున్నాము.
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే like చేసి మీ comment ని post చేసి తప్పకుండా మీ మిత్రులకు ఈ వీడియోని share చెయ్యగలరు. అందరికీ మన ప్రియ ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామంలో వందనాలు తెలుపుకుంటున్నాము.. ఆమేన్.


February 19, 2018

PSALM 1st Chapter | Vocal | Baby Eshitha | 2018 | HOPE Nireekshana TV

PSALM
1st Chapter
Vocal:
Baby Eshitha


1 Blessed is the man
Who walks not in the counsel of the ungodly,
Nor stands in the path of sinners,
Nor sits in the seat of the scornful

2 But his delight is in the law of the LORD
And in His law he meditates day and night.

3 He shall be like a tree
Planted by the rivers of water,
That brings forth its fruit in its season,
Whose leaf also shall not wither,
And whatever he does shall prosper.

4 The ungodly are not so,
But are like the chaff which the wind drives away.

5 Therefore the ungodly shall not stand in the judgement,
Nor sinners in the congregation of the righteous.

6 For the LORD knows the way of the righteous ,
But the way of the ungodly shall perish.


Watch and subscribe us..
Thanky You
Praise the Lord, amen.

February 18, 2018

Prayer of Jabez - యబ్బేజు ప్రార్ధన | Latest christian video message | HO...

❄❄❄ యబ్బేజు ప్రార్ధన ❄❄❄

Prayer of Jabez
బైబిల్ గ్రంధంలో యబ్బేజు ప్రార్ధనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. జన్మనిచ్చిన తల్లే అతనికి వేదన పుత్రుడని పేరు పెట్టి పిలుచుకుంది. ఐనా ఏమాత్రం నిరాశపడక మొక్కవోని అచంచల విశ్వాసంతో దేవుని వైపు తిరిగాడు, దేవుని ప్రేమించాడు, ప్రార్ధించాడు. అతని సోదరులలో మిక్కిలి ఘనతనొందేలా దేవునిచే ఆశీర్వదించబడ్డాడు. కేవలం నాలుగంటే నాలుగే మాటల్లో దేవునికి తనను తాను విన్నవించుకున్నాడు.
యబ్బేజు ఇశ్రాయెలీయుల దేవుని గుర్చి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్ధింపగా అతను మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. 1 దిన
4:10
ఎంతో గొప్ప నమ్మికతో అతను చేసిన ప్రార్ధన, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తావు అనే ఆ గొప్ప నమ్మకమే అతనిని దేవునికి ఇష్టునిగా మార్చింది. అంత గొప్ప ఘనతను ఆపాదించి పెట్టింది.


ఈ వీడియోని మర్చిపోకుండా మీ మిత్రులకు share చేసి పదిమందికి దేవుని సువార్తను చాటగలరు. మా HOPE Nireekshana TV YouTube chaanel ని మర్చిపోకుండా subscribe చెయ్యగలురు, మి మిత్రులతో కూడా subscribe చేయించగలరు. God bless You. Amen.


February 14, 2018

LOVE | Top Ten Bible Verses about LOVE | ప్రేమ | అద్భుతమైన 10 ప్రేమవాక్య...

ప్రేమ - అద్భుతమైన 10 ప్రేమవాక్యాలు
(పరిశుద్ధ గ్రంధం నుండి)
లోకంలో అన్నిటికీ మూలమైనది.. మనిషికీ మనిషికీ మద్య వారధి ప్రేమ. తల్లి తండ్రుల నుండి పిల్లలు ఆశించేది బాల్యంలో ప్రేమే.. అదేవిదంగా వృద్ధాప్యంలో పిల్లలనుండి తల్లి తండ్రి ఆశించేదీ రవ్వంత ప్రేమే. ప్రేమ లేని మనిషి జీవితం నిశీధిలానే ఉంటుంది. ప్రతిమనిషీ తనచుట్టూ ఉన్నవారికి రవ్వంత ప్రేమను అందించగలిగితే ఈ ప్రపంచం ఎంతో అందంగా.. ఆహ్లాదంగా ఉంటుంది. ప్రేమ అంటే కేవలం ఆడమగ మద్య ఉండే సంబంధాలకే పరిమితం కానే కాదు. ఈ ప్రపంచంలో ప్రతివిషయాన్నీ మనం ప్రేమతో ముడిపెట్టి చూడగలిగితే మరో కొత్త ప్రపంచం తప్పక ఉద్భవిస్తుంది. బైబిల్ లో ఎన్నో గొప్ప వాక్యాలు ప్రేమను గురించి వివరించబడ్డాయి. వాటిలో ముఖ్యమైన పది వాక్యాలను మీకు అందిస్తున్నాము. తప్పక మీకు నచ్చుతుందని భావిస్తున్నాము. నచ్చినట్లైతే తప్పక మీ బంధుమిత్రులకు ఈ వీడియోని share చెయ్యగలరు. మన చానెల్ ని మీరు subscribe చేయండి, మీ తోటివారితో subscribe చేయించండి. వర్ణించనలవికాని ప్రేమను సదా మనకు పంచే ఆ దేవాదిదేవుని ప్రియనామములో అందరికీ ప్రేమైక వందనాలు. ఆమేన్.


Praise the Lord...

Please Subscribe..

February 12, 2018

ఈ బైబిల్ ఖరీదు రూ.200 కోట్లు మాత్రమే! | Gutenberg Bible | Telugu | HOPE ...

❄❄❄ ఈ బైబిల్ ఖరీదు రూ.200 కోట్లు మాత్రమే! | ❄❄❄
Johannes John Gutenberg Bible
most costliest Bible in the World.
జోహన్నెస్ గుటెన్ బర్గ్ బైబిల్


జోహన్నెస్ గుటెన్ బర్గ్ అనే స్వర్ణకారుడు క్రీ.శ.1440 సంవత్సరంలో ప్రింటింగ్ ప్రెస్ మిషన్ ని కనుగొన్నాడు.
ప్రపంచంలో ప్రింటింగ్ మిషన్ ను కనుగొన్న తరువాత ముద్రించబడిన మొట్టమొదటి పుస్తకం బైబిల్.
క్రీ.శ.1450 ప్రాంతంలో సమగ్ర బైబిల్ని ముద్రించడానికి తన ప్రయత్నాలు ప్రారంబించాడు.
సుమారు ఆరు సంవత్సరాలు కష్టపడిన మీదట క్రీ.శ. 1456 లో పూర్తి బైబిల్ ని ముద్రించడం జరిగింది.
ప్రస్తుతం మనకు ప్రపంచంలో 49 బైబిళ్ళు మాత్రమే లభ్యమౌతున్నట్లుగా తెలుస్తుంది.
బైబిల్ ను మొదట లాటిన్ బాషలో 42 లైన్లతో నలుపు ఎరుపు రంగుల్లో సమగ్ర బైబిల్ను ముద్రించారు.
మొత్తం 1286 పేజీలతో రెండు వాల్యూములుగా ఈ బైబిల్ ముద్రితమైంది.
ప్రస్తుతం ప్రపంచంలో అతి విలువైన పుస్తకాలుగా జోహన్నెస్
గుటెన్ బర్గ్ బైబిళ్ళు చెలామణి అవుతున్నాయి.
నేటికీ ఆనాడు జోహన్నెస్ గుటెన్ బర్గ్ బైబిళ్ళకు ప్రపంచ మార్కెట్లో ప్రత్యేకమైన విలువ, విశిష్టత ఉంది. కాబట్టే 1978వ సంవత్సరంలో గుటెన్ బర్గ్ ముద్రించిన బైబిల్ ను వేలం వేయగా 2.2 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే మన రూపాయి విలువను బట్టి 14 కోట్ల రూపాయలు. అదే బైబిల్ నేదు 25 నుండి 35 మిలియన్ డాలర్ల ధర పలుకుతుందని అంచనా. అంటే సుమారు 150 కోట్ల రూపాయలనుండి 200 కోట్ల రూపాయల విలువ పలుకుతుందన్నమాట.


ఆశ్చర్యం అనిపించినా నమ్మవలసిన నిజం ఇది.

Watch and subscribe Our Channel for more videos

February 11, 2018

స్నేహమే నా జీవితం | Happy Friendship Day | Telugu | 2016 | HOPE Nireeksh...

❄❄❄ స్నేహమే నా జీవితం ❄❄❄
Happy Friendship Day
అందరికీ స్నేహితులు ఉంటారు... వారు మంచివారా చెడ్డవారా అనేది మనచుట్టూ ఉన్న సమాజమే నిర్ణయించాలి. మంచి స్నేహం బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తే చెడు స్నేహం అధపాతాళానికి తీసుకెళుతుంది. అందుకే స్నేహం విషయంలో మిత్రుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి... లేదంటే జీవితకాలం నష్టపోతాం. అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు వీరందరు ఆ దేవుడు ఏర్పాటు చేసిన వారు..ఇందులో ఎంపిక ఉండదు, కానీ.. ఫ్రెండ్స్ ను మాత్రం మనమే సంపాదించుకోవాలి. ఈ వీడియో లో మంచి స్నేహం గురించి మంచి స్నేహితాల గురించి అలాగే చెడ్డ మిత్రులను వదిలివేయడం ఎంత ముఖ్యమో కూడా చెప్పడానికి ప్రయత్నించాం. మీకు నచ్చుతుందని, మంచి భవిష్యత్తుకు నిచ్చెన మెట్లవంటి గొప్ప మిత్రులను ఎంచుకుని లైఫ్ ను ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాము. మీకు ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి share చేయడం మరువకండి.


February 08, 2018

గుణదలమాత మహోత్సవాలు | Documentary - 2017 | Vijayawada | HOPE Nireekshana TV

❄❄❄ గుణదల మాత మహోత్సవాలు - 2017 ❄❄❄
Gunadala Shrine Festival - 2017
ప్రతియేటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గుణదల మాత మహోత్సవాలు ఈ యేడాది కూడా ఘనంగా నిర్వహించారు. లక్షలాది భక్తులు తరలవచ్చి తమ మొక్కుబడులు భక్తి శ్రద్దలలో తీర్చుకున్నారు. పండుగలో మూడవరోజు ఘనంగా నిర్వహించే సమిష్టి దివ్యబలిపూజా కార్యక్రమాన్ని విజయవాడ కతోలికా పీఠాధిపతి ఫాదర్ తెలగతోటి జోసఫ్ రాజారావు గారి నేతృత్వంలో గుంటూరు కతోలికా పీఠాధిపతి ఫాదర్ చిన్నాబత్తిన భాగ్యయ్య గారు నిర్వహించి విచ్చేసిన అసంఖ్యాక భక్తులకు దైవ సందేశాన్ని అందిచారు.
పూజ అనంతరం కతోలికా భక్తులకు దివ్యసత్ప్రసాదాన్ని అందించారు. సుమారు పదిలక్షలకు పైగా భక్తులు వచ్చారని భావిస్తున్నారు


గుణదల రెక్టార్ యేలేటి విలియం జయరాజ్, మోన్సిజ్ఞోర్ ఫాదర్స్ మువ్వల ప్రసాద్, యం.గాబ్రియేల్, కరస్పాండెంట్ ఫాదర్ ఇంటి ఆంతోనీల పర్యవేక్షణలో మూడురోజుల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.

CM Chandrababu Naidu's Speech on Christmas celebrations at St.Paul Churc...

యేసుక్రీస్తు గురించి ఎంతో గొప్పగా చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ బెంజిసెంటర్ సమీపంలోని సెయింట్ పాల్ చర్చి ప్రాంగణంలో నిర్వహించిన క్రిస్మస్ పండుగ వేడుకలలో పాల్గొని క్రీస్తుని గురించి క్రీస్తు ప్రేమను గురించి చాలా అద్భుతంగా వివరించారు. ఈ వేడుకలను విజయవాడ మేత్రాసన బిషప్ తెలగతోటి రాజారావు గారి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు.


February 06, 2018

DAVID v/s GOLIATH - Bible Story | Telugu | Latest Telugu Christian Video...

❄❄❄ దావీదు గొల్యాతు - తెలుగు బైబిల్ కధ ❄❄❄
బైబిల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కధల్లో దావీదు గొల్యాతుల కధ కూడా ఒకటి. ఈ కధ మనకు మొదటి సమూయేలు గ్రంధము 17వ అధ్యాయములో మనకు కనిపిస్తుంది. యెహోవా దేవునిచే
ఆశిర్వదించబడి తన జనాంగమైన ఇశ్రాయేలీయులకు రాజుగా సౌలును సమూయేలు ద్వారా నియమింపబడతాడు, ఆ తరువాత అతనికి అహంకారం, దేవుని యెడల అవిధేయత పెరిగి దేవుని కోపానికి గురి అవుతాడు. యెహోవా దేవుడు సమూయేలును పిలిచి నీవు బెత్లెహేము గ్రామం పంపించి అక్కడ నివసించె యెష్షయి యొక్క కుమారుడైన దావీదును ఇశ్రాయేలు జనానికి రాజుగా ఎన్నుకునేల చేసి అతనిని సమూయేలుతో అభిషేకింపచేస్తాడు. ఆ తరువాత ఫిలిష్తియుల సైన్యంలోని ఆజానుబాహుడైన గొల్యాతును దావీదు తన వడిసెల ను ఉపయోగించి ఒకా చిన్న రాయితో అతని చంపేస్తాడు. యెష్షయి అన్న మాట ప్రకారం అతని కుమార్తెను ఇచ్చి దావిదుతో వివాహం చేస్తాడు.


మనం కూడా నిరంతరం దేవుని యందు చెరగని విశ్వాసం కలిగియుండి దేవునితో కలిసి ప్రయాణం చేయడానికి సిద్దపడగలిగితే తప్పక యేసయ్య మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, గొప్ప జీవితాన్ని మనకు దయచేస్తాడు. ఆమేన్.

Watch and Subscribe....

ఏడు మాటలు | Seven Words on the Cross | తెలుగు | HOPE Nireekshana TV

❄❄❄ ఏడు మాటలు ❄❄❄

యేసు శిలువలో పలికిన ఏడు మాటలు 

ఆనాడు కల్వరి సిలువలో యేసు క్రీస్తు పలికిన ఏడు మాటలను మనం సూక్ష్మం గా పరిశిలించగలిగితే క్రీస్తుకు మనయందు గల ప్రేమ, భాధ్యత, శిలువ మరణం లోని అంతరార్ధం, యేసు మరణంలో నుండి మనకు లభించిన రక్షణ ఇంకా అందులో మనం గ్రహించవలసినవి.. ఆచరించవలసినవి..చాలానే ఉన్నాయి. దేవుని మహా కృపవలన వాటిలో కొన్నింటినైనా ఈ రోజు మనం ధ్యానించడం మనకు లభించిన గొప్ప ఆత్మీయ అదృష్టం.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

ముళ్ళపొదలు రాళ్ళురప్పలు నిండిన ఈ హృదయసీమలో.. Latest Telugu Christian Son...

ముళ్ళపొదలు రాళ్ళురప్పలు నిండిన ఈ హృదయసీమలో..

Telugu New Christian melody song

Lyric and Tune: Bro Vijay Kumar Kondaveeti, Vijayawada
ఆల్బం: యేసు ఓ యేసు
సంగీతం: కరుణాకర్
రచన & స్వరకల్పన: విజయ్ కుమార్ కొండవీటి
తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలించదో, అలాగే నాయందు నిలిచియుంటేనేకాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. (యోహాను సువార్త 15:1-5}
బ్రదర్ విజయ్ కుమార్ కొండవీటి గారు దేవునిచే ప్రేరేపించబడి అద్భుతమైన ఎన్నో క్రైస్తవ గీతాలను రచించి స్వరపరచి సంగీత విద్వాంసుల సారధ్యంలో ఎన్నో గొప్ప ఆల్బంలను క్రైస్తవ ప్రపంచానికి అందించారు. వాటిలో ఒకటైన యేసు ఓ యేసు ఆల్బం లో ముళ్ళపొదలు రాళ్ళురప్పలు నిండిన ఈ హృదయసీమలో.. అనే పాటను మహాదేవుని గొప్ప కృపను బట్టి మీకు అందిస్తున్నాము. ఈ ఆరాధనా గీతం మీకు నచ్చినట్లైతే మీ బందువులకు, మిత్రులకు తప్పకుండా share చెయ్యండి. మీ కామెంట్ ను క్రింది బాక్స్ లో type చెయ్యండి. దైవజనుల గొప్ప వాక్యసందేశాలతో, పాటలతో, ప్రత్యేక వీడియోలతో మరలా కలుస్తాము. తప్పక చానెల్ ను subscribe చెయ్యగలరు. మా కొరకు ప్రార్ధించండి. ఆమేన్.


February 04, 2018

CM Chandrababu Naidu's Speech on Christmas celebrations at St.Paul Churc...

యేసుక్రీస్తు గురించి ఎంతో గొప్పవాడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు

క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ బెంజిసెంటర్ సమీపంలోని సెయింట్ పాల్ చర్చి ప్రాంగణంలో నిర్వహించిన క్రిస్మస్ పండుగ వేడుకలలో పాల్గొని క్రీస్తుని గురించి క్రీస్తు ప్రేమను గురించి చాలా అద్భుతంగా వివరించారు. ఈ వేడుకలను విజయవాడ మేత్రాసన బిషప్ తెలగతోటి రాజారావు గారి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు.

గుణదలమాత మహోత్సవాలు | Documentary - 2017 | Vijayawada | HOPE Nireekshana TV

❄❄❄ గుణదల మాత మహోత్సవాలు - 2017 ❄❄❄
Gunadala Shrine Festival - 2017
ప్రతియేటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గుణదల మాత మహోత్సవాలు ఈ యేడాది కూడా ఘనంగా నిర్వహించారు. లక్షలాది భక్తులు తరలవచ్చి తమ మొక్కుబడులు భక్తి శ్రద్దలలో తీర్చుకున్నారు. పండుగలో మూడవరోజు ఘనంగా నిర్వహించే సమిష్టి దివ్యబలిపూజా కార్యక్రమాన్ని విజయవాడ కతోలికా పీఠాధిపతి ఫాదర్ తెలగతోటి జోసఫ్ రాజారావు గారి నేతృత్వంలో గుంటూరు కతోలికా పీఠాధిపతి ఫాదర్ చిన్నాబత్తిన భాగ్యయ్య గారు నిర్వహించి విచ్చేసిన అసంఖ్యాక భక్తులకు దైవ సందేశాన్ని అందిచారు.
పూజ అనంతరం కతోలికా భక్తులకు దివ్యసత్ప్రసాదాన్ని అందించారు. సుమారు పదిలక్షలకు పైగా భక్తులు వచ్చారని భావిస్తున్నారు
గుణదల రెక్టార్ యేలేటి విలియం జయరాజ్, మోన్సిజ్ఞోర్ ఫాదర్స్ మువ్వల ప్రసాద్, యం.గాబ్రియేల్, కరస్పాండెంట్ ఫాదర్ ఇంటి ఆంతోనీల పర్యవేక్షణలో మూడురోజుల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.


బైబిల్లో పక్షిరాజు (డేగ) కు ఎందుకంత ప్రాముఖ్యత?.. దాని ప్రత్యేకత ఏమిటి??...

బైబిల్లో పక్షిరాజు (డేగ) కు ఎందుకంత ప్రాముఖ్యత..?

దాని ప్రత్యేకత ఏమిటి ...???
మనకు డేగ, గ్రద్ద.. ఈగిల్ గా పిలుచుకునే పక్షి గురించి చాలా తక్కువగానే తెలుసు! డేగలో మనం తెలుసుకోవలసినవి.. అనుకరించవలసినవి... అనుసరించవలసినవి ఎన్నో ఉన్నాయి. మన బైబిల్లో కూడా పక్షులలో రాజుగా పక్షిరాజుగా డేగను పిలిచారు.. ఎంతో గొప్పగా పొగిడారు. అంతటి గొప్ప లక్షణాలు కలిగిన పక్షిగురించి.. దానిలో ఉన్న ఆ గొప్ప లక్షణాలగురించి మనం తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
ఎవరికీ అందనెత్తులో ఎగురుతూ..
తన ఆహారాన్ని తానే సేకరించుకుంటూ..
పరిస్థితులుకు తగ్గట్టు తనను తానే మార్చుకుంటూ..
మరో కొత్త జన్మకు ఊపిరి పోసుకుంటూ...
పక్షిరాజుగా మన్ననలూ అందుకుంటూ...
ఆకాశంలో విహరించే పక్షులకు మహరాణిగా పిలిపించుకుంటూ..
దర్జాగా జీవించే డేగ మనకు ఎప్పటికీ ఆదర్శమే..
Praise the Lord, Amen.
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పక మీ బంధువులకు స్నేహితులకు share చెయ్యండి. చానెల్ ను subscribe చేయించండి. praise the Lord, Amen.


February 02, 2018

బైబిల్ కాల్చిన వారిని ఉద్దేశించి ఓ చెల్లెమ్మ ఆత్మీయ సమాధానం - తప్పక చూడం...

బైబిల్ కాల్చిన వారిని ఉద్దేశించి...

ఓ చెల్లెమ్మ ఆత్మీయ సమాధానం - తప్పక చూడండి

ఇటివల తెలంగాణా రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో బైబిల్ ని తగలబెట్టి క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసిన వారిని వుద్దేశించి ఓ సోదరి కువైట్ నుండి తన ఆత్మీయ సమాధానాన్ని... క్రైస్తవులకు.. మతోన్మాదులకు సరియైన సమాధానాన్ని తెలియపరచింది. ప్రతిఒక్కరూ తప్పక చూడవలసిన విడియో.

watch and subscribe HOPE Nireekshana TV to watch more Christian messages, songs, short stories etc.,