Showing posts with label special stories. Show all posts
Showing posts with label special stories. Show all posts

December 20, 2017

క్రీస్తు పుట్టుక సందేశం - Christmas Special Stories - Bro.Koteswara Rao ...

❄❄❄ క్రీస్తు పుట్టుక సందేశం ❄❄❄

Christmas Special Stories

Voice Over : Bro.Koteswara Rao Mekala

క్రీస్తు జన్మించి ఇప్పటికి సుమారు 2017 సంవత్సరాలు అయ్యింది. కానీ యేసయ్య జన్మించడానికి రెండేళ్ళు ముందే తూర్పు దేశపు జ్ఞానులు లోకరక్షకుడు ఈ లోకాన జన్మిస్తాడని జొరాస్టీయన్ వారి మత గ్రంధం ద్వారా గ్రహించారు. రక్షకుడు పుట్టిన గుర్తుగా ఓ నక్షత్రం ఆకాశాన తళుక్కుమంటూ మెరుస్తుందని ఆ గ్రంధం ద్వారా తెలుసుకున్న ఆ జ్ఞానులు గొప్ప వెలుగుతో ప్రకాశవంతంగా కనిపించిన ఆ నక్షత్రపు వెలుగును గమనించి దాని వెలుగును బట్టి అనుసరించి జెరూసలేము నగరానికి వెళ్ళి హేరోదు మహరాజును కలుస్తారు. ఈ విధంగా యేసు జన్మించక మునుపే ఆ జ్ఞానులు ఆయనను వెదుక్కుంటూ కొన్ని వందల మైళ్ళ దూరాన్ని లెక్క చేయక దారిలో సంభవించే ప్రమాదాలు ఖాతరు చేయక వెళ్ళి లోకరక్షకుని దర్శించారు, గొప్ప బహుమతులను తండ్రికి అర్పించి ప్రణమిల్లారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మనకు రక్షణను అందించడానికి. ఆయన పరమును వీడి మనచెంతకు వచ్చిమరీ రక్షణభాగ్యాన్ని అందిస్తే మనం మాత్రం కేవలం నామకార్ధ క్రైస్తవులుగా జీవిస్తున్నాము. ఆయన చెంతకు చేరలేకపోతున్నాము. ఇది ఎంతటి బాధాకరమైన విషయం, గ్రహించండి సోదరులారా.. లోకం శాశ్వతం కాదు, తండ్రి పరలోక రాజ్యం మనకు శాశ్వతం. ఈ క్రిస్మస్ రోజుల్లో జ్ఞానుల్లా మనం మనలో మన తండ్రిని వెదుకుందాం, గొర్రెల కాపరుల్లా లోకానికి యేసు సువార్తను చాటుదాం. కొన్ని ఆత్మలనైనా రక్షించుదాం. ఆమేన్.