Showing posts with label mother mary. Show all posts
Showing posts with label mother mary. Show all posts

February 08, 2018

గుణదలమాత మహోత్సవాలు | Documentary - 2017 | Vijayawada | HOPE Nireekshana TV

❄❄❄ గుణదల మాత మహోత్సవాలు - 2017 ❄❄❄
Gunadala Shrine Festival - 2017
ప్రతియేటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గుణదల మాత మహోత్సవాలు ఈ యేడాది కూడా ఘనంగా నిర్వహించారు. లక్షలాది భక్తులు తరలవచ్చి తమ మొక్కుబడులు భక్తి శ్రద్దలలో తీర్చుకున్నారు. పండుగలో మూడవరోజు ఘనంగా నిర్వహించే సమిష్టి దివ్యబలిపూజా కార్యక్రమాన్ని విజయవాడ కతోలికా పీఠాధిపతి ఫాదర్ తెలగతోటి జోసఫ్ రాజారావు గారి నేతృత్వంలో గుంటూరు కతోలికా పీఠాధిపతి ఫాదర్ చిన్నాబత్తిన భాగ్యయ్య గారు నిర్వహించి విచ్చేసిన అసంఖ్యాక భక్తులకు దైవ సందేశాన్ని అందిచారు.
పూజ అనంతరం కతోలికా భక్తులకు దివ్యసత్ప్రసాదాన్ని అందించారు. సుమారు పదిలక్షలకు పైగా భక్తులు వచ్చారని భావిస్తున్నారు


గుణదల రెక్టార్ యేలేటి విలియం జయరాజ్, మోన్సిజ్ఞోర్ ఫాదర్స్ మువ్వల ప్రసాద్, యం.గాబ్రియేల్, కరస్పాండెంట్ ఫాదర్ ఇంటి ఆంతోనీల పర్యవేక్షణలో మూడురోజుల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.

October 21, 2017

మరియనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆమెకున్న అర్హతలేంటి?? మీకు తెలుసా???...

మరియనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? 
ఆమెకున్న అర్హతలేంటి?? మీకు తెలుసా???

మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ,

పరిశుద్ధ గ్రంధంలో ఎవరికీ లభించని గొప్ప స్థానం మరియకు లభించింది, స్త్రీలలో ఆమె ఆశీర్వదించబడినది, దేవునిచే ఎన్నుకోబడినది, దేవుని కృపకు పాత్రురాలు అయ్యింది, ఎంతగా ఆశీర్వదించబడటానికి మరియలో ఉన్న అర్హతలు ఏంటి? పెండ్లికాని స్త్రీ గర్భవతి అయితే వారిపట్ల సమాజం చూసే చిన్న చూపు, కుటుంబ పరువు మర్యాదలు, ఆనాటి యూదుల కఠిన సాంప్రదాయాలు, శిక్షలు... ఇవేవి ఆనాడు మరియ ఆలోచించలేదు, కేవలం పరమతండ్రి అయిన ఆ దేవదేవుని ఆజ్ఞకు బద్దురాలై రాజాధిరాజుకు జన్మనిచ్చింది. తల్లిగా ఆమెలో విభిన్న కోణాలను మనం చూడవచ్చు. సిలువ మ్రానుపై వేలాడుతూ సర్వోన్నతుడు, పదివేలమందిలో అతిసుందరుడు ఐన తన బిడ్డ దేహమంతా గాయాలై, రక్తమోడుతూ చిత్రహింసలు అనుభవించి ప్రాణాలు విడిచినా.. ఆ భయంకరమైన వేధనను మౌనంగా భరించింది.లోక పాప పరిహారార్ధం తన బిడ్డ శిలువ మ్రానుపై మరణవేదన అనుభవిస్తూ కూడా దేవుని ఆజ్ఞకు లోబడి నడుచుకుంది. దేవుని యెడల తన భాద్యతను గుర్తెరిగినదై మేడగదిలో యేసు శిష్యులతో కలిసి దేవుని ప్రార్ధించింది, స్తుతించింది. ఎంత గొప్ప స్త్రీ మరియ, అందుకే దేవుడు ఆమెను ఎన్నుకొన్నది. అందుకే ఆమె అంతగా ఆశీర్వదించబడిన స్త్రీ అయినది. అమేన్.