Showing posts with label bible videos. Show all posts
Showing posts with label bible videos. Show all posts

August 17, 2017

నీ జీవితంలో దేవుని కార్యములు మర్చిపోకు | Bro Praveen | Dominion Power Ce...

❄❄❄ నీ జీవితంలో దేవుని కార్యములు మర్చిపోకు ❄❄❄

Bro Praveen Kumar Message, Dominion Power Center,Vijayawada. 

ఎందుకు ఆ నిరుత్సాహం.. ఎందుకు వేదన..
జీవితం నిస్సారంగా మారిపోతుందా! కనుచూపు మేరలో ఆశ అనేది కనిపించడం లేదా?
నిజమే.. మన సమస్యలో ఉన్న తీవ్రత మనకే తెలుస్తుంది, ఎదుటివారికి ఏమి తెలుస్తుంది ??? నిజమే కదా!
యేసయ్యని నమ్ముకున్న తరువాత నీ జీవితంలో మేలులే జరుగలేదా... ఆలోచించు...
తప్పక వచ్చి ఉంటాయి.. ఎందుకంటే సమస్యలే మన జీవితం అయితే  ఈ లోకంలో ఏ ప్రాణి బ్రతికి బట్టకట్టలేదు.
ఇది వాస్తవం. నీ జీవితంలో మేలులు అనుగ్రహించిన యేసయ్య నీ సమస్యలను తీసివెయ్యలేడా..
మరి ఎందుకంత నిరుత్సాహం, ఎందుకంత ఆందోళన, ఆలోచించు...
ఉపవాసాలు చేసినా.. రేయింబగళ్ళూ ప్రార్ధనలో గడిపినా
ఫలితం కనిపించకపోవడంలో ఆశ్చర్యపడకు..
అంతకు రెట్టింపు ఆశీర్వాదాలు నీకు అందించబోతున్నాడేమో ఆలోచించు..
నిజం.. ఎన్నో గొప్ప సాక్ష్యాలు వేదనకరమైన స్థితిలో నుండి పుట్టినవే..
మరణభయంలో నుండి బయటపడినవే...
అటువంటి భయంకరమైన సమస్యల్లో నుండి వారు బయటపడ్డారు కాబట్టే ఈ రోజు వారి సాక్ష్యాలు మనకు రెట్టింపు బలాన్ని అందిస్తున్నాయి.
మరి రేపటి తరానికి నీ సాక్ష్యం అంతటి ఉత్కృష్టంగా ఉంటుందేమో
భయపడకు.. వేదన చెందకు... కలతపడి సణగకు..
యేసయ్య నీతోనే ఉన్నాడు... నీలోనే ఉన్నాడు...
నీ రేపటికొరకు గొప్పగా ప్రణాళికలు రచించే ఉంటాడు.
ఎందుకంటే నీచేయి ఆయన చేతిలో ఉంది కాబట్టి. Amen.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Watch Our latest Videos..

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

August 05, 2017

బైబిల్లో మనకు తెలియని ఇరాక్ మూలాలు |

❄❄❄ బైబిల్లో మనకు తెలియని ఇరాక్ మూలాలు ❄❄❄

Prominence of Iraq in Bible History

పరిశుద్ద గ్రంధంలో మనకు సుపరిచితమైన దేశం ఇశ్రాయేలు పట్టణం. కానీ ప్రస్తుతం మనం ఇరాక్ గా పిలుచుకునే దేశానికి కూడా బైబిల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఓ మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు దేశం తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగిన మరో దేశం ఇరాక్ అంటే నమ్మక తప్పదు. ఆదికాండము 1 అధ్యాయం మొదలుకొని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంధం వరకు పలు సందర్భాలలో ఇరాక్ దేశం పేరు మనకు బైబిల్లో వినిపిస్తూనే ఉంటుంది. కాకపోతే ఆనాడు బబులోను, మెసపొటొమియా వంటి పేర్లతో ఇరాకును పిలిచే వారు. ఇరాక్ లో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు, వాటిద్వారా ఇరాక్ కు బైబిల్లో ఎంత ప్రాముఖ్యత ఉందో వివరించడానికే ఈ వీడియోని మీ ముందుకు తెస్తున్నాము. తప్పక చూసి మీకు నచ్చితే మీ మిత్రులకు share చేయగలరు. ఆమేన్.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమ
మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Watch Our latest Videos...

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు 

దావీదు మహారాజు
మరియదేవునిచే ఎన్నుకోబడిన స్త్రీ
బైబిల్ చరిత్ర 
యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

April 20, 2017

అమూల్యమైన దేవుని సమయం | Bro Praveen Messages | Dominion Power Center | H...

❄❄❄ అమూల్యమైన దేవుని సమయం ❄❄❄

బ్రదర్ ప్రవీణ్ గారి అద్భుత ప్రసంగం 

దైవిక అభిషేకంతో ఆశీర్వదించబడి దేవునిచే బహుగా వాడబడుచున్న బ్రదర్ ప్రవీణ్, డొమీనియన్ పవర్ సెంటర్ వారి సువార్త ప్రసంగాలు అన్యులను సైతం ఆకట్టుకుంటూ ఎన్నో ఆత్మలను దేవుని వైపు నడిపించబడటం ఎంతో ఆశీర్వాదకరం. వారి ప్రసంగాలు వినడం ద్వారా ఆత్మీయ మేలులు పొందినవారు మాకు ఫోన్ల ద్వారా మాతో మాట్లడటం చాలా సంతోషదాయకం. మీరు ఇంకా బలమైన నడిపింపు పొందాలని.. దేవునిలో ఇంకా ఇంకా ఆశీర్వదించబడాలని ఆ దేవుని ప్రార్దిస్తున్నాము.

ఈ వీడియోలను మీ మిత్రులకు, బంధువులకూ తప్పక SHARE చేసి దేవుని వాక్యాన్ని పదిమందికి పంచడంలో సహాయపడి ఆ తండ్రి కృపకు మరింత పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆమేన్.

మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen. 

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Watch Our latest Videos...

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Monday - Part 3

యేసు మన గొప్ప ప్రధానయాజకుడు

Share and Subscribe HOPE Nireekshana TV YouTube channel to watch more.

March 31, 2017

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు | Day - Tuesday | Part 4 | HOPE ...

❄ యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు ❄

నాల్గవ భాగం, మంగళవారం

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు అంటే శనివారం నుండి తరువాత యేసును శిలువవేసే శుక్రవారం వరకు మొత్తం 7 భాగాలుగా మీకు అందిస్తున్నాము. నాల్గవ భాగంగా మంగళవారం యేసు ఎక్కడ ఉన్నాడు, ఆ రోజు ఆయన జీవితంలో ఏమి జరిగింది, అందులో దాగివున్న మర్మాలు ఏమిటీ అనే విషయాలను ఈ భాగంలో మీకు అందిస్తున్నాము. మంగళవారం నాడు యేసు యెరుషలేము దేవాలయానికి వచ్చి అక్కడ శిష్యులకు ఇంకా జనాంగానికి దేవుని గురించి బోధిస్తుంటాడు. అంతలో అక్కడకు ప్రధన యాజకులు, పెద్దలు, పరిసయ్యులు, సద్దూకయ్యలూ వచ్చి యేసుని ఇక్కడ బోధిచడానికి నీకు అధికారం ఎవరు ఇచ్చారు? అని యేసుని నిలదీస్తారు. అందుకు యేసు వారికి కొన్ని ఉపమానాల ద్వారా.. తగిన సమాధానం చెబుతాడు. అలాగే మరొ కొద్ది రోజుల్లో తనకు విధించబోయే శిక్షను గురించి.. తన మరణాన్ని గురించి ఉపమానాల ద్వారా పరోక్షంగా శిష్యులకు, జనాంగానికి బోధించి తిరిగి బేతనియా గ్రామానికి ఆ సాయంకాలం చేరుకుంటాడు.

ఈ వీడియో మీకు నచ్చినట్లైతే మీ మిత్రులకు, బంధువులకు, share చేసి subscribe చేయించగలరు. మీ అమూల్యమీన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen. 

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 

Share and Subscribe HOPE Nireekshana TV YouTube Channel to watch more.

March 27, 2017

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు | Sunday | Part 2 | HOPE Nireeks...

❄❄❄ యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు ❄❄❄

రెండవ భాగం: ఆదివారం ఎపిసోడ్

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు అంటే శనివారం నుండి తరువాత యేసును శిలువవేసే శుక్రవారం వరకు మొత్తం 7 భాగాలుగా మీకు అందించాలనే తలంపుతో ఈ వీడియో ఎపిసోడ్స్ ను మీకు సీరియల్ గా అందిస్తున్నాము.

ఆదివారం శిష్యులు ముందుగా తనకై సిద్దపరచిన గాడిదపిల్లను అధిరోహించి ప్రజలందరూ హోసన్నా హోసన్నా అంటూ జేజేలు పలుకుతుండగా యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశిస్తాడు. ఆరోజు పండుగ వాతావరణంతో యెరుషలేము వీధులు జనసంద్రమై నిండిపోతాయి. ప్రజలందరూ యేసు గాడిదపిల్లపై వస్తున్న మార్గమంతా తమ బట్టలు దారిపొడవునా పరచి ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని ఆనందంతో కేకలు వేస్తారు. కట్టబడిన గాడిదనూ గాడిదపిల్లనూ వాటి కట్లు విప్పించబడటంలోనూ.. గాడిదపిల్లను అధిరోహించి రావడం లోనూ గొప్ప నిఘూడమైన మర్మాలు అందులో దాగివున్నాయి. మరికొద్ది రోజుల్లో తను శిలువ మరణం పొందబోతున్నానని తెలిసీ మనపై అంతులేని ప్రేమను కరుణను చూయించి మనకు తన మరణం ద్వారా రక్షణను అందించి తను చావును కౌగలించుకోబోతున్నాడు. ఎంత ప్రేమ, దయ, కరుణను మనపై చూయంచాడో మనం గమనించాలి. ఆ ప్రభువు కాళ్ళను ఆనాడు మరియలా మన కన్నీళ్ళతో కడిగి మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోగలగాలి. నిరంతరం దేవుని ప్రార్ధించుతూ కృతజ్ఞులమై తోటివారికి ప్రేమను పంచుతూ ఈ లోకంలో జీవించగలగాలి.

ఈ వీడియో మీకు నచ్చినట్లైతే మీ మిత్రులకు, బంధువులకు, share చేసి subscribe చేయించగలరు. మీ అమూల్యమీన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...

Share and Subscribe HOPE Nireekshana TV YouTube Channel to watch more.