November 28, 2016

తళుకు తళుకున మెరిసెను నక్షత్రం | తెలుగు | New Christian Song | 2016 | HO...

Latest Telugu Christian Song
ళుకు తళుకున మెరిసెను నక్షత్రం అను ఈ పాట 'హ్యాపీ క్రిస్మస్ అను నూతన అల్బం లోనిది. బ్రదర్ స్యాంసన్ మరియు బ్రదర్ స్టాలిన్ గార్లు Suryapet జిల్లాలోని మామిళ్ళగూడెం నందు JCGM Jesus Christ Glory Temple ప్రార్ధనా మందిరాన్ని దేవునికృపచే అధ్భుతకరంగా నడిపిస్తూ దేవుడు వారికి ఇచ్చిన తలంపులను బట్టి దేవుని గీతాలును స్వయంగా రాస్తూ వర్ధమాన సంగీత దర్శకులు మరియూ గాయనీ గాయకుల ద్వారా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి దేవుని మహిమార్ధమై రూపొందిస్తున్నారు. వారు విడుదల చేసిన ఆల్బంలు అన్నీ కూడా సంగీత సాహిత్య విలువలు కలిగి వాక్యానుసారం రూపొందించబడినవి,


మన చానెల్ లో వీరి పాటలు ఇప్పటికే కొన్ని చేర్చియున్నాము, దేవుని చిత్తాన్ని బట్టి మరికొన్ని పాటలు మీకొరకు త్వరలో చేరుస్తాము. సాంసన్ మరియు స్టాలిన్ గార్ల గురించి, వారి పరిచర్యను గురించి మీ అనుదిన ప్రార్ధనల్లో ప్రార్ధించండి. మా కొరకు కూడా ప్రార్ధించగలరు. వీరి పాటల CD లు కావలసినవారు mobile no. 95055 80269 ను సంప్రదించగలరు.
Subscribe HOPE Nireekshana TV YouTube Channel

November 24, 2016

Unshakable Things

Unshakable Things and Eternal Rewards in Bible

Unshakable things are the things that are eternal, and the things upon which you can build your faith, your life, and your future upon. They are the things that cannot be moved, toppled, changed or destroyed by people, cultures, or governments, Rejoice today if you are one who is building your life upon the unshakable things that last forever and bring an eternal reward.  



Here is what is unshakable and who is unshakable.. we are mentioned the things and persons from the Holy Bible.


Subscribe HOPE Nireekshana TV YouTube Channel 


November 21, 2016

శాపాలు ఆశీర్వాదాలుగా | తెలుగు | Bro.Pradeep Kumar | Jesus Miracles | HOP...

శాపం ఆశీర్వాదమై.. దుఃఖం సంతోషమై... కన్నీరు చిరునవ్వై....

నం తెలిసో తెలియకో పాపాలు చేసి ఉండొచ్చు, అవి శాపాలై మనల్ని వెంటాడుతుంటే ఏమి చేయాలో తెలియని అయోమయమైన స్థితిలో ఉండి ఉండవచ్చు. ఆ శాపాలు మనకు, మన వారికి, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళుగా మిగిలిపోతుంటే ఆ పరిస్థితి ఎంత వేదనాభరితంగా ఉంటుందో ఆ స్థితిని అనుభవించిన వారికి తెలుస్తుంది. కొన్ని సందర్భాలలో మారని మన స్థితులను బట్టి దేవుడే మనలను కపెర్నహోము, కొరాజీను, బేత్సయిదా పట్టణాలను ఒకానొక సందర్భంలో శపించినట్లు మనం పరిశుద్ధ గ్రంధంలోని మత్తయి సువార్త 11:21-24 వాక్యాలలో మనం గమనించవచ్చు.









కాబట్టి మనము మన శాపాలను, పాపాలను క్షమియించమని తండ్రిని వేడుకుంటే తప్పక ఆయన మన యొక్క శాపాలను ఆశీర్వాదాలుగా, దుఃఖమును సంతోషంగా, కన్నీటిని ఆనందంగా మార్చి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలవాడు.



subscribe HOPE Nireekshana TV YouTube Channel.

November 17, 2016

మరియ | దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ | తెలుగు | Christian Message | HOPE N...

మరియ

దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ 

నాడు దేవుడు లోక పాప పరిహారర్ధమై ఈ లోకానికి తన తనయుని పంపించుటకై మరియ గర్భాన్ని ఎన్నుకున్నాడు. స్త్రీలలో ఎన్నుకొనబడినదై, దేవునిచే ధన్యురాలుగా కీర్తింపబడిన మరియ చాల చిన్న వయసులోనే సర్వోన్నతుని శక్తి కమ్ముకొనగా ఈ లోకానికి రారాజును, పదివేల మందిలో అతి సుందరుడునూ ఐన యేసయ్యకు జన్మ నిచ్చింది. ఎన్నో బాధలనూ, శ్రమలనూ, పురిటినొప్పులనూ, ఓర్చుకొని తన గర్భంలో ఉన్న దేవుని బిడ్డను నవమాసాలు మోసి బెత్లెహేములోని ఓ పశువుల పాకలో లోకరక్షకునికి జన్మను ఇచ్చింది. అపురూపంగా పెంచుకున్న తన బిడ్డ, ఏ పాపం ఎరుగని తన ముద్దుల కొడుకు సకలమానవాళి కోసం పాపపరిహారర్ధ బలిగా దేహమంతా రక్తసిక్తమై, గాయాలమయమై సిలువమ్రానుపై మరణించగా ఆ తల్లి మనసు తల్లడిల్లి సొమ్మసిల్లిపోయి ఉంటుంది. యేసు మూడవరోజు తిరిగిలేచాక తనుకూడా యేసు శిష్యులతో కలిసి మేడగదిలో చేరి దేవుని ప్రార్ధించింది. మనము కూడా మరియ వలే మన పిల్లల యెడల మిక్కిలి ప్రేమగలిగి యేసయ్యను, దేవుని ప్రేమను తెలుసుకుని జీవించేలా పెంచగలిగాలి.





మరియ లోని గొప్పతనం, దేవుని యెడల నమ్మకం, విశ్వాసం, యెంతటి కటిన స్థితిని ఐనా ఆ దేవుని కొరకు భరించే గొప్ప గుణాలు కలిగి ఉండాలి. అలా మనల్ని మనం తయరుచేసుకోవాలి, అలాంటి జీవితాన్ని, మనసును, సిద్దపాటుని దయచేయమని దేవాదిదేవుణ్ణి ప్రార్ధిద్దాము. అమేన్.



Subscribe HOPE Nireekshana TV YouTube Channel

November 14, 2016

ఓటమిలో విశ్వాసంతో... | తెలుగు | Bro.Pradeep Kumar | Jesus Miracles | HOP...

ఒటమిలో విశ్వాసంతో..

నం మనుషులం, లోకంలో జీవిస్తున్నం, కాబట్టి ఈ లోక సంబంధమైన విషయాల్లో సాతాను ప్రేరణను బట్టి పడిపోతుంటాం, లేస్తుంటాం. మనం నడుస్తున్న నీతి మార్గాన్ని బట్టి, అనుసరిస్తున్న విధానాలను బట్టి, మనలో ఉన్న నమ్మకాన్ని బట్టి పడిపోయినా లేస్తుంటాం.. మన ప్రేమగల తండ్రి మనల్ని తప్పక ఆదరిస్తాడు, చేరదీస్తాడు. సాతాను శోదనల్లో పడినప్పటికీ అది తాత్కాలికమైన శోధన అని గ్రహించాలి, దానినుండి బయటపడటానికి, ఎదిరించి నిలబడి పోరాడే శక్తిని మాత్రం మనకు ఇవ్వమని మన తండ్రిని అడగాలి. మనం ఆయనవైపు చూడగలిగితే చాలు...నీకు కావాల్సిన శక్తిని దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు, నిన్ను ఈ లోకాశల నుండి విడిపించి.. సాతానుపై గెలిపించి నిలబెడతాడు. ఆమేన్.







Share and Subscribe HOPE Nireekshana TV YouTube Channel.

God bless You abundantly. Amen.

November 10, 2016

జోలాలి జోలాలి నా యేసయ్యా! | తెలుగు | Christian Song | 2016 | HOPE Nireek...

'జోలాలి జోలాలి నా యేసయ్యా'
Telugu Christian Song

పాట 'హ్యాపీ క్రిస్మశ్ అను నూతన అల్బం లోనిది. బ్రదర్ స్యాంసన్ మరియు బ్రదర్ స్టాలిన్ గార్లు నల్గొండకు జిల్లాలోని మామిళ్ళగూడెం నందు JCGM Jesus Christ Glory Temple ప్రార్ధనా మందిరాన్ని దేవునికృపచే అధ్భుతకరంగా నడిపిస్తూ దేవుడు వారికి ఇచ్చిన తలంపులను బట్టి దేవుని గీతాలును స్వయంగా రాస్తూ వర్ధమాన సంగీత దర్శకులు మరియూ గాయనీ గాయకుల ద్వారా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి దేవుని మహిమార్ధమై రూపొందిస్తున్నారు. వారు విడుదల చేసిన ఆల్బంలు అన్నీ కూడా సంగీత సాహిత్య విలువలు కలిగి వాక్యానుసారం రూపొందించబడినవి,



మన చానెల్ లో వీరి పాటలు ఇప్పటికే కొన్ని చేర్చియున్నాము, దేవుని చిత్తాన్ని బట్టి మరికొన్ని పాటలు మీకొరకు త్వరలో చేరుస్తాము. సాంసన్ మరియు స్టాలిన్ గార్ల గురించి, వారి పరిచర్యను గురించి మీ అనుదిన ప్రార్ధనల్లో ప్రార్ధించండి. మా కొరకు కూడా ప్రార్ధించగలరు.
వీరి పాటల CD లు కావలసినవారు మమ్మల్ని కానీ లేదా 9505580269 ను సంప్రదించగలరు.
Subscribe HOPE Nireekshana TV YouTube Channel

November 07, 2016

దేవునిలో నుండి జారిపోతున్నవా?
నం ఎంతటి పాపులమైనా.. ఎటువంటి పాపకరమైన జీవితంలో ఉన్నా దేవాదిదేవుడు తప్పక దరిచేర్చుకుంటాడు. నిన్ను దూరంగా ఉంచువాడు కాదు
తండ్రి, తప్ప్పిపోయిన కుమారుని కొరకు తండ్రి ఎదురుచూస్తాడే కానీ మరచిపోయి జీవించడు. కాపరి తన గొర్రెలమందలో ఒక గొర్రె తప్పిపోతే మిగిలని గొర్రెలను వదిలి తప్పిపోయిన గొర్రె గురించి వెదికి తిరిగి తన మందలోకి ఆహ్వానిస్తాడు. కాబట్టి సాతాను చీకటి ఆలోచనలకు, వాడు చేసే మాయలలో పడిపోకుండా నీవు నీ తండ్రి ఇంటికి తిరిగి రా. మన తండ్రి మహోన్నతుడు, సర్వాధికారి, దయామయుడు. నీవు తనని మరచిపోయినా.. నిన్ను మరువడు.. విడువడు... కాబట్టి నీకు నీవుగా దేవుని విడనాడకు. ఎంతటి వేదనాకరమైన స్థితిలో అయినా తన చేయి విడువకు, ప్రార్ధించడం మరువకు.

ఎందుకంటే తను నీ కొరకు ఉన్న స్థితికంటే గొప్పగా ఆశీర్వదించ తలచాడేమో.. అందుకే నీవు చేయు పనిలో ఆటంకాలు వస్తూ ముందుకు పోలేక పోయి ఉండవచ్చు, కాబట్టి ఆయన ప్రేమను ఎరిగి ఆయన నుండి దూరంగా వెళ్ళకు, సాతాను గాడి మాయలో పడి జారిపోకు. ఆమేన్.

Subscribe HOPE Nireekshana TV YouTube Channel
దేవునిలో నుండి జారిపోతున్నవా?
నం ఎంతటి పాపులమైనా.. ఎటువంటి పాపకరమైన జీవితంలో ఉన్నా దేవాదిదేవుడు తప్పక దరిచేర్చుకుంటాడు. నిన్ను దూరంగా ఉంచువాడు కాదు
తండ్రి, తప్ప్పిపోయిన కుమారుని కొరకు తండ్రి ఎదురుచూస్తాడే కానీ మరచిపోయి జీవించడు. కాపరి తన గొర్రెలమందలో ఒక గొర్రె తప్పిపోతే మిగిలని గొర్రెలను వదిలి తప్పిపోయిన గొర్రె గురించి వెదికి తిరిగి తన మందలోకి ఆహ్వానిస్తాడు. కాబట్టి సాతాను చీకటి ఆలోచనలకు, వాడు చేసే మాయలలో పడిపోకుండా నీవు నీ తండ్రి ఇంటికి తిరిగి రా. మన తండ్రి మహోన్నతుడు, సర్వాధికారి, దయామయుడు. నీవు తనని మరచిపోయినా.. నిన్ను మరువడు.. విడువడు... కాబట్టి నీకు నీవుగా దేవుని విడనాడకు. ఎంతటి వేదనాకరమైన స్థితిలో అయినా తన చేయి విడువకు, ప్రార్ధించడం మరువకు.

ఎందుకంటే తను నీ కొరకు ఉన్న స్థితికంటే గొప్పగా ఆశీర్వదించ తలచాడేమో.. అందుకే నీవు చేయు పనిలో ఆటంకాలు వస్తూ ముందుకు పోలేక పోయి ఉండవచ్చు, కాబట్టి ఆయన ప్రేమను ఎరిగి ఆయన నుండి దూరంగా వెళ్ళకు, సాతాను గాడి మాయలో పడి జారిపోకు. ఆమేన్.

Subscribe HOPE Nireekshana TV YouTube Channel

November 03, 2016

ప్రార్ధించు | తెలుగు | With Scriptures | 2016 | HOPE Nireekshana TV

ప్రార్ధించు

న పరిశుద్ధగ్రంధంలో ఎంతో మంది ప్రార్ధన ద్వారా దేవునితో నేరుగా మాట్లాడారు, దేవుని అరాధించారు, ఘనపరిచారు, స్తుతించారు, ఆపదలను, ఇబ్బందులను, కష్టాలను అవరోధాలను అధిరోహించారు. మనలో ప్రార్ధించాలని ఆశ ఉంటుంది, ఎలా ప్రార్ధించాలో, ఎన్నిసార్లు ప్రార్ధించాలో, ఏమని ప్రార్ధించాలో అనే సందేహాలతో ఉంటారు. అందరికీ ఉపయోగపడేలా అర్ధమయ్యేలా.. బైబిల్ లో ఎవరు ఏలాగున ప్రార్ధించి తండ్రిని ఘనపరిచారో కొన్ని ఉదాహరణలతో వాక్యానుసారంగా అందించాము. ఇది మీకు తప్పక ఉపయోగకరంగా.. దేవునికి మహిమార్ధంగా ఉంటుందని తలంచుచున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పక మీ మిత్రులకు share చెయ్యగలరు, తద్వారా దేవుని వాక్యము పదిమందికి పంచినవారము కాగలము.







ఆ లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.



Subscribe HOPE Nireekshana TV YouTube Channel

November 02, 2016

A hope that Jesus will Change My Situation.
And we know that God causes all things to work together for good to those who love God, to those who are called according to His purpose. Romans 8:28: 
Sometimes I just don’t learn from what God is doing around me. I can see the miracles happen but still not apply God’s power into certain situations in my own life.
God never changes. His power is always available. He is here to heal. He is here to provide. He is here to comfort and here to meet every need. I don’t need to fear when the extraordinary happens because I have a God who is in control even when everything appears out of control.
He is God. He isn’t some figment of my imagination. God, the eternal Spirit, changes the physical circumstances in my life. He stills the raging storms of internal conflict. He heals the incurable disease when all hope is lost.
God should be so real and evident in my life that people should be running around the whole district declaring the power of the Holy Spirit to heal and change their circumstances


Prayer

For surely, O Lord, you bless the righteous. I, therefore, declare that I am blessed through Jesus Christ. Thank You for surrounding me with Your favour as with a shield. I thank You, Lord, that I can abound in your favour and blessing today. I, therefore, expect Your favour to go before me today. I thank You Heavenly Father for opening doors for me that neither man nor the devil can shut. Thank You for blessing the works of my hands as I walk under an open heaven. May I experience your supernatural increase and provision in every area of my life this day. I choose to walk in faith and in victory.
In Jesus’ name I pray.
Amen
Prayer Changed your day from being dull to brightness. Glory to God.