Sunday, October 30, 2016

యేసయ్య... ప్రేమామయుడు | Bro.Pradeep Kumar Messages | Jesus Miracles | HO...

యేసయ్య... ప్రేమామయుడు

న ప్రియ ప్రభువైన యేసు నమ్మదగినవాడు, ప్రేమమూర్తి, దయామయుడు, సమస్తమూ ఎరిగిన వాడు, మనదోషములను ఎంచక, మన పాపములను క్షమించి..పశ్చాతాపముతో వచ్చిన ప్రతిఒక్కరిని అక్కున చేర్చుకుని ఆదరించే ప్రేమామయుడు. అంతటి మహిమాన్వితుడు కాబట్టే తను ఏర్పరచిన జనం తన మొహం మీద ఉమ్మి వేస్తారని తెలిసినా ప్రేమించాడు, కొరడా దెబ్బలతో వళ్ళు తూట్లు పొడిచి అతి సుందరమైన తన శరీరాన్ని జల్లెడ చేస్తున్నా భరించలేని ఆ భాధను మౌనంగా భరించాడు. శిలువమ్రానుపై కాళ్ళూచేతుల్లో మేకులు కొట్టి పక్కలో పొడిచినా "తండ్రీ వీరేమిచేయుచున్నారో వీరికే తెలియదు, వీరిని క్షమించండి మనకొరకు అంతటి వేదనకరమైన సమయంలోను మన కొరకు మనము చేయు పాపముల కొరకు తన తండ్రిని వేడుకున్నాడు.అంతటి ప్రేమామయుని బిడ్డలుగా మనము అటువంటి లక్షణాలే అలవరచుకుని సాతి మనుషుల యెడల ప్రేమను పంచుదాం. యేసయ్య బిడ్డలుగా పరిపూర్ణులవుదాము.

subscribe HOPE Nireekshana TV YouTube Channel


Thursday, October 27, 2016

Jesus Will Answer Every Prayer
" You did not choose me, but I chose you and appointed you that you should go and bear fruit and that your fruit should abide, so that whatever you ask the Father in my name, he may give it to you."
John 15:16
Have you ever asked the question, why doesn't prayer work? Why at times does it appear that God ignores us when we pray to Him. Many have prayed for God to intervene and solve a problem that they are struggling with, but sometimes God‘s apparent answer is silence.
The Answer is "JESUS LOVE YOU SO MUCH, HE IS PLANNING SOMETHING BIG IN OUR LIVES ".
No matter how hopeless a situation seems -- from a stale marriage to a prolonged period of unemployment -- God has the power to change it when you pray boldly and expect him to respond. In fact, religious texts say that God’s power is so big that he can do anything. Yet sometimes our prayers are too small for such a big God.
God accepts any prayer since he’s always willing to meet us where we are. But if we pray without expecting God to respond, we’re limiting what we’re inviting him to do in our lives. If, on the other hand, we approach God with faith-filled prayers, we may see something wonderful and miraculous happen in our lives.
Here’s how you pray more powerfully to invite God to work miracles in your life:
God will respond to any prayer, no matter how small. Since you can approach God with confidence, why not pray the biggest, most powerful prayers that you can?
PRAYER

Lord, in every need let me come to You with humble trust saying, "Jesus, help me."
In all my doubts, perplexities, and temptations, Jesus, help me.
In hours of loneliness, weariness, and trials, Jesus, help me.
In the failure of my plans and hopes; in disappointments, troubles, and sorrows, Jesus, help me.
When others fail me and Your grace alone can assist me, help me.
When I throw myself on Your tender love as a father and savior, Jesus, help me.
When my heart is cast down by failure at seeing no good come from my efforts, Jesus, help me.
When I feel impatient and my cross irritates me, Jesus, help me.
When I am ill and my head and hands cannot work and I am lonely, Jesus, help me.
Always, always, in spite of weakness, falls, and shortcomings of every kind, Jesus, help me and never forsake me.
Amen.
Please put trust and faith in Jesus but not in Superstitions.
subscribe HOPE Nireekshana TV Christian YouTube Channel.  

Monday, October 24, 2016

వాగ్దానం చేసిన మన దేవుడు నమ్మదగిన వాడు

మోషేకు వాగ్దానం చేసిన దేవుడు, ఎన్నో ఇబ్బందుల గుండా ఇశ్రాయేలు జనాంగాన్ని కానాను దేశానికి నడిపించాడు. ఫ్రజలను కానానుకు నడిపిస్తూ ఎర్రసముద్రం దగ్గరికి వెళ్ళే దారినే చూపెట్టి ఆ మార్గంలోనే వెళ్ళమంటాడు, మోషేకు తెలుసు అటువైపు దారి లేధు అంతా సముద్రమే అని, అయినా దేవుడు నిర్దేశించాడు కాబట్టి ఆ మార్గాన్నే అనుసరించాడు, తన జనాంగాన్ని నడిపించాడు. మోషెతో వచ్చిన ప్రజలు అతన్ని ఎన్నో మాటలు, నిందలు, అవమానలతో ఇబ్బంది పెట్టారు, సణిగారు, గొణిగారు..ఐనా మోషే తన విశ్వాసాన్ని విడువలేధు దెవుణ్ణే, అడిగాడు.. మార్గం చూపమని.. ఎర్రసముద్రం రెండుగా చీల్చబడింది, ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేర్చాడు.. దేవుడే తన వాగ్దానాన్ని నెరవేర్చి వారికి నెమ్మదిని కలుగచేశాడు.


వాగ్దానం చేసిన యేసయ్య మనం మర్చిపోయినా ఆయన తను ఇచ్చిన మాట నెరవేర్చకుండా ఉండడు..మనల్ని నడిపించు మన దేవుడు కునుకడు నిద్రపోడు..

Praise the Lord, Amen.
Watch and subscribe our HOPE Nireekshana TV YouTube Channel.

Sunday, October 23, 2016

మనిషి స్వేచ్చ - దేవుని ప్రేమ | Bro. Pradeep Kumar Messages | HOPE Nireek...

మనిషి స్వేచ్చ - దేవుని ప్రేమ

నిషిగా మలుచుకున్న తన బిడ్డలను దేవుడు చాలా ప్రేమించాడు, కావలసినంత స్వేచ్చను అనుగ్రహించాడు, ఎంతటి పాపాత్ములనైనా కరుణించి ఆలింగనం చేసుకుని తిరిగి తన బిడ్డలనుగా చేసికొని ఆదరించే వాడు యేసయ్య. ఆదాముకు స్వేచ్చను ఇచ్చాడు, పండు తినవద్దన్నా వినక తిని పాపంలో పడిపోయాడు, గొర్రెల కాపరి ఐన దావీదును ఇశ్రాయేలు జనాంగానికి రాజుని చేసాడు, దావీదు పాపం చేసినా క్షమించాడు, ఆ మొద్దు నుండే తను చిగురుగా వచ్చి తన గొప్ప ప్రేమను చాటుకున్నాడు. అలాంటి దృష్ట్యాంతాలు మనం బైబిల్ లో చాల చూడవచ్చు, ఆలాంటి దేవుని ప్రేమ గురించి బ్రదర్ ప్రదీప్ కుమార్ గారు తన ప్రసంగంలో చక్కగా వివరించారు. ఈ వీడియో మీకు నచ్చితే మీ తోటివారికి share చేయగలరు. తప్పక HOPE Nireekshana TV channel ని subscribe చేయగలరు.
ఆమేన్.

Wednesday, October 19, 2016

స్థిరమైనవి...దేవుని చిత్తములో? | తెలుగు | With Scriptures I HOPE Nireeks...

స్థిరమైనవి.. నిలకడగలిగినవి... శాశ్వతమైనవి... దేవుని చిత్తములో? 

స్థిరమైనవి.. నిలకడగలిగినవి... శాశ్వతమైనవి... దేవుని చిత్తములో? పరిశుద్ధ గ్రంధములోని లేఖనాలసారం

HOPE Nireekshana TV వారి వీడియో. బైబిల్ నందు ఎరుకపరచిన క్రైస్తవ్యంలో స్థిరమైన, నిలకడగలిగిన, శాశ్వతమైన గొప్ప విషయాలు ఏమిటో వాక్యానుసారం ప్రేక్షకులకు తెలియపరచడానికి ప్రయత్నించాము. అట్టి స్థిరమైన విషయాలలోనే మనం మనసును ఉంచి అశాశ్వతమైన నిలకడలేని అస్థిరమైన వాటికి దూరంగా ఉన్నపుడే మనం ఆ కరుణామయుని ప్రేమను పొందగలుగుతాము, ఆయన సన్నిధి అయిన పరలోక రాజ్యపు వారసులం అవుతాము. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు share చెయ్యగలరు. దేవుని వాక్యాన్ని పదిమందికి అందించగలిగితే కొన్ని ఆత్మలను ఐనా మనం దేవుని యొద్దకు తెచ్చినవారం అవుతాం.

Praise the Lord, Amen. 

Sunday, October 16, 2016

Jesus Miracles | యేసు చేసే అధ్భుతములు | Part 2 | Bro.Pradeep Kumar | HOP...

యేసయ్యను పరిపూర్ణంగా నమ్మి విశ్వసించి నిన్ను నీవు ఆ దేవాదిదేవునికి సమర్పించుకోగలిగితే తప్పక నీ శరీరంలో, నీ కుటుంబంలో ఉన్న సమస్యలను తీసివేస్తాడు. మనం నలగగొట్టబడితేనే దేవుని రాజ్యపు వారసులం కాగలం, అట్టిస్థితిని పొందేందుకే ఈ కష్టాలు, వ్యాధులు, శ్రమలు. నమ్మి విస్వసించండి.. పరిపూర్ణమైన విడుదలను పొందండి. అమేన్.

బ్రదర్ ప్రదీప్ కుమార్ గారు దేవునిలో బహుగా వాడబడుతూ తన వాక్య పరిచర్యతో వేలాది ఆత్మలను దేవునివైపు మళ్ళిస్తూ దేవుని రాజ్య మార్గాన్ని సుగమం చేస్తున్నాడు. వాక్యాన్ని, దేవుని స్వస్థతలను.. యేసు చేసే అధ్భుతములను పదిమందికి share చెయ్యండి, మరిన్ని వీడియోలను చుసేందుకు మా చానెల్ ను subscribe చెయ్యండి. Praise the Lord.
Subscribe HOPE Nireekshana TV 


Wednesday, October 12, 2016

పరిశుద్ధాత్మ చేయు కార్యములు

పరిశుద్ధాత్మ సహయత మన జీవితాలలో అంతో ఇంతో కాదు, దేవునికి మనకు మధ్య వారధిగా నిలచి మనము దేవుని వారసులుగా మారడంలో తండ్రి కుమారుని ప్రరిశుద్ధాత్మ నామంలో జీవించడానికి యెంతో సహయం దయచేస్తున్నది. మన జీవిత కాలంలో పరిశుద్ధాత్మ ద్వారా మనకు సహాయం ఏవిధంగా అందుతుందో పరిశుద్ధ గ్రంధ వాక్యనుసారం వివరించడమైనది. ఈ వాక్యాలు మనలను తండ్రియొక్క ప్రేమని పొందుటలో... పరిశుద్ధాత్మ శక్తిలో మనం ఎదుగుటలో ఎంతో ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాము. మీరు మేము మనమందరం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో జీవించి మంచి నిరీక్షణ కలిగి జీవించి యేసుక్రీస్తు ప్రభువు వారి రెండవ రాకడలో ఎత్తబడే వారిగా మన జీవితాలము తీర్చిదిద్దుకుందాము.

ఆమేన్.

Subscribe HOPE Nireekshana TV

Sunday, October 9, 2016

ఎవరు!!! యేసయ్య కృపకు పాత్రులు? | Bro.Pradeep Kumar Messages | HOPE Niree...

యేసయ్య కృపకు ఎవరు పాత్రులు కాగలరు!!!

 భక్తిపరుడా! ధనవంతుడా! దైవజనులా!

వరు ఆ తండ్రి కరుణకు, కృపకు, వర్ణించనలవికాని ప్రేమకు పాత్రులు కాగలరు. దీనికి బైబిల్ లో ఎన్నో చోట్ల సమాధానాలు దొరుకుతాయి. తనను తాను తగ్గించుకొని, ఎవరైతే దేవుని పాదాల చెంత మోకరిల్లి తనను తాను అర్పించుకొని క్రీస్తు యేసుని ఆరాధిస్తారో వారే ఆ ప్రభువు కృపకు పాత్రులు కాగలరని బ్రదర్ ప్రదీప్ కుమార్ తన వాక్య సందేశంలో విపులంగా వివరించారు. ప్రతి ఒక్కరు తప్పక విని ఆ యేసయ్య కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాము.

అమేన్.

Subscribe HOPE Nireekshana TV

Friday, October 7, 2016

యేసయ్య మన ప్రార్ధన ఆలకించియున్నాడు!!! 
తడు దూత వైపు తేరి చూచి భయపడి - ప్రభువా, యేమని అడిగెను. అందుకు దూత - నీ ప్రార్ధనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అపో.కార్యములు 10:4
నీ అవసరతలో, నీ వ్యాధిబాధలలో, నీ శోధనలో ని స్థితి ఇదైనా  నివ్వు మరువక విడువక యేసయ్యకు ప్రార్ధనలో మొఱ్ఱ పెట్టగలిగితే... మన దేవుడు నీ ప్రార్ధన తప్పక ఆలకిస్తాడు, తగు రీతిలో సహాయం చేస్తాడు.
నమ్ము వానికి సమస్తము సాధ్యమే అంటాడు మన ప్రియా తండ్రి.

ప్రార్ధన ఎంతో శక్తివంతమైనది
ప్రార్ధన ఎంతో ఫలవంతమైనది
ప్రార్ధన దేవునికి ఇష్టమైనది
ప్రార్ధన దేవునికి నీకు మద్య వారధిగా మారుతుంది
నిరంతరం మనం ప్రార్ధనలో ఉంటూ మన పిల్లల్ని కూడా ప్రార్ధనలో నడిపించాలి
మనం చేసే ప్రార్ధన మన పిల్లలు గమనించేలా శ్రద్ద తీసుకోవాలి
మన ప్రార్ధన వారు ఆలకించాలి
తద్వారా వారుకూడా నిరంతరం దేవుని మహిమ పరుస్తూ.. స్తుతిస్తూ ఆయనకు దగ్గర అయ్యేలా ప్రయత్నించాలి,
నీవు నేనే కాదు మన కుటుంబం సమస్తం ఆయన పాదాలచెంత మోకరిల్లి ప్రార్ధించాలి
నమ్మికయుంచి ప్రార్ధించగలిగితే మన ప్రార్ధన యేసయ్య ఆలకిస్తాడు
మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు
నీ నా సమస్తమైన అవసరాలు గుర్తెరిగిన ఆ ప్రభువు మనం కోరుకున్నవి అందించడానికి ఆయన నిరంతరం సిద్ధంగానే ఉంటాడు, అందుకోవడానికి మనమే సిద్దపడగలగాలి.
త్వరపడదాం ప్రియులారా....
విశ్వాసంతో మోకరిల్లి తండ్రి ప్రియకుమారులు కుమార్తెలుగా ఆయన చెంత చేరదాం.
ఆమేన్.
watch and subscribe: HOPE NIreekshana TV  YouTube Channel. 

Wednesday, October 5, 2016

నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తమూ సాద్యమే. మార్కు సువార్త 9:23
న తండ్రియైన యేసుక్రీస్తు ప్రభువు ఎంతైనా నమ్మదగినవాడు, ఆయన నామమును ఎరిగి ఆయనయందు నమ్మకముంచు ప్రజలు ఎన్నటికి సిగ్గునొందరు.
నేను అప్పుల బంధకాలలో చిక్కుకునియున్నాను, యేసయా నన్ను విడిపించగలడా??
నేను భయంకరమైన వ్యాదితో బాధపడుతున్నాము, నాకు స్వస్థత అనుగ్రహిస్తాడ???
నిరుద్యోగ సమస్యతో కృగిపోతున్నాను, నాకు మార్గం చూపగలడా??
గర్భఫలము లేక చింతించుచున్నాను, అనుగ్రహిస్తాడా???
అని నీవు హృదయములో వ్యాకులపడుతున్నావా????
ఎలాంటి పరిస్థితులలో నీవు చేయవలసింది ఒక్కటే..
యేసయ్య వైపు చూడు, ఆయనయందు మాత్రమే విశ్వాసముంచు.
ఇవన్నీ కూడా మనుష్యులకి అసాద్యమే.. కానీ దేవునికి సమస్తమూ సాద్యమే (మార్కు 10:27)

ఆ దేవాదిదేవునికి అసాద్యమైనది ఏదియులేదు కనుక నీవు చేయవలసినదల్లా ఆ యేసయ్య యందు నమ్మిక ఉంచడమే.
నీవు నమ్మినట్లైతే ఏ స్థితిలో నీవు ఉన్నా ఆ స్థితిలో నుండి నిను పైకి లేవనెత్తి, ఓదార్చి, బలపరచి,
స్వస్థపరచి, విడుదల దయచేసి నీ యొక్క సమస్తభారమును తొలగించి ఆయనయొక్క శాంతి సమాధానమును
నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించి అనేక జనములకు నిన్ను ఆశీర్వాదముగా మార్చగల దేవుడు మన యేసయ్య.
కాబట్టి నీవు నమ్ముతావా ???
ఏరోజైనా యేసయ్యయందు నీవు నమ్మిక యుంచిన యెడల మహిమలో నుండి అధికమహిమలోకి నీవు ప్రవేశింతువు.
కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా యేసయ్య యందు నమ్మికయుంచి సకల ఆశీర్వాదములను పొందుకోవాలని కోరుకుంటున్నాను.
ఆమేన్.
subscribe: HOPE Nireekshana TV

Why not love the World | Bible Scriptures | 2016 | HOPE Nireekshana TV

Watch and Subscribe: Monday, October 3, 2016

యేసయ్య ఆలయపు తెర నడిమికి చించాడు...
మరి నీ మనసు తెర ????
పాతనిభంధనా కాలంలో మనకు ఆ యెహోవా దేవునికి మద్య ఓ తెర ఉండి ఆ తెరదాటి మామూలు జనం లోనికి వెళ్ళగలిగే వారు కాదు. కడపటి ఆదాముగా వచ్చిన మన యేసయ్య తన మరణంతో ఆ ఆలయపు తెర నడిమికి చించివేసి మనకు మన తండ్రికి మద్య ఉన్న ఆ అడ్డును తొలగించాడు.

ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది. హెబ్రీ 10:20, తన తండ్రికి మనకు ఉన్న ఆ అడ్డుతెరను ఆయన తొలగించి మార్గం సుగమం చేసి తండ్రిని మన తోటివారిని ఎలా ప్రేమించాలో చక్కగా వివరించారు.
నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ. నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ;
మార్కు 12:30-31
మరి ఎందుకు ఆలాంటి స్థితిని మనం పొందలేకపోతున్నాము. మన మనసు పొరలను అంటిపెట్టుకుని అడ్డుగా ఉన్న ఆ తెరను తొలగించి మనం బయటకు ఎందుకు రాలేకపోతున్నాము. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు
దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలె నను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము. 1 యోహాను 19-21
మరి ఆ విధంగా మనం ఉన్నట్లైతే ఈ కక్షలు.. గొడవలు.. పరస్పర విరుద్ద భావాలు ఎందుకు వస్తున్నాయి. ఇవి వ్యక్తుల మద్య మాత్రమే కాక రెండు ప్రాంతాల మద్య, దేశాలమద్య కూడా చిచ్చు పెడుతున్నాయి కదా.. క్రైస్తవాన్ని ఆచరిస్తున్నామని చెప్పే మనం నిజమైన ఆ క్రీస్తు వారసులమేనా ??
మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? 1 కొరింథీ 3:6 అంత మహోన్నతమైన సిం హా సనంపై ఆ దేవాది దేవుడు మనల్ని కూర్చోబెట్టాడు కదా.. మరి మనలో ఆయన ఆశించిన మార్పు ఎందుకు సాద్యపడటం లేదు.
ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను; 2 కొరింథీ 5:17
మరి ఆ నూతన సృష్టికి అంకురార్పణ ఎప్పుడు ???
మన్నయినది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. ప్రసంగి 12:7
మరి మనమూ మన్నయిన తరువాత..మన పరిస్థితి ?? మరి ఎందుకింక ఆలశ్యం.
ఈ క్షణమే మనమూ.. మన మనసును కప్పుకొనియున్న ఆ తెరను తొలగించి మనకూ మన పొరుగువారికి.. మనకూ ఆ దేవాదిదేవునికి మద్యన ఉన్న అడ్డుగోడను కూల్చి ఆ యేసయ్య రెండవ రాకడకొరకు సిద్దపడదాము.
ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. మత్తయి 24:42 అన్న ఆ మాటను నమ్మి నిత్యం ప్రభు వాక్యంలో ప్రార్ధనలో ఎదురుచూస్తూవుందాము.
ఆమేన్.
యేసయ్య ఆలయపు తెర నడిమికి చించాడు...
మరి నీ మనసు తెర ????
పాతనిభంధనా కాలంలో మనకు ఆ యెహోవా దేవునికి మద్య ఓ తెర ఉండి ఆ తెరదాటి మామూలు జనం లోనికి వెళ్ళగలిగే వారు కాదు. కడపటి ఆదాముగా వచ్చిన మన యేసయ్య తన మరణంతో ఆ ఆలయపు తెర నడిమికి చించివేసి మనకు మన తండ్రికి మద్య ఉన్న ఆ అడ్డును తొలగించాడు.

ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది. హెబ్రీ 10:20, తన తండ్రికి మనకు ఉన్న ఆ అడ్డుతెరను ఆయన తొలగించి మార్గం సుగమం చేసి తండ్రిని మన తోటివారిని ఎలా ప్రేమించాలో చక్కగా వివరించారు.
నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ. నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ;
మార్కు 12:30-31
మరి ఎందుకు ఆలాంటి స్థితిని మనం పొందలేకపోతున్నాము. మన మనసు పొరలను అంటిపెట్టుకుని అడ్డుగా ఉన్న ఆ తెరను తొలగించి మనం బయటకు ఎందుకు రాలేకపోతున్నాము. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు
దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలె నను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము. 1 యోహాను 19-21
మరి ఆ విధంగా మనం ఉన్నట్లైతే ఈ కక్షలు.. గొడవలు.. పరస్పర విరుద్ద భావాలు ఎందుకు వస్తున్నాయి. ఇవి వ్యక్తుల మద్య మాత్రమే కాక రెండు ప్రాంతాల మద్య, దేశాలమద్య కూడా చిచ్చు పెడుతున్నాయి కదా.. క్రైస్తవాన్ని ఆచరిస్తున్నామని చెప్పే మనం నిజమైన ఆ క్రీస్తు వారసులమేనా ??
మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? 1 కొరింథీ 3:6 అంత మహోన్నతమైన సిం హా సనంపై ఆ దేవాది దేవుడు మనల్ని కూర్చోబెట్టాడు కదా.. మరి మనలో ఆయన ఆశించిన మార్పు ఎందుకు సాద్యపడటం లేదు.
ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను; 2 కొరింథీ 5:17
మరి ఆ నూతన సృష్టికి అంకురార్పణ ఎప్పుడు ???
మన్నయినది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. ప్రసంగి 12:7
మరి మనమూ మన్నయిన తరువాత..మన పరిస్థితి ?? మరి ఎందుకింక ఆలశ్యం.
ఈ క్షణమే మనమూ.. మన మనసును కప్పుకొనియున్న ఆ తెరను తొలగించి మనకూ మన పొరుగువారికి.. మనకూ ఆ దేవాదిదేవునికి మద్యన ఉన్న అడ్డుగోడను కూల్చి ఆ యేసయ్య రెండవ రాకడకొరకు సిద్దపడదాము.
ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. మత్తయి 24:42 అన్న ఆ మాటను నమ్మి నిత్యం ప్రభు వాక్యంలో ప్రార్ధనలో ఎదురుచూస్తూవుందాము.
ఆమేన్.

Sunday, October 2, 2016

ఓటమిలో విజయం | Bro.Pradeep Kumar Messages | Jesus Miracles | HOPE Nireekshana TV

ఓటమిలో విజయం

యేసయ్యను నీవు విశ్వాసంతో నమ్మి వెంబడించగలిగితే నీ జీవితంలో అపజయాలు ఎదురైనా అవి తాత్కాలికమే.. ఆ అపజయంలో నుండే నీవు విజయం సాధిస్తావు. మనం పరిశుద్ధ గ్రంధములో అలా ఓటమి పాలైనా మొక్కవోని విశ్వాసంతో తిరిగి రెట్టింపు, ఏడంతలుగా ఇంకా ఎన్నో రెట్లు ఆశీర్వదించబడిన వారిని మనం చూస్తాము. యాకోబు జీవితంలో పెనూయేలు సంఘటన తరువాతే తను ఇశ్రాయేలుగా మారి దేవునిచే దీవించబడ్డాడు. యోబు సర్వస్వం కోల్పోయినా దేవుని చేతిని విడువక మరింతగా ఆశీర్వదించబడ్డాడు.

ప్రియ మిత్రులారా!

ఈ రోజు నువ్వూ నేనూ ఓటమి అంచుల్లో ఉండిఉండవచ్చు, చావే శరణ్యం అని నీ పరిస్థితులు అనిపించవచ్చు, ఒక్కసారి యేసయ్య వైపు చూడు..

నీ ఓటమి విజయం వైపు పయనిస్తుంది,

నీవున్న చోటనే గొప్పగా అశీర్వదించబడతావు..

అమేన్.

Subscribe: HOPE Nireekshana TV YouTube Channel

Saturday, October 1, 2016

Today Word of God

ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే. 
యెషయా 46:4


And even to your old age I am he; and even to hoar hairs will I carry you: I have made, and I will bear; even I will carry, and will deliver you.

Isaiah:46:4

Subscribe: 
HOPE Nireekshana YouTube Channel
Stay Blessed...
Amen.