ఏలి ఏలి లామా సబక్తానీ క్రీస్తు సిలువలో పలికిన నాల్గవమాట యేసు సిలువలో నాదేవా నన్నెందుకు చేయి విడిచావని అన్నాడు?
Fourth Word on the Cross (Seven Words on the Cross)
ఒకే రోజు ముఖ్యమైన 33 ప్రవచనాల నెరవేర్పు
క్రీస్తు శిలువ మరణం పొందిన శుక్రవారం నాడు ఒకే రోజు ముఖ్యమైన ప్రవచనాలు 33 నెరవేరబడినట్లు మనం పరిశుద్ధ గ్రంధంలో చూడవచ్చు. ఆ వాక్యాలను చదువుతుంటే దేవునికి మనయెడల ఎంతటిప్రేమ ఉందో మనకొరకు తన ప్రియ కుమారుణ్ణి మానవమాత్రునిలా ఈ లోకానికి పంపడానికి, సాధారణ మనిషిలా జీవించడానికి, చివరికి అతి భయంకరమైన హింసలకు గురయ్యి మనందరి పాపాల కొరకు తనపుత్రుణ్ణి శిలువకు అప్పచెప్పిన ఆ తండ్రికి మన యెడల ఎంతటి ప్రేమ వాత్సల్యతలు ఉన్నాయో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఆయన ప్రణాళిక ప్రకారమే ప్రవక్తలు తమ గ్రంధాల్లో ఎన్నో ప్రవచనాలు కొన్ని వందల సంవత్సరాల తరువాత జన్మించబోయే కరుణమయుని గురించి తమ లేఖనాల్లో పేర్కొన్నారు. ఆ ప్రవచనాలు, వాటి నెరవేర్పు వచనాలు మనం చదువుతున్నా, వింటూఉన్నా ఎంతో ఆశ్చర్యం, ఆనందం అంతేకాక మనయెడల మనతండ్రికి గల ప్రేమ మనకు అర్ధం అవుతుంది. ఈ రోజు ఆ క్రీస్తు శిలువ మరణానికి సంబందించిన ప్రవచనాలు, ఆ ప్రవచనాలన్ని ఒకే రోజు నెరవేర్పు జరగడం గురించి తెలుసుకుందాం. ఈ అమూల్యమైన వచనాల్ని మీరే కాక మరొ 10 మందికి share చేసి తండ్రి సువార్తను సర్వలోకానికి చాటండి. ఆమేన్.
యెరూషలేమును చూచి యేసు ఎందుకు రోధించాడు ???
ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి - నీవును ఈ నీ దినమందైననూ సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు, గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగుచేయబడియున్నవి. లూకా సువార్త 19:41-42
❄❄❄ యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు ❄❄❄ మొదటిభాగం: శనివారం (శనివారం నుండి శుక్రవారం వరకు - 7 రోజులు)
యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు అంటే శనివారం నుండి తరువాత యేసును శిలువవేసే శుక్రవారం వరకు మొత్తం 7 భాగాలుగా మీకు అందించాలనే తలంపుతో మొదటిభాగంగా శనివారం యేసు ఎక్కడ ఉన్నాడు, ఆ రోజు ఆయన జీవితంలో ఏమి జరిగింది, అందులో దాగివున్న మర్మాలు ఏమిటీ అనే విషయాలను ఈ భాగంలో మీకు అందిస్తున్నాము. శనివారం నాడు మరియ అనబడే స్త్రీ యేసు పాదాలను అతి ఖరీదైన అచ్చజటా మాంసీ అత్తరుతో కడిగి తన తలవెంట్రుకలతో తుడిచి పరిశుద్ధ గ్రంధంలో తనకంటూ ఓ ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది. మరియవలే ఉన్నదానితో తృప్తి నొందుతూ, మనల్ని మనం తగ్గించుకుని యేసయ్య పాదాలదగ్గర ప్రణమిల్లగలగాలి. నీ లేమిలో.. కష్టాలలో, దుఃఖంలో మరువక యేసువైపు చూడగలిగితే నీ లేమిలో కలిమిని చూడగలవు, దుఃఖంలో సంతోషాన్ని చూడగలవు. నీకు అవమానం జరిగినచోట నీ దేవుడు నీకు తోడుంటాడు, అంతకు మించి రెట్టింపు ఘనతను నీకు అందిస్తాడు. తిరిగి మరలా యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులలోని తరువాతి భాగమైన ఆదివారం ఎపిసోడ్ ద్వారా మరలా కలుద్దాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే మీ మిత్రులకు, బంధువులకు, share చేసి subscribe చేయించగలరు. మీ అమూల్యమీన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.
ఆనాడు కల్వరి సిలువలో యేసు క్రీస్తు పలికిన ఏడు మాటలను మనం సూక్ష్మం గా పరిశిలించగలిగితే క్రీస్తుకు మనయందు గల ప్రేమ, భాధ్యత, శిలువ మరణం లోని అంతరార్ధం, యేసు మరణంలో నుండి మనకు లభించిన రక్షణ ఇంకా అందులో మనం గ్రహించవలసినవి.. ఆచరించవలసినవి..చాలానే ఉన్నాయి. దేవుని మహా కృపవలన వాటిలో కొన్నింటినైనా ఈ రోజు మనం ధ్యానించడం మనకు లభించిన గొప్ప ఆత్మీయ అదృష్టం.
ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.
మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.