August 31, 2018

Christ Seven Words on Calvary | క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలు | 2016...

❄❄❄ క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలు ❄❄❄
Christ Seven Words on Calvary - Telugu

But He was Wounded for our transgressions, He was bruised our iniquities, The chastisement for our peace was upon Him, and by His stripes we are healed, Isaiah 53:5
ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.
మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.


August 30, 2018

యేసురాజా నీ భవనములో రేయిపగలు వేచిఉందును - Wonderful Telugu Christian Son...

యేసురాజా నీ భవనములో రేయిపగలు వేచిఉందును
Bro Ravi Joshua Wonderful Telugu Christian Song
16 BEST INSPIRATIONAL & MOTIVATIONAL QUOTATIONS మంచి మాటలు - మరువరానివి
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.


August 24, 2018

యేసయ్యలో నీకు కావాల్సిన సహాయం తప్పక దొరుకుతుంది - HELP IS FOUND IN THE C...

యేసయ్యలో నీకు కావాల్సిన సహాయం తప్పక దొరుకుతుంది
నిత్యజీవితంలో ప్రతిరోజూ ఏదోఒక సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, వేదిస్తూనే ఉంటుంది. వచ్చిన సమస్యల్ని ఎదుర్కోలేక తప్పించుకుని పారిపోలేక సతమతమౌతూ జీవితాన్ని గడుపుతూ ఉంటాము. కానీ మనం మరచిపోకూడని విషయం ఏమిటంటే అన్ని సమస్యల్నీ, బాధల్ని, వేధనలను రూపుమాపే కరుణమయుడు మనచెంతనే ఉన్నాడనే విషయాన్ని మనం మరచిపోకూడదు. బైబిల్ గ్రంధం ద్వారా మన తండ్రి మనతో నిత్యం మాట్లాడుతూనే ఉంటాడు. మన సమస్యల్ని వేదనల్ని రూపుమాపే శక్తి ఆ పరిశుద్ధునికి మాత్రమే ఉంది. ఆయననే మనం ఆశ్రయించాలి. ఆయనతోనే మన సమస్యల్ని విన్నవించుకోవాలి, ఆయన ద్వారానే మనం మన శోధనలనుండి వేధనలనుండి బయటపడతామని పూర్తిగా విశ్వసించాలి. అప్పుడు తప్పక మన తండ్రి మనల్ని అక్కున చేర్చుకుంటాడు, ఆదరిస్తాడు, మనకున్న సమస్యల్ నుండి బయటకు తీసుకువస్తాడు. మనముండే ప్రతిస్థితిలోనూ ఆయన పరిశుద్ధ వాక్యం మనతో మాట్లాడుతుంది, ఆదరిస్తుంది, నిబ్బరం కలిగి జీవించేలా ప్రోత్సహిస్తుంది. అలాంటి కొన్ని బలమైన ఆదరణ కలిగించే వాక్యాలను మీముందుకు తీసుకువస్తున్నాము. ఏ వాక్యాలను విని విశ్వసించడం ద్వారా ఆత్మీయమేలులు పొందుకోగలరని దేవుని గొప్ప నామములో ఆకాంక్షిస్తున్నాము, ఆమేన్.
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.


August 21, 2018

బైబిల్లో మనకు తెలియని ఇరాక్ మూలాలు | Prominence of Iraq in the Bible - H...

❄❄❄ బైబిల్లో మనకు తెలియని ఇరాక్ మూలాలు ❄❄❄
Prominence of Iraq in Bible History
పరిశుద్ద గ్రంధంలో మనకు సుపరిచితమైన దేశం ఇశ్రాయేలు పట్టణం. కానీ ప్రస్తుతం మనం ఇరాక్ గా పిలుచుకునే దేశానికి కూడా బైబిల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఓ మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు దేశం తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగిన మరో దేశం ఇరాక్ అంటే నమ్మక తప్పదు. ఆదికాండము 1 అధ్యాయం మొదలుకొని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంధం వరకు పలు సందర్భాలలో ఇరాక్ దేశం పేరు మనకు బైబిల్లో వినిపిస్తూనే ఉంటుంది. కాకపోతే ఆనాడు బబులోను, మెసపొటొమియా వంటి పేర్లతో ఇరాకును పిలిచే వారు. ఇరాక్ లో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు, వాటిద్వారా ఇరాక్ కు బైబిల్లో ఎంత ప్రాముఖ్యత ఉందో వివరించడానికే ఈ వీడియోని మీ ముందుకు తెస్తున్నాము. తప్పక చూసి మీకు నచ్చితే మీ మిత్రులకు share చేయగలరు. ఆమేన్.


August 17, 2018

బండరాయిలా నీ జీవితాన్ని మార్చుకో.. బండసందులలో నీ కుటుంబాన్ని దాచుకో! Jes...

బండరాయిలా నీ జీవితాన్ని మార్చుకో..
బండసందులలో నీ కుటుంబాన్ని దాచుకో!

Jesus is our Cornerstone .
బండరాయిలా నీ జీవితాన్ని మార్చుకో.. బండసందులలో నీ కుటుంబాన్ని దాచుకో..
నిత్యం మనం ఎదుర్కునే శోధనలు, వేధనలు ఎలా ఎదుర్కోవాలి.. ఈ రోజు ఎక్కడ చూసినా ఆత్మహత్యలే.. అనుమానపు హత్యలే. ఇవన్నీ సాతాను మన జీవితాలతో ఆడే ఆటలే. వీటిని ఎదుర్కోవాలంటే మన శక్తి సరిపోతుందా? సాతాను చీకటి శక్తుల్ని మనం తట్టుకోగలమా? మనల్ని మన కుటుంబాన్ని అతలాకుతలం చేస్తున్న సాతానుగాడి మాయల్ని మనం తప్పక ఎదుర్కోవాలి, ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి. అందుకు దేవుని సహాయం ఎంతో అవసరం. ఆయనను మనం మన బలమైన కోటగా మర్చుకుని అందులో నివసించాలి. రక్షణదుర్గంగా మార్చుకుని మన కుటుంబాల్ని సురక్షితం చేసుకోవాలి. దేవుని ఆసరాగా మలచుకుని మనకు మన కుటుంబాలకు ఎంతటి ఘోర విపత్తులనైనా ఎదుర్కునే బలమైన బండగా మారాలి. యేసయ్య అనే బండసందులలో మనం నివాసమేర్పర్చుకోవాలి. ఆమేన్.


August 09, 2018

NAA PRIYAMAINA YESU PRABHU - TELUGU CHRISTIAN SONGS - FLUTE COVER VINNY ...

నా ప్రియమైన యేసు ప్రభూ - ఆరాధనా గీతిక

ఆంధ్రక్రైస్తవ కీర్తనలు

NAA PRIYAMAINA YESU PRABHU
FLUTE COVER : VINNY GERA
LATEST TELUGU CHRISTIAN MUSIC ALBUMS

క్రైస్తవుల మదిలో స్థిరంగా నిలచిపోయిన ఎన్నో మధురమైన క్రైస్తవ గీతాలను బెంగళూరులో ఐటి నిపుణుడుగా పనిచేస్తున్న బ్రదర్ విన్నీ గేరా అద్భుతమైన ప్రతిభతో వేణువుపై ఆలపించి దేవుని ఎంతగానో మహిమపరచారు. ఇటివల 'యెహోవా నీ నామము ఎంతో ఘనమైనదీ గీతాన్ని వారిద్వారా మన చానల్ వీక్షకులకు అందించాము. నేడు నా ప్రియమైన యేసు ప్రభూ అనే మరో అద్భుతమైన గీతాన్ని మీ కొరకు అందిస్తున్నాము. వీరి వీడియోలను ఎంతగానో ఆదరిస్తున్నందుకు అందరికీ వందనాలు.

August 06, 2018

దేవుడు నిన్ను ఎన్నుకోబోతున్నాడు! సిద్దంగా ఉండు! - Dr N Ajay Kishore Mess...

దేవుడు నిన్ను ఎన్నుకోబోతున్నాడు! సిద్దంగా ఉండు!!

నీవు విడువబడినవాడవని అనుకుంటున్నావా?
దేవుని కృప నీకు లేదని భ్రమ పడుతున్నావా?
నా జీవితం ఇక ఇంతే.. నా బ్రతుకు నితే అని విలపిస్తున్నావా?
నీ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ సందేశం ..
సాతాను తప్పుడు ఆలోచనలకు వెరవకు
నిన్ను కృంగదీయాలని.. దేవునికి నిన్ను దూరం చేయాలని
చీకటిశక్తులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి...
అన్ని నామములకన్నా పై నామమైన సర్వశక్తిమంతుడైన నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు,
భయపడకు.. ఆయన చెంతకు పరుగిడిరా..
దేవుడు నిన్ను ఎన్నుకోబోతున్నాడు...
నీద్వారా అశ్చర్యకార్యములు చేయించబోతున్నాడు..
ఎందుకూ పనికిరాదనుకున్న నీ జీవితంలో ఆయన ప్రవేశించబోతున్నాడు..
అంతా తానై నిన్ను నడిపించబోతున్నాడు...
నీ జీవితం అద్భుతకరంగా మారబోతుంది.. సిద్దపడు.. ప్రార్ధించు.. ఆమేన్.


Msg by Dr N Ajay Kishore, Jesus Pilgrim Center, Kadapa.

August 02, 2018

శుభవేళ స్తోత్రబలి - Worship Song - Rev Joshi Matcha - Maranatha Church, ...

శుభవేళ స్తోత్రబలి - Worship Song
Rev Joshi Matcha - Maranatha Church, Eluru, AP
ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మరనాత చర్చి వారు పాడిన అద్భుతమైన ఆరాధనా గీతం. ఫాదర్ బెర్క్ మన్ గారు పాడిన ఈ పాట ఎన్నిసార్లు విన్నా మనసుకు ఆనందమే. అంతటి గొప్ప ఆరాధనా గీతాన్ని రెవరెండ్ జోషి మచ్చా వారు తన బృందంతో చాలా మధురంగా ఆలపించి పరమతండ్రి పాదాలవద్ద గొప్ప స్తుతియాగం చేశారు. అందరూ విన్న పాటే అయినా మరోమారు విని ఆనందించవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.