September 07, 2016

మరణము... తీర్పు... నరకము...

ప్రియ మిత్రులారా...

మనము నిత్యమూ భయపడే ఆ నరకము నిజానికి మనకొరకు నిర్మింపబడలేదు,
అపవాదికిని వాని దూతలకునూ సిద్దపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. మత్తయి 25:41
నరకము అపవాదికి వాని దూతల కొరకు మాత్రమే సిద్దపరచబడినది.
కాని మానవుడు, దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ ప్రణాళికను అంగీకరించక, ప్రియ రక్షకుని కాదని తాను స్వయంగా ఎంపిక చేసుకుని మరీ ఆ నిత్యాగ్నికి ఆహుతి అవుతున్నాడు.
మనుష్యులు ఒక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. హెబ్రీ 9:27
ఎవని పేరైనను జీవగ్రంధమందు వ్రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ప్రకటన 20:15
మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంటకోయును. గలతీ 6:7-8, కాబట్టి మోసపోకుడి అని పౌలు అంటాడు.
అదేవిదంగా 'మీ పాపం మిమ్మును పట్టుకొనును అని తెలిసికొనుడి. సంఖ్యాకాండము 32:23 లో చెప్పబడినది కదా..
బండ క్రింద చీకటికి అలవాటు పడిన పురుగులు వెలుగులో నిలువలేవు, బండను పైకి తీసినప్పుడు ఆ పురుగులు వెంటనే చీకటిలోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి, పాపపు చీకటికి అలవాటుపడి పాప క్షమాపణను అంగీకరించనివాడు పరలోకపు వెలుగులో నిలువలేక నరకమునే కోరుకొనుచున్నాడు.
నా కుమారుడా.. కుమార్తే...
నీ హృదయమును నాకిమ్ము.. సామెతలు 23:26
ఆ నరకవేదనను నీవు భరించలేవు అని దేవుడు ఏనాడో చెప్పాడు.
చూశారుగా మిత్రులారా...
మీకు పాపకూపంలో ప్రయాణించి అందుకు బదులుగా వచ్చే నరకం కావాలా???
నిత్యజీవం కలిగి మన తండ్రితో కూడిన ఆ పరలోక రాజ్యం కావాలా???
సమయం ఆసన్నమైంది...
ఇప్పుడే ఆ దేవుని సన్నిదిలో మన పాపాలు ఒప్పుకొని పరలోకము చేరుటకు సిద్దం అవుదాం రండి...
ఆమేన్...

No comments:

Post a Comment

If you have any doubts, please let me know