October 08, 2016

యేసయ్య మన ప్రార్ధన ఆలకించియున్నాడు!!! 
తడు దూత వైపు తేరి చూచి భయపడి - ప్రభువా, యేమని అడిగెను. అందుకు దూత - నీ ప్రార్ధనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అపో.కార్యములు 10:4
నీ అవసరతలో, నీ వ్యాధిబాధలలో, నీ శోధనలో ని స్థితి ఇదైనా  నివ్వు మరువక విడువక యేసయ్యకు ప్రార్ధనలో మొఱ్ఱ పెట్టగలిగితే... మన దేవుడు నీ ప్రార్ధన తప్పక ఆలకిస్తాడు, తగు రీతిలో సహాయం చేస్తాడు.
నమ్ము వానికి సమస్తము సాధ్యమే అంటాడు మన ప్రియా తండ్రి.

ప్రార్ధన ఎంతో శక్తివంతమైనది
ప్రార్ధన ఎంతో ఫలవంతమైనది
ప్రార్ధన దేవునికి ఇష్టమైనది
ప్రార్ధన దేవునికి నీకు మద్య వారధిగా మారుతుంది
నిరంతరం మనం ప్రార్ధనలో ఉంటూ మన పిల్లల్ని కూడా ప్రార్ధనలో నడిపించాలి
మనం చేసే ప్రార్ధన మన పిల్లలు గమనించేలా శ్రద్ద తీసుకోవాలి
మన ప్రార్ధన వారు ఆలకించాలి
తద్వారా వారుకూడా నిరంతరం దేవుని మహిమ పరుస్తూ.. స్తుతిస్తూ ఆయనకు దగ్గర అయ్యేలా ప్రయత్నించాలి,
నీవు నేనే కాదు మన కుటుంబం సమస్తం ఆయన పాదాలచెంత మోకరిల్లి ప్రార్ధించాలి
నమ్మికయుంచి ప్రార్ధించగలిగితే మన ప్రార్ధన యేసయ్య ఆలకిస్తాడు
మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు
నీ నా సమస్తమైన అవసరాలు గుర్తెరిగిన ఆ ప్రభువు మనం కోరుకున్నవి అందించడానికి ఆయన నిరంతరం సిద్ధంగానే ఉంటాడు, అందుకోవడానికి మనమే సిద్దపడగలగాలి.
త్వరపడదాం ప్రియులారా....
విశ్వాసంతో మోకరిల్లి తండ్రి ప్రియకుమారులు కుమార్తెలుగా ఆయన చెంత చేరదాం.
ఆమేన్.
watch and subscribe: HOPE NIreekshana TV  YouTube Channel. 

No comments:

Post a Comment

If you have any doubts, please let me know