Showing posts with label christmas stories. Show all posts
Showing posts with label christmas stories. Show all posts

November 22, 2018

తూర్పుదేశపు జ్ఞానులు - Christmas Special Stories - Bro Ravikumar Ongole ...

తూర్పుదేశపు జ్ఞానులు - Wise Men 

Christmas Special Stories - Bro Ravikumar Ongole

తూర్పుదేశపు జ్ఞానులు - వారిని మనం జ్ఞానులని పిలుచుకోవడంలోనే తెలుస్తుంది కదా.. వారెంత మేధావులో, చరిత్రకారుల అభిప్రాయాన్నిబట్టి వారు మేధవులు, జ్ఞానసంపన్నులు, ఉన్నతకుటుంబాలలో జన్మించిన వారు, మరికొంతమంది వీరిని వారి వారి ప్రాంతాల్లో రాజులు అని కూడా అభిప్రాయపడుతున్నారు. అయినా కూడా వారు వారి దేశాలనుండి కొన్ని వేల మైళ్ళ దూరాన్ని, పరిస్థితులను లక్కచేయక కేవలం యేసయ్యను చూడటానికి ప్రయాణమై వచ్చారు. దర్శించుకున్నారు. మనం మాత్రం ఆయన మన ఇంటిగుమ్మం వద్దే నిలిచి తలుపు తడుతున్నా ఆయన పిలుపును పట్టించుకోకుండా తాత్సారం చేస్తున్నాం. ఎంతకాలం ఇలా? యేసయ్య రాకడను ఆహ్వానించడానికి జ్ఞానులవలే సిద్దపడదాము, ఆయనను మనలో నింపుకుని ఆరాదించుదాం, కొత్త జీవతాన్ని ఈ క్రిస్మస్ తో ప్రారంభిద్దాం. ఆమేన్
ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని
subscribe చెయ్యగలరు.

November 08, 2018

అందరిలోకెల్లా భిన్నమైనవాడు - ఎంతో ప్రత్యేకమైనవాడు మన యేసయ్య - Sis.Geetha...

అందరిలోకెల్లా భిన్నమైనవాడు
ఎంతో ప్రత్యేకమైనవాడు మన యేసయ్య

Anchor : Sister Geetha Kiran
Voice Over : Prasanth Nathala
Script & Narration : Dr Vijayalakshmi N
Tech Support : Mahesh & Pratheek
Presented By : HOPE Nireekshana TV

ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.


October 21, 2017

మరియనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆమెకున్న అర్హతలేంటి?? మీకు తెలుసా???...

మరియనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? 
ఆమెకున్న అర్హతలేంటి?? మీకు తెలుసా???

మరియ, దేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ,

పరిశుద్ధ గ్రంధంలో ఎవరికీ లభించని గొప్ప స్థానం మరియకు లభించింది, స్త్రీలలో ఆమె ఆశీర్వదించబడినది, దేవునిచే ఎన్నుకోబడినది, దేవుని కృపకు పాత్రురాలు అయ్యింది, ఎంతగా ఆశీర్వదించబడటానికి మరియలో ఉన్న అర్హతలు ఏంటి? పెండ్లికాని స్త్రీ గర్భవతి అయితే వారిపట్ల సమాజం చూసే చిన్న చూపు, కుటుంబ పరువు మర్యాదలు, ఆనాటి యూదుల కఠిన సాంప్రదాయాలు, శిక్షలు... ఇవేవి ఆనాడు మరియ ఆలోచించలేదు, కేవలం పరమతండ్రి అయిన ఆ దేవదేవుని ఆజ్ఞకు బద్దురాలై రాజాధిరాజుకు జన్మనిచ్చింది. తల్లిగా ఆమెలో విభిన్న కోణాలను మనం చూడవచ్చు. సిలువ మ్రానుపై వేలాడుతూ సర్వోన్నతుడు, పదివేలమందిలో అతిసుందరుడు ఐన తన బిడ్డ దేహమంతా గాయాలై, రక్తమోడుతూ చిత్రహింసలు అనుభవించి ప్రాణాలు విడిచినా.. ఆ భయంకరమైన వేధనను మౌనంగా భరించింది.లోక పాప పరిహారార్ధం తన బిడ్డ శిలువ మ్రానుపై మరణవేదన అనుభవిస్తూ కూడా దేవుని ఆజ్ఞకు లోబడి నడుచుకుంది. దేవుని యెడల తన భాద్యతను గుర్తెరిగినదై మేడగదిలో యేసు శిష్యులతో కలిసి దేవుని ప్రార్ధించింది, స్తుతించింది. ఎంత గొప్ప స్త్రీ మరియ, అందుకే దేవుడు ఆమెను ఎన్నుకొన్నది. అందుకే ఆమె అంతగా ఆశీర్వదించబడిన స్త్రీ అయినది. అమేన్.