September 30, 2016

నీ కష్టాలలో యేసయ్యను స్తుతించగలవా?
కష్టాలు, శ్రమలు, వ్యాధి బాధలు ఎవరికి లేవు?
అందరికీ సమస్యలు ఉన్నాయి, అందరికీ వారి వారి పరిధిలో ఏదో ఒక ఇబ్బంది ఉండే ఉంటుంది...
అంతమాత్రానా మనం డీలా పడిపోకూడదు, దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోకూడదు.
నీ శ్రమలలో సైతం నిన్ను విడువని వాడు.. రెట్టింపు ఆశీర్వాదములతో దీవించువాడు నీకు నాకు ప్రభువై ఉన్నాడు.
అడుగిడి ఇయ్యబడును... వెదకుడి దొరకును... తట్టుడి తీయబడును....
యేసయ్య మనపట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు,
మనమే అశాశ్వతమైన ఈ లోకపు ఆలోచనలలో పడి సతమతమౌతూ మనకు తెలియకుండానే యేసయ్యకు దూరంగా వెళ్ళిపోతున్నాము, సాతానుగాడి చెరలో పడి నలిగిపోతున్నాము.
దేవుని పట్ల అంతులేని విశ్వసంతో ఆనాడు  మాసిడోనియా లోని ఫిలిప్పీ పట్టణములో పౌలును సీలలను అధికారులు న్యాయాధిపతులు వారిని హింసించి చెరసాలలో వేసినప్పుడు
వారు ఏమాత్రం గొణగక సణగక దేవుని ఆరాధించారు!

అయితే మద్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్ధించుచు కీర్తనలు పాడుచుండిరి. అపో.కార్యములు 16:25
మనం ఆ స్థితిలో ఆవిధంగా చేయగలమా? అంతటి విశ్వాసం దేవుని పట్ల మనకు ఉందా..
మనం ఇప్పటికీ లోకసంబందులుగానే బ్రతుకుతున్నాము.
మనలో దేవుని పట్ల విశ్వాసం నమ్మిక కొరవడిపోతున్నది...
తన ప్రజలను కాపాడటానికి ఆనాడు యెహోషువా అంతులేని విశ్వాసంతో యుద్దంలో గెలిచేవరకు సూర్యుని అస్తమించకుండా ఆపివేశాడు.
షడ్రకు మెషేకు అబిద్నగోలు భయకరమైన మండుచున్న అగ్నిలో పడవేసినా తిరిగి బయటకు వచ్చారు,
దానియేలు సింహపు గుహలో నుండి క్షేమంగా బయటపడగలిగాడు,
రక్తస్రావ వ్యాధితో ఇబ్బంది పడుతున్న స్త్రీ గొప్ప నమ్మికతో యేసయ్య అంగీని తాకి స్వస్థతను పొందుకోగలిగింది..
ఇన్ని ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు మనపట్ల కూడా అదే ప్రేమను కలిగియున్నాడు.
మనమే ఆయన ప్రేమను గ్రహించలేకపోతున్నాము,
ఇప్పటికైనా మించిపోయింది ఏమీలేదు
నీ కష్టాలలో ఇరుకు ఇబ్బందులలో దేవుడే నీ నిజమైన రక్షకుడు, సహాయత దయచేయువాడు.. ఆదుకొనువాడు.. నీవు అనుభవిస్తున్న బాధలకు నూరంతలుగా నిన్ను దీవిస్తాడని.. నీ వ్యాధి బాధలనుండి బయటకు రప్పిస్తాడని నీవు నమ్మికతో ప్రార్ధించాలి.
పౌలు సీలలు ప్రార్ధించగా చెరసాల పునాదులు అదిరాయి, భూకంపం వచ్చింది, చెరసల తలుపులు తెరువబడ్డాయి... బంధకాలు ఊడిపడ్డాయి (అపో.కార్యములు 16:26)
మన బంధకాలూ తెగిపడ్తాయి, మన ఇరుకు ఇబ్బందులనుండి.. మరణకరమైన వ్యాధులనుండి... ఆర్ధిక ఇబ్బందులనుండి తప్పక బయటకు రప్పిస్తాడు..
నీవు ఆశించేవి నీకు లభిస్తాయన్న గొప్ప నమ్మికతో దేవుని ఆశ్రయించు
ఏ సమస్యా యేసయ్యకంటే గొప్పది కాదన్న విశ్వాసంతో నీ హృదయన్ని దేవుని ముందు పరచి ప్రార్ధించు... తప్పక నీకు సహాయం లభిస్తుంది...
నీ సమస్య పరిష్కారం ఆలస్యమౌతుందని చింతించకు...
అంతకు మించి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడని గ్రహించు...
నీవు తప్పక ఆశీర్వదించబడతావు...
నమ్ముట నీవలనైతే సమస్తమూ సాధ్యమే...
ఆమేన్.

1 comment:

If you have any doubts, please let me know