September 27, 2016

నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. కీర్తనలు 55:22
నీ హృదయము వేదనతో నిండిన సమయంలో..
బాధల బందకాలతో కృంగిన వేళలో...
అనారోగ్యము నీ శరీరమును కృశింపజేసే ఘడియలో...
ఆప్పుల సమస్యలలో సతమయ్యే కాలంలో...
ఆర్ధిక పరిస్థితులన్ని నీకు అననుకూలంగా మారే ధుర్భరకాలంలో...
నా అనుకున్న వారే నిను గెంటివేసే పరిస్థితిలో...
శత్రుసమూహం నీమీదికి లేచి నిన్ను అల్లకల్లోలం చేయు విషమస్థితిలో...
తల్లి తండ్రులు.. భార్యా పిల్లలు.. అక్కచెళ్ళెళ్ళు, అన్నతమ్ముళ్ళు, బంధుమిత్రుల
ఆదరణ రవ్వంత కూడా నీవు నోచుకోక
నిరాశా నిస్పృహలతో మరణమే శరణము అనుకునే స్థితిలో...
అంతా నిరామయం... చీకటి... కనుచూపు మేరలో కానరాని అవకాశం...
అప్పుడు... అప్పుడు...సరిగ్గా అలాంటి స్థితిలో నీవు
మహోన్నతుడు..
సర్వశక్తిమంతుడు..
సర్వాధికారి..
రాజులకు రాజు.. ప్రభువులకు ప్రభువు..
పరమవైద్యుడు ఐన ఆ యేసయ్య
వైపు తిరిగి నీ చేతిని చాచగలిగితే...
నీ యొక్క సమస్త భారమును ఆయన తీసివేసి నీకు శాంతిని కలుగజేస్తాడు.


ఆయన మనుష్య కుమారుడిగా వచ్చింది మనకోసం,
ఆ అందాల మోముపై ఉమ్మి వేయించుకుంది మనకోసం,
శరీరం గాయాలతో నెత్తుటి జల్లెడల చేసుకుంది మనకోసం,
శిలువమ్రానుపై రోధించి..వేదనచెంది మనణానికి తనను తాను అప్పగించుకుంది మనకోసం...
మూడవ రోజు మరణపు ముల్లు విరిచి మృతుంజయుడు అయ్యింది కూడా కేవలం మనకోసమే...
ఆయన వైపు చూస్తే విజయం నీవెంట వస్తుంది,
యేసోపును.. యోబును.. ఆశీర్వదించిన మన దేవుడు మనల్ని కూడా తప్పక ఆదరిస్తాడు.
మనల్ని మనము ఆయనకు ఆప్పగించుకోగలిగితే...
ఎడారిలో ఉన్నా.. అగాధసముద్రాలలో ఉన్నా.. నీవే స్థితిలో ఉన్నా..నీకు భయం లేదు..
ఈ రోజు నీవు ఏస్థితిలో ఉన్నా చేతినందించి ఆదుకునేవారు ఒకరు
నీకొరకు సిద్దంగా ఉన్నారని మరువకు..
ఈ రోజే నీసమస్యల పరిధిలోనుండి బయటకు రా!!!
నీ ఎదురుగా నిలబడి చేతులు చాచి ఎదురుచూస్తున్న నీ నా యేసయ్యను చూద్దాము!!!
మన భారము యేసయ్య మీద మోపుదాము, ఆయనే నిన్ను నన్ను ఆదుకొనును,
త్వరపడి యేసయ్య సన్నిదికి చేరుదాం..రక్షణ పొందుదాం.
ఆమేన్..

----------------------
Watch and Subscribe HOPE Nireekshana TV YouTube Channel....
God bless you.

1 comment:

If you have any doubts, please let me know