Showing posts with label HNTV TELUGU. Show all posts
Showing posts with label HNTV TELUGU. Show all posts

January 25, 2021

మనష్షే మహారాజు (MANASSEH THE SON OF HEZEKIAH)

యూదా దేశాన్ని విజయపథంలో నడిపించి దేవునికి విధేయుడుగా నిలిచిన హిజ్కియా మహారాజు మొదటి కుమారుడు మనష్షే మహారాజు . యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో 14 వ రాజు ఈ మనష్షే మహారాజు. మనష్షే అనే మాటకు మరిచిపోవడం అని అర్థం. ఈయన పరిపాలనదుష్టబుద్ది, దేవుని యెడల అవిధేయత వలన దేవుడే ఈ మనష్షేను తన బిడ్డగ మరిచిపోయెంతగా  దుష్టప్రవర్తన కలిగిన సార్ధకనామధేయుడు. 29 యేళ్ళపాటు యూదాదేశాన్ని పరిపాలించిన హిజ్కియా మరణానంతరం మనష్షే తన పన్నేండవయేటనే రాజుగా సింహసనాన్ని అదిష్టించి 55 సంవత్సరాలు సుదీర్ఘకాలం యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. 

2 రాజుల గ్రంథము 21:1-18 ,                               2 దినవృత్తాంతముల గ్రంథము 32:33

2 దినవృత్తాంతముల గ్రంథము 33:1-20 ,         యిర్మియా గ్రంథము 15:4

         వచనంలలో మనష్షేను గురించిన సమాచారం మనకు లభిస్తుంది. ఇతన్ని యూదా రాజులు అందరిలో కూడా బహు దుర్మార్గుడు అయిన పాలకుడిగా బైబిల్ పండితులు భావిస్తారు. దేవునికి హేయమైన ప్రతిఒక్క కార్యాన్ని ఇతడు చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తాము. ఇతని పాలనలో తండ్రి హిజ్కియా పడగొట్టించిన బయలు దేవత విగ్రహాలను తిరిగి నిర్మించి వాటికి బలిపీఠాలను కట్టాడు. యూదా ప్రజలలో విగ్రహారాధనను ప్రోత్సహించాడు. యెహోవా దేవున్ని కాక , ఆకాశ నక్షత్రాలను పూజించాడు. యెహోవా దేవుని మందిరములో అన్యదేవతల బలిపీఠాలను నిర్మించాడు. చిల్లంగి, సోదేగాండ్రతో సహవాసము చేసి వాటిని ప్రొత్సహించాడు. చివరికి తన బిడ్డలను అగ్నిలోగుండ దాటేయటం వంటి దేవునికి అతి హేయమైన కార్యాలను ఎన్నిటినో చేసాడు. యేరుషలేము ప్రజలు అన్యజనుల కంటే మరింత అక్రమంగా ప్రవర్తించడానికి ఈ మనష్షేనే కారకుడు అయ్యాడు.  తద్వారా సర్వాధికారి అయిన ఆ దేవాదిదేవుని అగ్రహానికి గురయ్యాడు.

తన ప్రజలను తప్పు దారి పట్టిస్తూ తమ పితరులు ఎంతో భక్తితో సేవించి తరించిన దేవాదిదేవుని మరిచిన మనష్షే ఎంతమాత్రం క్షమార్హుడు కాదుకదా. అయినా యెహోవా దేవుడు తన జనుల ద్వార మనష్షేను హెచ్చరిస్తాడు. అతనిలో తగిన మార్పు రానందున దేవుడు అష్హూరు రాజు సైన్యాన్ని వారిమీదకు రప్పిస్తాడు. దేవుని కృపకు దూరమైన  మనష్షే అష్హూరు రాజు సైన్యాన్ని ఎదిరించి నిలబడలేక లొంగిపోవలిసి వస్తుంది. అష్హూరు సైన్యం మనష్షేను గొలుసులతో బంధించి  బబులోను రాజ్యానికి తరలించి చెరసాలలో బందిని చేస్తారు . అప్రతిహాతంగా   పరిపాలిస్తూ అదంతా తన ప్రతిభే అని భ్రమించిన మనష్షే తాను దేవాలయాలు, బలిపీఠాలు  నిర్మించి ఆరాధించిన  ఏఒక్క దేవుడూ తాను ఉన్న ఈ స్థితి నుండి కాపాడి రక్షించలేరని తేలుసుకోవడానికి ఆపై ఎంతో సమయం పట్టలేదు.

అన్యదేవతల విగ్రహాలను నిర్మించడానికి ఏ దేవుని ఆలయాలనైతే పాడుచేసాడో, జీవంలేని బయలును ఆశ్రయిస్తూ ఏ దేవుడినైతే తాను విడిచిపెట్టాడో  ఆ ఒక్క జీవము గల దేవుడే సర్వశక్తిమంతుడని, లోకరక్షకుడని, తానున్న ఈస్థితి నుండి తనను కాపాడి  రక్షించగలవాడని ఆ వేదనకరమైన స్థితిలో మనష్షే గ్రహించగలిగాడు. తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిని మొకాళ్ళు వంచి కన్నీటితో ప్రార్ధించాడు.   అతని ప్రార్ధన అలకించిన కరుణామయుడైన దేవుడు మనష్షేను చరలో నుండి తప్పించటమే కాకుండా తిరిగి తన దేశానికి పంపిస్తాడు. యూదా రాజుగా తన పూర్వవైభవాన్ని పొందుకునేలా చేసాడు. యెహోవా దేవుడే నిజదేవుడని గ్రహించిన మనష్షే తాను నిర్మించిన బయలు విగ్రహాలను, బలిపీఠాలను కూల్చివేసిన తరువాత ,  యెహోవా దేవుని ఆలయంలో యూదా జనాంగం తిరిగి భక్తి శ్రద్ధలతో  బలులు సమర్పించటం ప్రారంభిస్తారు.

ఆ తరువాత మనష్షే మరి కొంతకాలం దేశాన్ని సుభిక్షిణ్ణంగా పరిపాలించి ప్రజల మేప్పును సంపాదించుకున్నాడు. మనష్షే మహారాజు జీవితం మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. నూతన నిబంధనలో యేసయ్య చెప్పిన తప్పిపోయిన కుమారుని ఉపమానంలోని పాత్రలా పాత నిబంధనలోని మనష్షేను కూడా చరిత్రకారులు తప్పిపొయిన కుమారుడిలా అభివర్ణిస్తారు. నిజంగానే తప్పిపొయిన కుమారునిలా కనిపించే మనష్షే జీవితం  మనకందరికి ఒక గుణపాఠంలానే భావించాలి. ఈ మన జీవితం , సుఖసంతోషాలు, అస్థిపాస్థులు, అరోగ్యం అన్ని దేవుడు ఇచ్చినవే అని ఎప్పూడూ గుర్తుంచుకోవాలి. ఎంత ఎదిగిన దేవునికి విధేయులుగా జీవించటం నేర్చుకోవాలి. అప్పుడే ఆ దేవాదిదేవుని అశీస్సులు మనకూ, మన కుటుంబాలకు సదాకాలము తోడైఉండి ముందుకు నడిపిస్తాయి. అట్టి గొప్ప దేవుని కృప మనందరికి సదాకాలము తోడై ఉండాలని నిత్యమూ ప్రార్థించుదాం. అమెన్.

Dear Brothers and Sisters in Christ, If you like this post, kindly comment below the post and do share your response, Thank you for reading, God bless you abundantly, Yours HNTV Telugu Christian Channel

December 04, 2020

                                ఎలా ప్రార్ధించాలి? ( How to Pray ? )

ప్రార్థన (prayer) దేవుడు మనకు ఇచ్చిన బలమైన సాధనం, ప్రార్థించడం ద్వారా మనం మనకు కావలిసినవి పొందుకోవచ్చు,  నిరంతరం దేవునితో మనము బలమైన సంబంధాలు   కలిగి ఉండవచ్చు. మనల్ని మనం గెలుచుకోవచ్చు. కాబట్టి ప్రతిరోజు తప్పకుండా మనం దేవుణ్ణి ప్రార్థించాలి.  క్రైస్తవ జీవితాలలో ప్రార్థనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆనాడు దావీదు మహారాజు క్రమం తప్పకుండా ప్రతిదినం 7 సార్లు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని స్వయంగా చెప్పుకున్నాడు. దానియేలు ప్రవక్త కూడా రోజుకు మూడు సార్లు ప్రార్ధించాడు.

బైబిల్లో ఎంతో మంది ఎడతెగక దేవునికి ప్రార్థన చేసి  తమకు కావలిసినవి పొందుకున్నారు. మనం కూడా ప్రార్థించాలి. మన కొరకు, మన కుటుంబం కొరకు , తోటి సహొదరుల కొరకు, సంఘం కొరకు,  సమస్త మానవాళి కొరకు  ప్రార్థించాలి. దేవుణ్ణి ప్రార్థించే విషయంలొ ఎలా ప్రార్థించాలి, ఎందుకు ప్రార్థించాలి, ఎప్పుడు ప్రార్థించాలి, ఎవరి కొరకు ప్రార్థించాలి అనే సందేహాలు  చాలా వస్తాయి. ఆ సందేహాలకు సమాధానలను ఇప్పుడు తెలుసుకుందాం.

1.         దేనికొరకు ప్రార్థించాలి  ? (Why to Pray)

                      మనం దేవునితో మాట్లాడడం ఆయనకు ఎంతో ఇష్టం. మనం దేనికొరకైనా  సరే  దేవుణ్ణి ప్రార్థించవచ్చు. అది పెద్ద విషయమా, చిన్న విషయమా అన్నది పెద్ద సమస్య కానేకాదు. ప్రార్థించడమే ముఖ్యం. ఆలా ప్రార్థిచడం ద్వారా తండ్రి మన సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు.

2.         ఎప్పుడు,  ఎక్కడ  దేవుణ్ణి ప్రార్థించాలి? ( when and where to Pray )

                   మనం దేవుణ్ణి ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రార్థించవచ్చు.  ఆయన నిత్యం మనలో, మనతొ పాటు ఉండేవాడు కాబట్టి  దేవుని ప్రార్థించటానికి, మన సమస్యలు చెప్పుకోవడానికి ఒక ప్రత్యేక సమయం అంటూ ఏమి లేదు. మనం ఎక్కడ ఉన్నా పర్లేదు దేవునితో చక్కగా మాట్లాడవచ్చు.  మన సమస్యలని ప్రార్థన ద్వారా విన్నవించుకోవచ్చు. 

3.         ప్రార్థన ఎంత సేపట్లొ ముగించాలి ? ( How much time to Pray )

                   మనం దేవునితో ప్రార్థనలో ఏకిభవించి మట్లాడడమే చాలా ముఖ్యం. అది ఒక నిమిషం కావచ్చు, ఒక గంట కావచ్చు, లేదా ఒక రోజు కావచ్చు . సమయం ఎంతైన పర్లేదు ఎంత సేపు ప్రార్థించాం అన్నది సమస్య కానే కాదు. మనం ఎప్పుడు మాట్లాడినా,  ఎంత సేపు మాట్లాడినా దేవుడు వింటాడు. తగిన సమయంలో సమాధానమూ ఇస్తాడు.

4     ఇతరులతో కలిసి ప్రార్థించవచ్చా? ( Can I pray with others? )

                      ప్రార్థించవచ్చు, ప్రార్థించాలి కూడా! అలా ఇతరులతో కలిసి ప్రార్థించడం ఎంతో మంచిది, స్నేహితులతో , ఇతరులతో కలిసి ప్రార్థించడం వలన మీ స్నేహం ఇంకా బలంగా మారడమే గాక , దేవునిలో మీ విశ్వాసం మరింతగా బలపడుతుంది. ఎక్కడ ఇద్దరు, ముగ్గురు కూడి నా నామాన్ని ధ్యానిస్తారో అక్కడ నేను ఉంటాను అని యేసయ్య సెలవిచ్చాడు కదా.  కాబట్టి మనం ఎవరితో అయిన కలిసి దేవున్ని ప్రార్థించవచ్చు.

4.     ఎప్పుడూ చేతులు జోడించే ప్రార్ధించాలా? ( should I pray by joining Hands? )

                           చేతులు జోడించి, కన్నులు మూసి దేవుని ప్రార్థించడం ఒక మంచి అలవాటు, అలా ప్రార్థించడం వలన ఎకాగ్రత పెరుగుతుంది. తద్వారా మన మనస్సు మనం చేసే ప్రార్థన మీద లగ్నం అవుతుంది. అంతే కాదు మీరు ఎక్కడ ఏ పనిలొ ఉన్న మీకు అనుకూల సమయంలో మీ మనస్సులో మీరు మనసారా దేవుని ప్రార్థించవచ్చు,  చేతులు జోడించి ప్రార్థించాల్సిన  అవసరం లేదు.

5.         బిగ్గరగా ప్రార్థించవచ్చా   ? ( Can I pray loudly)

                     బిగ్గరగా ప్రార్థించిన, లేక మనస్సులో మౌనంగా ప్రార్థించిన నీ ప్రార్థన దేవుని సన్నిధికి   చేరుతుంది. మనం బిగ్గరగా ప్రార్థించడం వలన మన మనస్సుకు మంచి ఎకాగ్రత కుదురుతుంది. నీవు ఉన్న చోటును బట్టి   బిగ్గరగా గొంతెత్తి  ప్రార్థించాలా ,  లేక మౌనంగానే మనస్సులో ప్రార్థించాలా అనేది  నీ ఇష్టం. నీవు ఎలా ప్రార్థించినా నీ ప్రార్థన దేవుడు వింటాడు,  తప్పకుండా జవాబు ఇస్తాడు.

6 విధానాలను బట్టి మనం ప్రార్థన చేయడానికిదేవునితో సంభాషించడానికి ఓ సమయమంటూ ప్రత్యేకంగా లేదు,  ఇలా చేయాలి, అలా చెయ్యాలి అనే షరతులు కూడా లేవు. ఒక తల్లి తన బిడ్డతో మాట్లాడటానికి ఏ షరతులూ విధించదు  కదా. అలాగే ఒక తండ్రి  తన బిడ్డల అలనా పాలనా విషయంలో ఎలాంటి సమయ సమయాలు  చూడడు కదా. యేసయ్య మనకు అంతకంటే ఎక్కువ కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా మనసారా దేవున్ని ప్రార్థించండిసంభాషించండి, కావలసినవి పొందుకొండి. నిరంతరం దేవునిలో గడుపుతూ ఆయనకు ఇష్టులుగా జీవించండి. ఆమేన్.          

Dear Brothers and Sisters in Christ, If you like this post, kindly comment below the post and do share your response, Thank you for reading, God bless you abundantly, Yours HNTV Telugu Christian Channel

July 30, 2020

July 16, 2020