Showing posts with label church. Show all posts
Showing posts with label church. Show all posts

July 23, 2018

కష్టాలు కన్నీళ్ళూ శాశ్వతం కాదు..అవి రేపటి మీ సాక్షాలుగా మారబోతున్నాయి - ...

కష్టాలు కన్నీళ్ళూ శాశ్వతం కాదు.. అవి రేపటి మీ సాక్షాలుగా మారబోతున్నాయి !
Dr Ajay Kishore Wonderful and inspirational messages on suicides messages, helleluya pentecost ministries kadapa,


మన జీవితాలలో కష్టాలు కన్నీళ్ళు తప్పవు, శోధనలూ వేదనలూ తప్పవు. ఈ రోజు మనం అనుభవించే ఈ కష్టాలన్ని తప్పక రేపు మనకు మంచి సాక్షాలుగా మారుతాయి, రెండంతల ఆశీర్వాదాలు మనము పొందుకుంటాము. కష్టలు లేనిదెవరికి, అనుభవించనివారు ఎవరు. ఎక్కడో చదివాను... అరికాళ్ళు తడవకుండా సంద్రాన్ని దాటవచ్చట... కానీ కన్నీటిని విడువకుండా ఏ మనిషి జీవితాన్ని దాటలేడట. ఎంత కఠోర సత్యం. దేవుని కుమారుడైన యేసయ్య కూడా సాతాను శొషనలు భరించాల్సి వచ్చింది, శిలువయాగంలో మరెన్నో వేధనలు అనుభవించాల్సి వచ్చింది. యోబు గారు అన్నట్లూ.. నాకెన్ని కష్టాలు ఎదురైనా భరిచగలను తండ్రీ, నాచేతిని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ విడువకు అని ప్రార్ధిస్తాడు. మనమూ తండ్రిని అలాగే ప్రార్ధించుదాం. రేపటి సాక్ష్యంగా ప్రభువులో నిలుద్దాం. ఆమేన్.

ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.

July 01, 2018

క్రీస్తు పునరుత్థానానికి వారంతా సాక్షులయ్యారు! మరి నీవు సాక్షిగా ఉన్నావ...

క్రీస్తు పునరుత్థానానికి వారంతా సాక్షులయ్యారు!
మరి నీవు సాక్షిగా ఉన్నావా?

Rev Guduri Ravikumar Messages, Martin Memorial Baptist Church, Ongole.
బ్రదర్ గూడూరి రవికుమార్ ఒంగోలు పట్టణంలో మార్టిన్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ సంఘమును నడిపిస్తూ దేశంలోని పలు నగరాలలో దేవుని సువార్తను ప్రకటిస్తూ యేసయ్య మహాకృపద్వారా ని ఆత్మల సంరక్షణ విషయంలో తనవంతు భాధ్యతను
నిర్వహిస్తున్నాడు. బాప్టిస్ట్ హోం పేరిట అనాధ బాలల శరణాలయాన్ని నిడిపిస్తున్నాడు. వీరికొరకు మన అనుదిన ప్రార్ధనలో ప్రభువుని వేడుకుందాం. అమేన్.
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.


March 24, 2018

Seven Words on the Cross - యేసు సిలువలో నాదేవా నన్నెందుకు చేయి విడిచావన్...

ఏలి ఏలి లామా సబక్తానీ
క్రీస్తు సిలువలో పలికిన నాల్గవమాట
యేసు సిలువలో నాదేవా నన్నెందుకు చేయి విడిచావని అన్నాడు?
Fourth Word on the Cross (Seven Words on the Cross)


March 21, 2018

క్రీస్తు శిలువ మరణం - ఒకే రోజు ముఖ్యమైన 33 ప్రవచనాల నెరవేర్పు - Verses -...

క్రీస్తు శిలువ మరణం

ఒకే రోజు ముఖ్యమైన 33 ప్రవచనాల నెరవేర్పు
క్రీస్తు శిలువ మరణం పొందిన శుక్రవారం నాడు ఒకే రోజు ముఖ్యమైన ప్రవచనాలు 33 నెరవేరబడినట్లు మనం పరిశుద్ధ గ్రంధంలో చూడవచ్చు. ఆ వాక్యాలను చదువుతుంటే దేవునికి మనయెడల ఎంతటిప్రేమ ఉందో మనకొరకు తన ప్రియ కుమారుణ్ణి మానవమాత్రునిలా ఈ లోకానికి పంపడానికి, సాధారణ మనిషిలా జీవించడానికి, చివరికి అతి భయంకరమైన హింసలకు గురయ్యి మనందరి పాపాల కొరకు తనపుత్రుణ్ణి శిలువకు అప్పచెప్పిన ఆ తండ్రికి మన యెడల ఎంతటి ప్రేమ వాత్సల్యతలు ఉన్నాయో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఆయన ప్రణాళిక ప్రకారమే ప్రవక్తలు తమ గ్రంధాల్లో ఎన్నో ప్రవచనాలు కొన్ని వందల సంవత్సరాల తరువాత జన్మించబోయే కరుణమయుని గురించి తమ లేఖనాల్లో పేర్కొన్నారు. ఆ ప్రవచనాలు, వాటి నెరవేర్పు వచనాలు మనం చదువుతున్నా, వింటూఉన్నా ఎంతో ఆశ్చర్యం, ఆనందం అంతేకాక మనయెడల మనతండ్రికి గల ప్రేమ మనకు అర్ధం అవుతుంది. ఈ రోజు ఆ క్రీస్తు శిలువ మరణానికి సంబందించిన ప్రవచనాలు, ఆ ప్రవచనాలన్ని ఒకే రోజు నెరవేర్పు జరగడం గురించి తెలుసుకుందాం. ఈ అమూల్యమైన వచనాల్ని మీరే కాక మరొ 10 మందికి share చేసి తండ్రి సువార్తను సర్వలోకానికి చాటండి. ఆమేన్.


శుక్రవారంరోజు యేసును బంధించి విచారించడం - ప్రవచనాలు - నెరవేర్పు వచనాలు |...

శుక్రవారంరోజు యేసును బంధించి విచారించడం

ప్రవచనాలు - నెరవేర్పు వచనాలు

March 10, 2018

యెరూషలేమును చూచి యేసు ఎందుకు రోధించాడు ??? Good Friday Special - Vocal -...

యెరూషలేమును చూచి యేసు ఎందుకు రోధించాడు ???
ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి - నీవును ఈ నీ దినమందైననూ సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు, గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగుచేయబడియున్నవి. లూకా సువార్త
19:41-42

Watch and subscribe

February 11, 2018

స్నేహమే నా జీవితం | Happy Friendship Day | Telugu | 2016 | HOPE Nireeksh...

❄❄❄ స్నేహమే నా జీవితం ❄❄❄
Happy Friendship Day
అందరికీ స్నేహితులు ఉంటారు... వారు మంచివారా చెడ్డవారా అనేది మనచుట్టూ ఉన్న సమాజమే నిర్ణయించాలి. మంచి స్నేహం బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తే చెడు స్నేహం అధపాతాళానికి తీసుకెళుతుంది. అందుకే స్నేహం విషయంలో మిత్రుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి... లేదంటే జీవితకాలం నష్టపోతాం. అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు వీరందరు ఆ దేవుడు ఏర్పాటు చేసిన వారు..ఇందులో ఎంపిక ఉండదు, కానీ.. ఫ్రెండ్స్ ను మాత్రం మనమే సంపాదించుకోవాలి. ఈ వీడియో లో మంచి స్నేహం గురించి మంచి స్నేహితాల గురించి అలాగే చెడ్డ మిత్రులను వదిలివేయడం ఎంత ముఖ్యమో కూడా చెప్పడానికి ప్రయత్నించాం. మీకు నచ్చుతుందని, మంచి భవిష్యత్తుకు నిచ్చెన మెట్లవంటి గొప్ప మిత్రులను ఎంచుకుని లైఫ్ ను ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాము. మీకు ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి share చేయడం మరువకండి.


February 06, 2018

ఏడు మాటలు | Seven Words on the Cross | తెలుగు | HOPE Nireekshana TV

❄❄❄ ఏడు మాటలు ❄❄❄

యేసు శిలువలో పలికిన ఏడు మాటలు 

ఆనాడు కల్వరి సిలువలో యేసు క్రీస్తు పలికిన ఏడు మాటలను మనం సూక్ష్మం గా పరిశిలించగలిగితే క్రీస్తుకు మనయందు గల ప్రేమ, భాధ్యత, శిలువ మరణం లోని అంతరార్ధం, యేసు మరణంలో నుండి మనకు లభించిన రక్షణ ఇంకా అందులో మనం గ్రహించవలసినవి.. ఆచరించవలసినవి..చాలానే ఉన్నాయి. దేవుని మహా కృపవలన వాటిలో కొన్నింటినైనా ఈ రోజు మనం ధ్యానించడం మనకు లభించిన గొప్ప ఆత్మీయ అదృష్టం.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

January 03, 2018

Anointing Eagle | Motivational Bible Verses | 2016 | HOPE Nireekshana TV

❄❄❄ Anointing Eagle - Motivational Bible Verses ❄❄❄
But those who wait on the Lord
Shall renew their strength;
They shall mount up with wings like eagles,
They shall run and not be weary,
They shall walk and not faint. Isaiah
40:31
this video belongs to explanation of the Eagles nature and qualities, behavior and features. In Bible several times described about eagle and their strong attitude.
Here we are giving some qualities of the eagle and we have to learn and change our attitudes, behavior and thinking.
ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.
మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.


Subscribe Us...

December 20, 2017

క్రీస్తు పుట్టుక సందేశం - Christmas Special Stories - Bro.Koteswara Rao ...

❄❄❄ క్రీస్తు పుట్టుక సందేశం ❄❄❄

Christmas Special Stories

Voice Over : Bro.Koteswara Rao Mekala

క్రీస్తు జన్మించి ఇప్పటికి సుమారు 2017 సంవత్సరాలు అయ్యింది. కానీ యేసయ్య జన్మించడానికి రెండేళ్ళు ముందే తూర్పు దేశపు జ్ఞానులు లోకరక్షకుడు ఈ లోకాన జన్మిస్తాడని జొరాస్టీయన్ వారి మత గ్రంధం ద్వారా గ్రహించారు. రక్షకుడు పుట్టిన గుర్తుగా ఓ నక్షత్రం ఆకాశాన తళుక్కుమంటూ మెరుస్తుందని ఆ గ్రంధం ద్వారా తెలుసుకున్న ఆ జ్ఞానులు గొప్ప వెలుగుతో ప్రకాశవంతంగా కనిపించిన ఆ నక్షత్రపు వెలుగును గమనించి దాని వెలుగును బట్టి అనుసరించి జెరూసలేము నగరానికి వెళ్ళి హేరోదు మహరాజును కలుస్తారు. ఈ విధంగా యేసు జన్మించక మునుపే ఆ జ్ఞానులు ఆయనను వెదుక్కుంటూ కొన్ని వందల మైళ్ళ దూరాన్ని లెక్క చేయక దారిలో సంభవించే ప్రమాదాలు ఖాతరు చేయక వెళ్ళి లోకరక్షకుని దర్శించారు, గొప్ప బహుమతులను తండ్రికి అర్పించి ప్రణమిల్లారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మనకు రక్షణను అందించడానికి. ఆయన పరమును వీడి మనచెంతకు వచ్చిమరీ రక్షణభాగ్యాన్ని అందిస్తే మనం మాత్రం కేవలం నామకార్ధ క్రైస్తవులుగా జీవిస్తున్నాము. ఆయన చెంతకు చేరలేకపోతున్నాము. ఇది ఎంతటి బాధాకరమైన విషయం, గ్రహించండి సోదరులారా.. లోకం శాశ్వతం కాదు, తండ్రి పరలోక రాజ్యం మనకు శాశ్వతం. ఈ క్రిస్మస్ రోజుల్లో జ్ఞానుల్లా మనం మనలో మన తండ్రిని వెదుకుందాం, గొర్రెల కాపరుల్లా లోకానికి యేసు సువార్తను చాటుదాం. కొన్ని ఆత్మలనైనా రక్షించుదాం. ఆమేన్.

October 20, 2017

నీ బిడ్డల భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది..! | Bro Ravikumar Messages, Ong...

❄❄❄ నీ బిడ్డల కొరకు నీవేం చేస్తున్నావు? ❄❄❄

❄❄❄ నీ బిడ్డల భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది..!  ❄❄❄

What is your responsibility on your children ??

Bro Guduri Ravikumar, Martin Memorial Baptist Church, Ongole.

బ్రదర్ గూడూరి రవికుమార్ ఒంగోలు పట్టణంలో మార్టిన్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ సంఘమును నడిపిస్తూ దేశంలోని పలు నగరాలలో దేవుని సువార్తను ప్రకటిస్తూ యేసయ్య మహాకృపద్వారా ని ఆత్మల సంరక్షణ విషయంలో తనవంతు భాధ్యతను నిర్వహిస్తున్నాడు. బాప్టిస్ట్ హోం పేరిట అనాధ బాలల శరణాలయాన్ని నిడిపిస్తున్నాడు. వీరికొరకు మన అనుదిన ప్రార్ధనలో ప్రభువుని వేడుకుందాం. అమేన్.

October 14, 2017

శ్రమలలో దేవుని కీర్తించుదాం! | తెలుగు | Thanks Giving | HOPE Nireekshana TV

❄❄❄ శ్రమలలో దేవుని కీర్తించుదాం! ❄❄❄

❄❄❄ Thanks Giving ❄❄❄ 

God is our refuge and strength, A very present help in trouble. Psalm 46:1

జీవితమన్నాక శ్రమలు, కష్టాలు సామాన్యమే, బైబిల్ గ్రంధంలో మనం ఎంతో మంది కష్టాలకు శ్రమలకు నోర్చి దేవుని ఆరాధించిన వారేకదా! దానియేలు, షడ్రకు, మెషేకు, అబెద్నగోలు దేవుని కొరకు మరణాన్ని సైతం తృణప్రాయంగా చూసారు. వారికంటే అధిక శ్రమలు మనకు సంభవిస్తున్నాయా? లేదు కదా, మరి యెందుకు ఇంతగా వ్యాకులపడి వేధన చెందడం, ప్రయాసపడి భారం మోసికొని పోవు సమస్తమైన జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని యేసయ్య ఆనాడే చెప్పియున్నాడు, మన శ్రమలలో చింతించక దేవుని కీర్తించడం మనం యెప్పుడైతే ప్రారంభిస్తామో అప్పటినుండి ఆ శ్రమలు వేధనలు శోధనలు తాత్కలికమే అని తెలుసుకుంటాం, మనం పొందబోయే నిత్యజీవం ముందు ఇవన్నీ ఏపాటివి, ఆలోచించాండి, శ్రమలలో తప్పక మరచిపోక దేవుని ప్రార్ధించండి. ఆత్మీయ మేలులు పొందుకోండి. ఆమేన్.



దేవుని సువార్తను పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Watch Our latest Videos..

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

August 30, 2017

నీవెవరో తెలుసుకున్నావా | Bro Praveen message | Dominion Power Center | H...

❄❄❄ నీవెవరో తెలుసుకున్నావా ❄❄❄

Bro. Praveen's Message, Dominion Power Center, Vijayawada. 

Bro.Praveen young man of God and anointed by Holy Spirit and spreading the Gospel through Dominion Power Center, Vijayawada, AP. He was blessed with healing power and powerful gospel ministry. We are praying that so many souls may get salvation and accepting Jesus as their Savior. Amen.



ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos..
యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

August 12, 2017

యాకోబు 12మంది కుమారుల పేర్లు - అందులో యేసు పుట్టుక రహస్యం | Telugu Chris...

❄❄❄ యాకోబు 12మంది కుమారుల పేర్లు  ❄❄❄
❄❄❄ యేసు పుట్టుక రహస్యం ❄❄❄

Jacob 12 Son names and its meaning

ఇస్సాకు కుమారుడైన యాకోబుకు మొత్తం 13 మంది సంతానం కదా! అందులో చివరిసంతానం ఆడపిల్ల కాగా మిగిలిన పన్నెండు మంది పురుష సంతానం. ఆనాడు యాకోబు మగపిల్లలకి పెట్టినపేర్లు బహుశా మనందరికీ తెలిసే ఉంటాయి. లేదా ఆదికాండము 29, 30 ఇంకా 35 అధ్యాయాలలో వీరి పేర్లను మనం చూడవచ్చు. కానీ వారి పేర్ల యొక్క అర్ధాలను తెలుసుకుంటే మాత్రం తప్పక ఆశ్చర్యపోతాము. యాకోబు ఆనాడు యాదృచ్చికంగా తన 12మంది మగపిల్లలకి ఆ యా పేర్లు పెట్టాడు అని భావించలేము. అది ఖచ్చితంగా దేవుని తలంపే. పాతనిబంధనలో ఎంతో మంది ప్రవక్తలు యేసుప్రభుని పుట్టుకను గూర్చి ప్రవచనాలు చెప్పియున్నరు. అదే రీతిలో యాకోబు తన సంతానానికి పెట్టిన పేర్లద్వారా కూడా దేవాదిదేవుడు క్రీస్తుయొక్క రాకడను గూర్చి, ఆయన రాకలోని అంతరార్ధాన్ని గురించి ఈ లోకానికి ముందుగానే సెలవిచ్చియున్నాడు. ప్రతిఒక్కరు ఈ వీడియోని చూసి మీకు నచ్చితే తప్పక మీ మిత్రులకు share చెయ్యగలరు. అమేన్.



ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజ
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.