Showing posts with label last seven days in Jesus life. Show all posts
Showing posts with label last seven days in Jesus life. Show all posts

April 16, 2019

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన 33 1/2 ఏళ్లలో 3 1/2 ఏళ్ళు ఆయన రక్షణ సువార్తను లోకానికి అందించాడు,  ఆయన ఈ లోకంలో నడయాడిన ప్రతిదినమూ మనకు సుదినమే. అయినా ఆయన కల్వరిలో సిలువపై మరణించబోయే ముందు గడిపిన చివరి వారం రోజులు మరింత ప్రాముఖ్యమైనవి. ఆ వారం రోజుల్లో తానేరీతిగా మరణించబోతున్నదీ, ఎవరిద్వారా అప్పగింపబడబోతున్నదీ, శిష్యులు ఆయన అనంతరం ఎలా జీవించాలి వంటి ఎన్నో అద్భుతమైన మర్మాలు ఆ ఏడు రోజుల్లో మనకు కనిపిస్తాయి. వాటిని ఏరోజు కారోజు మీకు వివరించాలనే ప్రయత్నం చేసాము.  

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు
మొదటిరోజు - శనివారం
ఆ రోజు బెతానియా లోని సీమోను ఇంట్లో మరియ యేసయ్య పాదాలను కడగడంతో ఆయన చివరి దినాలు ప్రారంభం అయ్యాయని అనుకోవచ్చు. త్వరలో జరుగబోయే భూస్థాపనకు ఇది నాంది అంటూ యెసయ్యే స్వయంగా చెప్పడంతో ఈ రోజు ప్రారంభం అవుతుంది. 
*శనివారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి:* 
https://youtu.be/cfGO0MLDYg0 

 https://youtu.be/cfGO0MLDYg0


రెండవరోజు - ఆదివారం
ఆదివారం గాడిదపిల్లను అధిరోహించి జనులు హోసన్నా అంటూ జేజేలు పలుకుతుండగా యెరూషలేములోనికి ప్రవేశిస్తాడు. కట్టబడిన గాడిదనూ గాడిదపిల్లనూ వాటి కట్లు విప్పించబడటంలోనూ.. గాడిదపిల్లను అధిరోహించి రావడం లోనూ గొప్ప నిఘూడమైన మర్మాలు అందులో దాగివున్నాయి.  
*ఆదివారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి:*
https://youtu.be/Gh9dOnAxx-A 



మూడవరోజు - సోమవారం
ఆ రోజు యేసు యెరుషలేము దేవాలయానికి వస్తాడు. అక్కడ వర్తక వ్యాపారుల ఆగడాలు చూసిన యేసు హృదయం తల్లడిల్లిపోతుంది. వ్యాపారుల బల్లలను పడవేసి బంధించిన పావురాలను, కోడెలను, మేకలను వాటి కట్లు తెంపి వాటికి వదిలివేస్తాడు. వాటి కట్లు తెంపి విడుదలను చేయడంలో చాలా బలమైన కారణం ఉంది. అదేంటో తెలియాలంటే ఈ వీడియో చూడండి
*సోమవారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి :* 
https://youtu.be/RpzSrkQIf8E 



నాల్గవ రోజు - మంగళ వారం
ఆ రోజు యేసు యెరుషలేము దేవాలయానికి వచ్చి అక్కడ శిష్యులకు ఇంకా జనాంగానికి దేవుని గురించి బోధిస్తాడు. ఇక్కడ బోధిచడానికి నీకు అధికారం ఎవరు ఇచ్చారు? అంటూ నిలదీసిన యాజకులు, పెద్దలు, పరిసయ్యులు, సద్దూకయ్యలకు యేసయ్య తనదైన శైలిలో ఉపమానాల ద్వారా తగిన సమాధానం చెబుతాడు. అంతే కాక తనకు విధించబోయే శిక్షను గురించి.. తన మరణాన్ని గురించి పరోక్షంగా శిష్యులకు, జనాంగానికి బోధిస్తాడు. 
*మంగళ వారం  వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి :*
https://youtu.be/s8E4PZVVRiY  



ఐదవ రోజు - బుధవారం
ఆ రోజు యూదా ఇస్కరియోతు క్రీస్తును అప్పగించడానికి ప్రధాన యాజకులతో కలిసి పన్నాగం పన్నడం,ముప్పై వెండినాణేలకు అమ్ముకోవడం గురించి శుక్రవారం జరుగబోయే దారుణాన్ని యేసుక్రీస్తు తన శిష్యులకు చెబుతాడు,అసలు యూదా ఏసయ్యను పట్టించడంలో చంపాలనే ఆలోచనతోనే పట్టించాడా?, యూదా మనసులో ఏముంది? అసలు యూదా ఆలా ఎందుకు చేశాడు అనే విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
*బుధవారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి:*
https://youtu.be/NaZDGodT8D8 



ఆరవరోజు - గురువారం
గురువారం యేసుక్రీస్తు జీవితంలో కీలకమైన రోజు. ఆ రోజు యేసు అత్యంత పవిత్రమైన బల్ల ఆరాధనను మనకు అందించాడు, మనం ఎలా జీవించాలో మాదిరిగా చూయించాడు. మనలనూ అలానే జీవించమని ఆశీర్వదించాడు. మన కొరకు మన పాపపంకిలమైన జీవితాల కొరకు క్రీస్తు మరణం వైపు అడుగులు వేస్తూ మనకు రక్షణను అందించడానికి దుర్మార్గులకు తనను తాను అప్పగించుకున్నాడు. 
*గురువారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి:*
https://youtu.be/pPp6rJWiCSo 



ఏడవ రోజు - శుక్రవారం GOOD FRIDAY 
శుక్రవారం.. క్రైస్తవులకు పవిత్రమైన రోజు, మన పాపాలనుండి దైవకుమారుడు మనకు విముక్తిని అందించిన రోజు. శుభ శుక్రవారంగా ప్రపంచమంతటా పండుగలు జరుపుకునే రోజు. మనుష్యకుమారునిగా జన్మించిన యేసుకు ఈ భూమ్మీద చివరి రోజు. అలాంటి శుక్రవారాన్ని గూర్చి నేడు మనం మరోమారు ధ్యానించడం ఆ దేవుని కృప మాత్రమే. 
*శుక్రవారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి:*
https://youtu.be/fFaw1gEqND4 



యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు  ఈ ఎపిసోడ్ తో పూర్తి అయ్యాయి. దేవుని మహాకృప వలన ఈ వీడియోలను మీకు మన HOPE Nireekshana TV ద్వారా అందిచగలిగాము. భవిష్యత్తులో మరిన్ని సందర్భాలలో మనం కలిసి ఆ తండ్రిని ధ్యానించుకోవాలని.. అట్టి భాగ్యాన్ని మనకు దయచేయాలని ఆ ప్రభువుని ప్రార్ధిద్దాము. 
తప్పక ఈ వీడియోలను చూచి మీ కామెంట్లను బాక్స్ లో వ్రాయగలరు. ఈ వీడియోలు మీకు నచ్చితే మరచిపోకుండా షేర్ చేయగలరు, ఆమెన్. 
యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు

April 05, 2017

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు | Day - Thursday | Part 6 | HOPE...

❄ యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు ❄

ఆరవ భాగం, గురువారం 

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు అంటే శనివారం నుండి తరువాత యేసును శిలువవేసే శుక్రవారం వరకు మొత్తం 7 భాగాలుగా మీకు అందిస్తున్నాము. గురువారం యేసుక్రీస్తు జీవితంలో కీలకమైన రోజుగా భావించవచ్చు. ఆ రోజు యేసు అత్యంత వుత్కృష్టమైన బల్ల ఆరాధనను మనకు అందించాడు, మనం ఎలా జీవించాలో మాదిరిగా చేసి చూయించాడు. మనలనూ అలానే జీవించమని ఆశీర్వదించాడు. మన కొరకు మన పాపపంకిలమైన జీవితాల కొరకు క్రీస్తు మరణం వైపు అడుగులు వేస్తూ మనకు రక్షణను అందించడానికి దుర్మార్గులకు తనను తాను అప్పగించుకున్నాడు.



యేసు జీవితంలోని చివరి రోజుల్లో ఎలా గడిపాడు, ఈ లోకానికి ఏమి అందించాడు అనే విషయాలు మీకు చెప్పాలి అని, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్యయ ప్రయాసలను ఆలోచించక ఈ వీడియోలను ఏడు భాగాలుగా మీకు అందిస్తున్నాము. తప్పక మీ బంధు మిత్రులకు స్నేహితులకు SHARE చేసి SUBSCRIBE చేయించి ఈలాంటి వీడియోలను ఇంకా ఎన్నో మీకు అందించేలా మమ్మల్ని ప్రోత్సహించగలరు. అమేన్.


మర్చిపోకుండా వీడియోని LIKE చేసి, మీ అమూల్యమైన comment ను inbox లో post
చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen. 

లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 


యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు - Monday - Part 3






Share and Subscribe HOPE Nireekshana TV YouTube Channel to watch more.

March 27, 2017

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు | Sunday | Part 2 | HOPE Nireeks...

❄❄❄ యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు ❄❄❄

రెండవ భాగం: ఆదివారం ఎపిసోడ్

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు అంటే శనివారం నుండి తరువాత యేసును శిలువవేసే శుక్రవారం వరకు మొత్తం 7 భాగాలుగా మీకు అందించాలనే తలంపుతో ఈ వీడియో ఎపిసోడ్స్ ను మీకు సీరియల్ గా అందిస్తున్నాము.

ఆదివారం శిష్యులు ముందుగా తనకై సిద్దపరచిన గాడిదపిల్లను అధిరోహించి ప్రజలందరూ హోసన్నా హోసన్నా అంటూ జేజేలు పలుకుతుండగా యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశిస్తాడు. ఆరోజు పండుగ వాతావరణంతో యెరుషలేము వీధులు జనసంద్రమై నిండిపోతాయి. ప్రజలందరూ యేసు గాడిదపిల్లపై వస్తున్న మార్గమంతా తమ బట్టలు దారిపొడవునా పరచి ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని ఆనందంతో కేకలు వేస్తారు. కట్టబడిన గాడిదనూ గాడిదపిల్లనూ వాటి కట్లు విప్పించబడటంలోనూ.. గాడిదపిల్లను అధిరోహించి రావడం లోనూ గొప్ప నిఘూడమైన మర్మాలు అందులో దాగివున్నాయి. మరికొద్ది రోజుల్లో తను శిలువ మరణం పొందబోతున్నానని తెలిసీ మనపై అంతులేని ప్రేమను కరుణను చూయించి మనకు తన మరణం ద్వారా రక్షణను అందించి తను చావును కౌగలించుకోబోతున్నాడు. ఎంత ప్రేమ, దయ, కరుణను మనపై చూయంచాడో మనం గమనించాలి. ఆ ప్రభువు కాళ్ళను ఆనాడు మరియలా మన కన్నీళ్ళతో కడిగి మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోగలగాలి. నిరంతరం దేవుని ప్రార్ధించుతూ కృతజ్ఞులమై తోటివారికి ప్రేమను పంచుతూ ఈ లోకంలో జీవించగలగాలి.

ఈ వీడియో మీకు నచ్చినట్లైతే మీ మిత్రులకు, బంధువులకు, share చేసి subscribe చేయించగలరు. మీ అమూల్యమీన comment ను inbox లో post చెయ్యగలరు. Thank You, Praise the Lord, Amen.



లోక రక్షకుడు మిమ్మల్నీ మీ కుటుంబాలను సదాకాలం కాచి నడిపించాలని తన మహిమార్ధమై మీరు మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువు పేరిట ప్రార్ధిస్తున్నాము. ఆమేన్. 
Our New Videos...


Share and Subscribe HOPE Nireekshana TV YouTube Channel to watch more.