Showing posts with label golgotha. Show all posts
Showing posts with label golgotha. Show all posts

March 04, 2018

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు | మొదటిరోజు - శనివారం | ఆశ్చర్యక...

❄❄❄ యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు ❄❄❄
మొదటిభాగం: శనివారం
(శనివారం నుండి శుక్రవారం వరకు - 7 రోజులు)
యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు అంటే శనివారం నుండి తరువాత యేసును శిలువవేసే శుక్రవారం వరకు మొత్తం 7 భాగాలుగా మీకు అందించాలనే తలంపుతో మొదటిభాగంగా శనివారం యేసు ఎక్కడ ఉన్నాడు, ఆ రోజు ఆయన జీవితంలో ఏమి జరిగింది, అందులో దాగివున్న మర్మాలు ఏమిటీ అనే విషయాలను ఈ భాగంలో మీకు అందిస్తున్నాము. శనివారం నాడు మరియ అనబడే స్త్రీ యేసు పాదాలను అతి ఖరీదైన అచ్చజటా మాంసీ అత్తరుతో కడిగి తన తలవెంట్రుకలతో తుడిచి పరిశుద్ధ గ్రంధంలో తనకంటూ ఓ ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది. మరియవలే ఉన్నదానితో తృప్తి నొందుతూ, మనల్ని మనం తగ్గించుకుని యేసయ్య పాదాలదగ్గర ప్రణమిల్లగలగాలి. నీ లేమిలో.. కష్టాలలో, దుఃఖంలో మరువక యేసువైపు చూడగలిగితే నీ లేమిలో కలిమిని చూడగలవు, దుఃఖంలో సంతోషాన్ని చూడగలవు. నీకు అవమానం జరిగినచోట నీ దేవుడు నీకు తోడుంటాడు, అంతకు మించి రెట్టింపు ఘనతను నీకు అందిస్తాడు. తిరిగి మరలా యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులలోని తరువాతి భాగమైన ఆదివారం ఎపిసోడ్ ద్వారా మరలా కలుద్దాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే మీ మిత్రులకు, బంధువులకు, share చేసి subscribe చేయించగలరు. మీ అమూల్యమీన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.