September 09, 2016


కాపాడే డేవుడు

నేను దానిచుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మద్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. జెకర్య 2:5-8
మనుష్యుల మద్య నివసిస్తున్నాం, అయితే పైన దేవుని వాగ్ధానాన్ని చూసి అన్ని సమయాలలో దేవునిపై అధారపడవలసివుంది.
ఆయన ఈ లోకపు దుష్టత్వం నడుమ మీచుట్టూ అగ్ని చూసేలా చేస్తాడు. (యెషయా 64:2)
అయితే మీరు దేవునికి ఇష్టమైన, నీతివంతమైన, దైవభీతిగల జీవితాన్ని కొనసాగించడానికి కడు శ్రద్ద వహించాలి. మనం గాఢంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు భయపడవలసిన అవసరం లేదని దావీదు ఆనాడే శెలవిచ్చాడు. ఎందుకంటే మన కాపరి మన రక్షకుడైన దేవుడు.. మనతో పాటు ఉండి మనలను నిరాంతరం కాపాడి రక్షించగల సమర్ధుడు (కీర్తన 23:1-4).






ప్రార్ధన:

ప్రేమగల పరలోకపు తండ్రి, నీవు సర్వశక్తిగల దేవునివి. ఈ లోకంలో మా చుట్టూ పొంచియున్న ప్రమాదాలనుండి, మా శత్రువుల బారినుండి మమ్మల్ని కాపాడతానికి నీవు ఎల్లప్పుడు కునుకక నిద్రపోక మామ్మల్ని కాచికాపాడుతుంటావని యెరిగి నేనెంతో ఆనందిస్తున్నాను. ప్రభువా నేటి మా ఈ ప్రార్ధనా విన్నపాలను మన్నించి మమ్మల్ని కాపాడి ముందుకు నడిపిస్తావని తలంచుచున్నాను. 
అమేన్.


Watch HOPE Nireekshana TV YouTube channel, stay blessed
Clik link: www.youtube.com/watch?v=drvGmcl1R6I

No comments:

Post a Comment

If you have any doubts, please let me know