Showing posts with label bro ajaykishore. Show all posts
Showing posts with label bro ajaykishore. Show all posts

August 17, 2018

బండరాయిలా నీ జీవితాన్ని మార్చుకో.. బండసందులలో నీ కుటుంబాన్ని దాచుకో! Jes...

బండరాయిలా నీ జీవితాన్ని మార్చుకో..
బండసందులలో నీ కుటుంబాన్ని దాచుకో!

Jesus is our Cornerstone .
బండరాయిలా నీ జీవితాన్ని మార్చుకో.. బండసందులలో నీ కుటుంబాన్ని దాచుకో..
నిత్యం మనం ఎదుర్కునే శోధనలు, వేధనలు ఎలా ఎదుర్కోవాలి.. ఈ రోజు ఎక్కడ చూసినా ఆత్మహత్యలే.. అనుమానపు హత్యలే. ఇవన్నీ సాతాను మన జీవితాలతో ఆడే ఆటలే. వీటిని ఎదుర్కోవాలంటే మన శక్తి సరిపోతుందా? సాతాను చీకటి శక్తుల్ని మనం తట్టుకోగలమా? మనల్ని మన కుటుంబాన్ని అతలాకుతలం చేస్తున్న సాతానుగాడి మాయల్ని మనం తప్పక ఎదుర్కోవాలి, ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి. అందుకు దేవుని సహాయం ఎంతో అవసరం. ఆయనను మనం మన బలమైన కోటగా మర్చుకుని అందులో నివసించాలి. రక్షణదుర్గంగా మార్చుకుని మన కుటుంబాల్ని సురక్షితం చేసుకోవాలి. దేవుని ఆసరాగా మలచుకుని మనకు మన కుటుంబాలకు ఎంతటి ఘోర విపత్తులనైనా ఎదుర్కునే బలమైన బండగా మారాలి. యేసయ్య అనే బండసందులలో మనం నివాసమేర్పర్చుకోవాలి. ఆమేన్.


August 06, 2018

దేవుడు నిన్ను ఎన్నుకోబోతున్నాడు! సిద్దంగా ఉండు! - Dr N Ajay Kishore Mess...

దేవుడు నిన్ను ఎన్నుకోబోతున్నాడు! సిద్దంగా ఉండు!!

నీవు విడువబడినవాడవని అనుకుంటున్నావా?
దేవుని కృప నీకు లేదని భ్రమ పడుతున్నావా?
నా జీవితం ఇక ఇంతే.. నా బ్రతుకు నితే అని విలపిస్తున్నావా?
నీ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ సందేశం ..
సాతాను తప్పుడు ఆలోచనలకు వెరవకు
నిన్ను కృంగదీయాలని.. దేవునికి నిన్ను దూరం చేయాలని
చీకటిశక్తులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి...
అన్ని నామములకన్నా పై నామమైన సర్వశక్తిమంతుడైన నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు,
భయపడకు.. ఆయన చెంతకు పరుగిడిరా..
దేవుడు నిన్ను ఎన్నుకోబోతున్నాడు...
నీద్వారా అశ్చర్యకార్యములు చేయించబోతున్నాడు..
ఎందుకూ పనికిరాదనుకున్న నీ జీవితంలో ఆయన ప్రవేశించబోతున్నాడు..
అంతా తానై నిన్ను నడిపించబోతున్నాడు...
నీ జీవితం అద్భుతకరంగా మారబోతుంది.. సిద్దపడు.. ప్రార్ధించు.. ఆమేన్.


Msg by Dr N Ajay Kishore, Jesus Pilgrim Center, Kadapa.

July 30, 2018

యేసయ్యకు నీవో ప్రత్యేకం! మాదిరికరంగా జీవిస్తున్నావా? Dr N Ajay Kishore M...

యేసయ్యకు నీవో ప్రత్యేకం! మాదిరికరంగా జీవిస్తున్నావా?

Dr N Ajay Kishore Wonderful and inspirational messages on youth trends and christian families life styles, Halleluya Pentecost Ministries, Christi Pilgrim Center, Kadapa,

నేటి క్రైస్తవ యువత ఆధునిక జీవనశైలి, ఫ్యాషన్ ప్రపంచం, వింతపోకడలు, వారిపై లోక ప్రభావాల గురించి, ఇంకా క్రైస్తవ కుటుంబాల ఆలోచనా విధానం, రాజీదోరణి, నిబద్ధత లేని జీవితాలు, లోకానుసార జీవితాలను గురించి సహోదరుడు Dr.N.Ajay Kishore, Jesus Pilgrim Center, Kadapa వారు తనదైన శైలిలో చాల క్లుప్తంగా వివరించారు, మార్పులేని క్రైస్తవ జీవితాలు ఎందుకూ కొరగావని.. దేవుని యెరిగి ఉన్నా సాతాను బంధకాలలో జీవిస్తూ మార్పులేని జీవితాలు ఏ నాటికీ యేసయ్య దరిచేరలేవని... మార్పు ఏనాడో కాదు నేడే రావాలని.. అందుకూ ప్రార్ధనా జీవితం నేటినుండే ప్రారంభించాలని హెచ్చరిస్తూ చేసిన ఈ వీడియో తప్పక యువతకూ, క్రైస్తవ కుటుంబాలకూ మార్గనిర్దేశం చేస్తుంది. తప్పక చూడండి. Amen.
బ్రదర్ అజయ్ కిషోర్, బ్రదర్ విజయ్ కిషోర్ సోదరులు దేవునిచే ఆశీర్వదించబడి.. బహుగా ఫలింపబడుతూ..
హల్లెలూయా పెంతెకోస్తు మిషన్, Jesus Pilgrim Center ల ద్వారా కడప పట్టాణంలో..దేవుని సువార్తను వేలాదిమందికి చాటుతూ ఆత్మలను తండ్రి సన్నిధికి చేరుస్తున్నారు. చిన్న వయసులో బహుభారముతో సోదరులు నడిపిస్తున్న సేవను గురించి మనమందరం ప్రార్ధించుదాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.
Praise the Lord.. Watch Share and Subscribe.


July 23, 2018

కష్టాలు కన్నీళ్ళూ శాశ్వతం కాదు..అవి రేపటి మీ సాక్షాలుగా మారబోతున్నాయి - ...

కష్టాలు కన్నీళ్ళూ శాశ్వతం కాదు.. అవి రేపటి మీ సాక్షాలుగా మారబోతున్నాయి !
Dr Ajay Kishore Wonderful and inspirational messages on suicides messages, helleluya pentecost ministries kadapa,


మన జీవితాలలో కష్టాలు కన్నీళ్ళు తప్పవు, శోధనలూ వేదనలూ తప్పవు. ఈ రోజు మనం అనుభవించే ఈ కష్టాలన్ని తప్పక రేపు మనకు మంచి సాక్షాలుగా మారుతాయి, రెండంతల ఆశీర్వాదాలు మనము పొందుకుంటాము. కష్టలు లేనిదెవరికి, అనుభవించనివారు ఎవరు. ఎక్కడో చదివాను... అరికాళ్ళు తడవకుండా సంద్రాన్ని దాటవచ్చట... కానీ కన్నీటిని విడువకుండా ఏ మనిషి జీవితాన్ని దాటలేడట. ఎంత కఠోర సత్యం. దేవుని కుమారుడైన యేసయ్య కూడా సాతాను శొషనలు భరించాల్సి వచ్చింది, శిలువయాగంలో మరెన్నో వేధనలు అనుభవించాల్సి వచ్చింది. యోబు గారు అన్నట్లూ.. నాకెన్ని కష్టాలు ఎదురైనా భరిచగలను తండ్రీ, నాచేతిని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ విడువకు అని ప్రార్ధిస్తాడు. మనమూ తండ్రిని అలాగే ప్రార్ధించుదాం. రేపటి సాక్ష్యంగా ప్రభువులో నిలుద్దాం. ఆమేన్.

ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.

July 16, 2018

ఆత్మహత్యలు పరిష్కారం కానేకాదు - Dr Ajay Kishore - Christ Piligrim Center...

నీ సమస్యకి చావే ముగింపా...?
ఆత్మహత్యే పరిష్కారమా....?
కానేకాదు!
యేసు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు!!


ఈ రోజు ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ఆత్మహత్యల వార్తలే...
మనిషి రోజురోజుకు మానసికంగా బలహీనపడుతూ.. ఒంటరివాడుగా మిగిలిపోతున్నాడు, ఓంటరిగానే తన కధను అర్ధంతరంగా ముగించుకుంటున్నారు. నిరంతరం మన సెల్ ఫోన్స్ లో ఈ ఆత్మహత్యల వీడియోలే వైరల్ అవుతూ చావుని చాలా సులభతర పరిష్కార మార్గాలుగా అందర్నీ తప్పుత్రోవ పట్టిస్తున్నాయి.
అసలు సమస్య ఎక్కడ ప్రారంభమౌతుంది, ఎక్కడ ముగిసిపోతుందో తెలియని అయోమయంలో బ్రతికేస్తున్నాము,
ముందూ వెనుకా ఏ మాత్రమూ ఆలోచించక సమస్యలకి చావడం ఒక్కటే సులభతర పరిష్కార మార్గంగా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ చీకటి ఆలోచనలకు బలౌవుతున్నారు. మార్కులు తక్కువ వచ్చినా, అప్పుతీసుకుని సమయానికి వడ్డీ డబ్బులు కట్టలేకున్నా, ప్రేమలో విఫలమైనా, ఆర్ధిక సమస్యలైనా.. విషయం ఏదైనా.. వయసుతో సంబందం లేకుండా బలవంతపు మరణన్ని ఆశ్రయిస్తున్నారు.
తామే లెకుంటే తమ పిల్లల జీవితాలు ఏమి బాగుపడతాయిలే అని వారిని కూడా తమతోపాటు మరణానికి గురిచేస్తున్నారు. ఎంత దారుణం,
ఆలోచించాలి, ఈ జీవితం నీవు సంపాదించుకున్నది కాదు, నీ జీవితంపై నీకేలాంటి హక్కూ లేదు, భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని నాశనం చేయడానికి నిజంగా మనకేం హక్కు ఉంది.
బ్రదర్ అజయ్ కిషోర్ గారు ఎంతో వేదనతో, బహుబారమైన మనసుతో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ రోజు ఈ వాక్యం మీకందిస్తున్నారు, తప్పనిసరిగా ఇది దేవుని ప్రణాళిక, ఈ మెస్సేజ్ ద్వారా ఏ ఒక్కరికి ఉపకారం జరిగినా మా ప్రయాస దేవుని పట్ల నెరవేరినట్లే. ఆమేన్.