Showing posts with label gutenberg bible. Show all posts
Showing posts with label gutenberg bible. Show all posts

February 12, 2018

ఈ బైబిల్ ఖరీదు రూ.200 కోట్లు మాత్రమే! | Gutenberg Bible | Telugu | HOPE ...

❄❄❄ ఈ బైబిల్ ఖరీదు రూ.200 కోట్లు మాత్రమే! | ❄❄❄
Johannes John Gutenberg Bible
most costliest Bible in the World.
జోహన్నెస్ గుటెన్ బర్గ్ బైబిల్


జోహన్నెస్ గుటెన్ బర్గ్ అనే స్వర్ణకారుడు క్రీ.శ.1440 సంవత్సరంలో ప్రింటింగ్ ప్రెస్ మిషన్ ని కనుగొన్నాడు.
ప్రపంచంలో ప్రింటింగ్ మిషన్ ను కనుగొన్న తరువాత ముద్రించబడిన మొట్టమొదటి పుస్తకం బైబిల్.
క్రీ.శ.1450 ప్రాంతంలో సమగ్ర బైబిల్ని ముద్రించడానికి తన ప్రయత్నాలు ప్రారంబించాడు.
సుమారు ఆరు సంవత్సరాలు కష్టపడిన మీదట క్రీ.శ. 1456 లో పూర్తి బైబిల్ ని ముద్రించడం జరిగింది.
ప్రస్తుతం మనకు ప్రపంచంలో 49 బైబిళ్ళు మాత్రమే లభ్యమౌతున్నట్లుగా తెలుస్తుంది.
బైబిల్ ను మొదట లాటిన్ బాషలో 42 లైన్లతో నలుపు ఎరుపు రంగుల్లో సమగ్ర బైబిల్ను ముద్రించారు.
మొత్తం 1286 పేజీలతో రెండు వాల్యూములుగా ఈ బైబిల్ ముద్రితమైంది.
ప్రస్తుతం ప్రపంచంలో అతి విలువైన పుస్తకాలుగా జోహన్నెస్
గుటెన్ బర్గ్ బైబిళ్ళు చెలామణి అవుతున్నాయి.
నేటికీ ఆనాడు జోహన్నెస్ గుటెన్ బర్గ్ బైబిళ్ళకు ప్రపంచ మార్కెట్లో ప్రత్యేకమైన విలువ, విశిష్టత ఉంది. కాబట్టే 1978వ సంవత్సరంలో గుటెన్ బర్గ్ ముద్రించిన బైబిల్ ను వేలం వేయగా 2.2 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే మన రూపాయి విలువను బట్టి 14 కోట్ల రూపాయలు. అదే బైబిల్ నేదు 25 నుండి 35 మిలియన్ డాలర్ల ధర పలుకుతుందని అంచనా. అంటే సుమారు 150 కోట్ల రూపాయలనుండి 200 కోట్ల రూపాయల విలువ పలుకుతుందన్నమాట.


ఆశ్చర్యం అనిపించినా నమ్మవలసిన నిజం ఇది.

Watch and subscribe Our Channel for more videos

September 22, 2017

ఈ బైబిల్ ఖరీదు రూ.200 కోట్లు మాత్రమే! | Gutenberg Bible | Telugu | HOPE ...

ఈ బైబిల్ ఖరీదు రూ.200 కోట్లు మాత్రమే! 

జోహన్నెస్ గూటెన్ బర్గ్ బైబిల్ 

జర్మనీ దేశంలోని మయింజ్ పట్టణానికి చెందిన జోహన్నెస్ గూటెన్ బర్గ్ అనే స్వర్ణకారుడు క్రీ.శ.1440 సంవత్సరంలో ప్రింటింగ్ ప్రెస్ మిషన్ ని కనుగొన్నాడు మిషన్ ని కనుగొన్న మొదట్లో చిన్న చిన్న పాంప్లెట్స్ ప్రింట్ చేసేవాడు. కొన్నాళ్ళకి అతని మనసులో గొప్ప ఆలోచన ప్రారంభమైంది. అది ఏంటంటే పూర్తి బైబిల్ ను ముద్రించి ప్రజలకు బైబిల్ ను అందుబాటులోకి తీసుకురావాలని. అనుకున్నదే తడవుగా జోహన్నెస్ గూటెన్ బర్గ్ తన ఆలోచనని కార్యరూపం దాల్చాడు, రేయనకా పగలనకా అహర్నిశలూ శ్రమించాడు, చివరికీ అనుకున్నది సాధించాడు. అద్భుతమైన రీతిలో బైబిల్ గ్రంధం పూర్తిస్థాయిలో ముద్రితమైంది.

ప్రపంచంలో ప్రింటింగ్ మిషన్ ను కనుగొన్న తరువాత ముద్రించబడిన మొట్టమొదటి పుస్తకం బైబిల్. ప్రపంచం లోనే కాదు మన భారతదేశంలో కూడా మొట్టమొదట ప్రింటింగ్ ఐన గ్రంధం బైబిలే. జోహన్నెస్ గూటెన్ బర్గ్ ప్రింటింగ్ మిషన్ ని కనుగొన్న తరువత క్రీ.శ. 1450 ప్రాంతంలో సమగ్ర బైబిల్ని ముద్రించడానికి తన ప్రయత్నాలు ప్రారంబించాడు. సుమారు ఆరు సంవత్సరాలు కష్టపడిన మీదట క్రీ.శ. 1456 లో పూర్తి బైబిల్ ని ముద్రించడం జరిగింది.

మొదట 180 ప్రతులవరకు ప్రింటింగ్ చేయడం జరిగింది. కాలక్రమంలో వాడుకలో బాగంగా కొన్ని పుస్తకాలు పాడైపోగా ప్రస్తుతం మనకు ప్రపంచంలో 49 బైబిళ్ళు మాత్రమే లభ్యమౌతున్నట్లుగా తెలుస్తుంది.

బైబిల్ ను మొదట లాటిన్ బాషలో 36 లైన్లతో ముద్రించడం ప్రారంభించినా ఆ తరువాత పేపర్ని ఆదా చేయడంలో భాగంగా లైన్లని 40 కి పెంచి మరికొన్ని ప్రతులు ముద్రించారు. చివరికి 42 లైన్లతో నలుపు ఎరుపు రంగుల్లో సమగ్ర బైబిల్ను ముద్రించారు. అందువలనే జోహన్నెస్ గూటెన్ బర్గ్ బైబిల్ ని 42 లైన్ల బైబిల్ అనికూడా అంటారు. మొత్తం 1286 పేజీలతో రెండు వాల్యూములుగా ఈ బైబిల్ ముద్రితమైంది.ప్రస్తుతం ప్రపంచంలో అతి విలువైన పుస్తకాలుగా జోహన్నెస్ గూటెన్ బర్గ్ బైబిళ్ళు చెలామణి అవుతున్నాయి.

ఏది ఏమైనప్పటికీ అప్పట్లో ప్రింటింగ్ మిషన్ కనిపెట్టి ముద్రణా రంగంలో ఆధునిక ప్రింటింగ్ విప్లవాన్ని సృష్టించిన గూటెన్ బర్గ్ బైబిల్ ని ముద్రించి ప్రపంచానికి క్రైస్తవ్యాన్ని,అందులోని ప్రేమను అందించడంలో తనవంతు కృషి చేశాడని మనం భావించవచ్చు. అంతకుముందు యూరోపియన్ ప్రపంచం చూడనటువంటి ఊహించని రీతిలో అధునాతన పద్దతిలో ప్రింట్ అయిన బైబిల్ ప్రతులు విపరీతమైన ఆదరణను పొంది మార్కెట్లోకి వచ్చినవెంటనే అమ్ముడుపోయాయి.

నేటికీ ఆనాడు జోహన్నెస్ గూటెన్ బర్గ్ బైబిళ్ళకు ప్రపంచ మార్కెట్లో ప్రత్యేకమైన విలువ, విశిష్టత ఉంది. కాబట్టే 1978వ సంవత్సరంలో గూటెన్ బర్గ్ ముద్రించిన బైబిల్ ను వేలం వేయగా 2.2 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే మన రూపాయి విలువను బట్టి 14 కోట్ల రూపాయలు. అదే బైబిల్ నేదు 25 నుండి 35 మిలియన్ డాలర్ల ధర పలుకుతుందని అంచనా. అంటే సుమారు 150 కోట్ల రూపాయలనుండి 200 కోట్ల రూపాయల విలువ పలుకుతుందన్నమాట.

ఆశ్చర్యం అనిపించినా నమ్మవలసిన నిజం ఇది.



దేవుని సువార్తను పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Watch Our latest Videos..

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.