July 16, 2018

ఆత్మహత్యలు పరిష్కారం కానేకాదు - Dr Ajay Kishore - Christ Piligrim Center...

నీ సమస్యకి చావే ముగింపా...?
ఆత్మహత్యే పరిష్కారమా....?
కానేకాదు!
యేసు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు!!


ఈ రోజు ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ఆత్మహత్యల వార్తలే...
మనిషి రోజురోజుకు మానసికంగా బలహీనపడుతూ.. ఒంటరివాడుగా మిగిలిపోతున్నాడు, ఓంటరిగానే తన కధను అర్ధంతరంగా ముగించుకుంటున్నారు. నిరంతరం మన సెల్ ఫోన్స్ లో ఈ ఆత్మహత్యల వీడియోలే వైరల్ అవుతూ చావుని చాలా సులభతర పరిష్కార మార్గాలుగా అందర్నీ తప్పుత్రోవ పట్టిస్తున్నాయి.
అసలు సమస్య ఎక్కడ ప్రారంభమౌతుంది, ఎక్కడ ముగిసిపోతుందో తెలియని అయోమయంలో బ్రతికేస్తున్నాము,
ముందూ వెనుకా ఏ మాత్రమూ ఆలోచించక సమస్యలకి చావడం ఒక్కటే సులభతర పరిష్కార మార్గంగా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ చీకటి ఆలోచనలకు బలౌవుతున్నారు. మార్కులు తక్కువ వచ్చినా, అప్పుతీసుకుని సమయానికి వడ్డీ డబ్బులు కట్టలేకున్నా, ప్రేమలో విఫలమైనా, ఆర్ధిక సమస్యలైనా.. విషయం ఏదైనా.. వయసుతో సంబందం లేకుండా బలవంతపు మరణన్ని ఆశ్రయిస్తున్నారు.
తామే లెకుంటే తమ పిల్లల జీవితాలు ఏమి బాగుపడతాయిలే అని వారిని కూడా తమతోపాటు మరణానికి గురిచేస్తున్నారు. ఎంత దారుణం,
ఆలోచించాలి, ఈ జీవితం నీవు సంపాదించుకున్నది కాదు, నీ జీవితంపై నీకేలాంటి హక్కూ లేదు, భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని నాశనం చేయడానికి నిజంగా మనకేం హక్కు ఉంది.
బ్రదర్ అజయ్ కిషోర్ గారు ఎంతో వేదనతో, బహుబారమైన మనసుతో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ రోజు ఈ వాక్యం మీకందిస్తున్నారు, తప్పనిసరిగా ఇది దేవుని ప్రణాళిక, ఈ మెస్సేజ్ ద్వారా ఏ ఒక్కరికి ఉపకారం జరిగినా మా ప్రయాస దేవుని పట్ల నెరవేరినట్లే. ఆమేన్.




No comments:

Post a Comment

If you have any doubts, please let me know