September 16, 2019
September 15, 2019
April 16, 2019
యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు
యేసయ్య ఈ భూమ్మీద గడిపిన 33 1/2 ఏళ్లలో 3 1/2 ఏళ్ళు ఆయన రక్షణ సువార్తను లోకానికి అందించాడు, ఆయన ఈ లోకంలో నడయాడిన ప్రతిదినమూ మనకు సుదినమే. అయినా ఆయన కల్వరిలో సిలువపై మరణించబోయే ముందు గడిపిన చివరి వారం రోజులు మరింత ప్రాముఖ్యమైనవి. ఆ వారం రోజుల్లో తానేరీతిగా మరణించబోతున్నదీ, ఎవరిద్వారా అప్పగింపబడబోతున్నదీ, శిష్యులు ఆయన అనంతరం ఎలా జీవించాలి వంటి ఎన్నో అద్భుతమైన మర్మాలు ఆ ఏడు రోజుల్లో మనకు కనిపిస్తాయి. వాటిని ఏరోజు కారోజు మీకు వివరించాలనే ప్రయత్నం చేసాము.
యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు
మొదటిరోజు - శనివారం
ఆ రోజు బెతానియా లోని సీమోను ఇంట్లో మరియ యేసయ్య పాదాలను కడగడంతో ఆయన చివరి దినాలు ప్రారంభం అయ్యాయని అనుకోవచ్చు. త్వరలో జరుగబోయే భూస్థాపనకు ఇది నాంది అంటూ యెసయ్యే స్వయంగా చెప్పడంతో ఈ రోజు ప్రారంభం అవుతుంది.
*శనివారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి:*
https://youtu.be/cfGO0MLDYg0
రెండవరోజు - ఆదివారం
ఆదివారం గాడిదపిల్లను అధిరోహించి జనులు హోసన్నా అంటూ జేజేలు పలుకుతుండగా యెరూషలేములోనికి ప్రవేశిస్తాడు. కట్టబడిన గాడిదనూ గాడిదపిల్లనూ వాటి కట్లు విప్పించబడటంలోనూ.. గాడిదపిల్లను అధిరోహించి రావడం లోనూ గొప్ప నిఘూడమైన మర్మాలు అందులో దాగివున్నాయి.
*ఆదివారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి:*
https://youtu.be/Gh9dOnAxx-A
మూడవరోజు - సోమవారం
ఆ రోజు యేసు యెరుషలేము దేవాలయానికి వస్తాడు. అక్కడ వర్తక వ్యాపారుల ఆగడాలు చూసిన యేసు హృదయం తల్లడిల్లిపోతుంది. వ్యాపారుల బల్లలను పడవేసి బంధించిన పావురాలను, కోడెలను, మేకలను వాటి కట్లు తెంపి వాటికి వదిలివేస్తాడు. వాటి కట్లు తెంపి విడుదలను చేయడంలో చాలా బలమైన కారణం ఉంది. అదేంటో తెలియాలంటే ఈ వీడియో చూడండి
*సోమవారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి :*
https://youtu.be/RpzSrkQIf8E
నాల్గవ రోజు - మంగళ వారం
ఆ రోజు యేసు యెరుషలేము దేవాలయానికి వచ్చి అక్కడ శిష్యులకు ఇంకా జనాంగానికి దేవుని గురించి బోధిస్తాడు. ఇక్కడ బోధిచడానికి నీకు అధికారం ఎవరు ఇచ్చారు? అంటూ నిలదీసిన యాజకులు, పెద్దలు, పరిసయ్యులు, సద్దూకయ్యలకు యేసయ్య తనదైన శైలిలో ఉపమానాల ద్వారా తగిన సమాధానం చెబుతాడు. అంతే కాక తనకు విధించబోయే శిక్షను గురించి.. తన మరణాన్ని గురించి పరోక్షంగా శిష్యులకు, జనాంగానికి బోధిస్తాడు.
*మంగళ వారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి :*
https://youtu.be/s8E4PZVVRiY
ఐదవ రోజు - బుధవారం
ఆ రోజు యూదా ఇస్కరియోతు క్రీస్తును అప్పగించడానికి ప్రధాన యాజకులతో కలిసి పన్నాగం పన్నడం,ముప్పై వెండినాణేలకు అమ్ముకోవడం గురించి శుక్రవారం జరుగబోయే దారుణాన్ని యేసుక్రీస్తు తన శిష్యులకు చెబుతాడు,అసలు యూదా ఏసయ్యను పట్టించడంలో చంపాలనే ఆలోచనతోనే పట్టించాడా?, యూదా మనసులో ఏముంది? అసలు యూదా ఆలా ఎందుకు చేశాడు అనే విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
*బుధవారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి:*
https://youtu.be/NaZDGodT8D8
ఆరవరోజు - గురువారం
గురువారం యేసుక్రీస్తు జీవితంలో కీలకమైన రోజు. ఆ రోజు యేసు అత్యంత పవిత్రమైన బల్ల ఆరాధనను మనకు అందించాడు, మనం ఎలా జీవించాలో మాదిరిగా చూయించాడు. మనలనూ అలానే జీవించమని ఆశీర్వదించాడు. మన కొరకు మన పాపపంకిలమైన జీవితాల కొరకు క్రీస్తు మరణం వైపు అడుగులు వేస్తూ మనకు రక్షణను అందించడానికి దుర్మార్గులకు తనను తాను అప్పగించుకున్నాడు.
*గురువారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి:*
https://youtu.be/pPp6rJWiCSo
ఏడవ రోజు - శుక్రవారం GOOD FRIDAY
శుక్రవారం.. క్రైస్తవులకు పవిత్రమైన రోజు, మన పాపాలనుండి దైవకుమారుడు మనకు విముక్తిని అందించిన రోజు. శుభ శుక్రవారంగా ప్రపంచమంతటా పండుగలు జరుపుకునే రోజు. మనుష్యకుమారునిగా జన్మించిన యేసుకు ఈ భూమ్మీద చివరి రోజు. అలాంటి శుక్రవారాన్ని గూర్చి నేడు మనం మరోమారు ధ్యానించడం ఆ దేవుని కృప మాత్రమే.
*శుక్రవారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి:*
https://youtu.be/fFaw1gEqND4
యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు ఈ ఎపిసోడ్ తో పూర్తి అయ్యాయి. దేవుని మహాకృప వలన ఈ వీడియోలను మీకు మన HOPE Nireekshana TV ద్వారా అందిచగలిగాము. భవిష్యత్తులో మరిన్ని సందర్భాలలో మనం కలిసి ఆ తండ్రిని ధ్యానించుకోవాలని.. అట్టి భాగ్యాన్ని మనకు దయచేయాలని ఆ ప్రభువుని ప్రార్ధిద్దాము.
తప్పక ఈ వీడియోలను చూచి మీ కామెంట్లను బాక్స్ లో వ్రాయగలరు. ఈ వీడియోలు మీకు నచ్చితే మరచిపోకుండా షేర్ చేయగలరు, ఆమెన్.
యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు
April 10, 2019
ఆమేన్ అంటే!? - AMEN STORY - ఆమేన్ అని ఎందుకు అనాలి?
ఆమేన్ అని ఎందుకు అనాలి ?
ఆమేన్ అనగానే అన్ని జరిగిపోతాయా ?
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.
ఆమేన్ అనగానే అన్ని జరిగిపోతాయా ?
ఓ క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా నిత్యం మనం చేసే ప్రతి ప్రార్ధనా ముగింపులో నజరేయుడైన యేసు నామంలో ప్రార్ధిస్తున్నాము తండ్రీ అని ముగిస్తాము. మనం ఎందుకు అలా ప్రార్ధన ముగింపులో ఆమెన్ అని అంటాము. అలా అనడంలో ఐదైనా అంతరార్ధం ఉందా?
యేసు నామములో కార్యములు జరుగును గాక అని అనగానే నిజంగానే జరుగవలసిన ప్రతికార్యమూ నెరవేరుతుందా! బైబిల్ గ్రంధంలో అలా నెరవేరిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఈ విషయాలను గురించి కొంచెం లోతుగా పరిశీలిద్దాము,
ఈ ఆమెన్ అనే మాట హీబ్రు పదమైన ఆమాను అనే పదం నుండి వచ్చింది. ఆమెన్ అనే మాటకు అలాగే జరుగును గాక అని అర్ధం. ప్రకటనల గ్రంధం 3:14 వ వచనంలో యేసును ఆమెన్ అనువాడుగా యోహాను ప్రవక్త ప్రవచిస్తాడు. అంటే యేసయ్య మనం చేసే ప్రార్థనలకు, విన్నపాలకూ నిత్యం ఆమెన్ అనువాడుగా ఉన్నట్టుగా మనం ఈ వాక్యంలో గమనించవచ్చు.
ఇశ్రాయేలు దేశ ప్రజలు నేటికీ శనివారం నాడు సబ్బాతు దినాన్ని పవిత్రంగా ఆచరిస్తారు. వారు ప్రతి సబ్బాతు దినాన ఉదయాన్నే పరలోకం నుండి క్రుమ్మరింపబడే దీవెనలను పొందుకోవడానికి ఒక చోట చేరి ఆ దీవెనలను ఆమెన్ అని అంటూ పొందుకుంటారు.
1 పేతురు 3 :10 వ వచనంలో జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అని వ్రాయబడి ఉంటుంది. అంటే క్రీస్తును అనుసరించే మనం మన నాలుకను పెదవులను మన ఆధీనంలో ఉంచుకోవాలి. మనల్ని మనము నిందించుకోవడం కానీ, ఇతరులను నిందించడం కానీ చేయకూడదు. తద్వారా మన శాపాలు మనమే కొనితెచ్చుకున్నవారం అవుతాము. ఎందుకంటే శాపాలు కొనితెచ్చుకునేవారం మనమైతే, ఆశీర్వాదాలు దయచేసేవాడు మన తండ్రి ఐన యేసయ్య, అది ఎలాగంటే..
ద్వితీయోపదేశకాండము 27 :15 వ వచనం నుండి చివరి వచనం వరకు శాపాలు పట్టిక ఉంటుంది, ప్రతి వచనాన్ని చివరిలో ఆమెన్ అని చెప్పవలెనని ఉంటుంది. అదే రీతిగా ద్వితీయోపదేశకాండము 28 :1 -14 వ వచనం వరకు ఆశీర్వచనాలు పట్టిక ఉంటుంది. కానీ ఏ ఒక్క వచనం కూడా చివర ఆమెన్ అనే మాటతో ముగియదు. ఇందులో మర్మమేమిటో మనం తెలుసుకోవాలంటే 2 కొరింథీ 1 :20 వ వచనం చూడాలి. దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి, గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై యున్నవి (మూల భాషలో ఆమెన్ అని యున్నవి} అని ఉంటుంది. అంటే మనకు వచ్చిన, రావలసిన ఆశీర్వాదాలన్నీ క్రీస్తు నామములో నిశ్చయములై ఉన్నవే అనే కదా అర్ధం.
ఆమెన్ అని ఎందుకు అనాలో తెలుసుకుందాం!
యేసు అనగా రక్షకుడు అని అర్ధం. మనల్ని మన పాపాలనుండి, శాపాలనుండి రక్షించువాడు ఆయనే. మనం మన ప్రార్ధనలో చివరిగా యేసు నామములో ప్రార్ధిస్తున్నాము అని అనగానే మన యొక్క పాపాలు, శాపాలు, రోగాలు తొలగిపోతున్నాయంటే అదంతా కేవలం దేవుని మహా కృపే. పాప రహితుడైన ఆయన నామానికి గల శక్తి. మనం మన మిత్రులకొరకు, కుటుంబ సభ్యులకొరకు, సంఘము కొరకు, దేశము కొరకు, సమస్త మానవాళి కొరకు ప్రార్ధిస్తూ ఆయా ఇబ్బందులనుండి విడుదల పొందుకొంటున్నామంటే అది కేవలం దేవుని మహిమార్థమే జరుగుతుంది.
మనం ఎప్పుడు ఎక్కడ ప్రార్ధన చేసినా.. యేసయ్య మనతో పాటు అక్కడ ఉన్నట్టే. మనతో పాటుగా వుండి మన ప్రార్ధనా విన్నపాలు విని అంగీకారయుక్తమైన మన ప్రార్ధనను ఆలకించి ఆమెన్ అని అనినట్టే కదా!
బాలుడైన దావీదు గొల్యాతును ఎదుర్కొనబోయే ముందు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని నామములో పోరాడటానికి వెళ్ళాడు. కాబట్టే చిన్నవాడైన దావీదు ఆజానుబాహుడు బహుపరాక్రమవంతుడైన గొల్యాతును అవలీలగా మట్టి కరిపించాడు.
అంతేకాదు, ఆనాడు సమాజమందిరపు అధికారి అయిన యాయీరు, యేసయ్య తప్పక తన ప్రార్ధన ఆలకిస్తాడనే గొప్ప విశ్వాసంతో ఆమెన్ అని ప్రార్ధించి తండ్రి మహా కృపను బట్టి తన పాపను బ్రతికించుకున్నాడు. అదేవిధంగా షూనేమీయురాలు కూడా అదే విశ్వాసంతో ఎలీషా ప్రవక్త ద్వారా ఆమెన్ అంటూ తన బిడ్డను తిరిగి బ్రతికించుకోగలిగింది. అంటే తల్లితండ్రులు, పెద్దలు కూడా గొప్ప విశ్వాసంతో తమ బిడ్డలా పక్షాన నిలబడి ఆమెన్ అని తండ్రిని ప్రార్ధించాలి.
తీవ్ర రక్తస్రావం కలిగిన స్త్రీ ఎలాగైతే గొప్ప విశ్వాసంతో యేసయ్య అంగీ అంచును తాకి స్వస్థతను పొందుకుందో, అదే విశ్వాసంతో మనమూ.. మన పక్షాన, పిల్లల పక్షాన క్రీస్తునందు నమ్మికతో ప్రార్ధించి మనకు కావలసిన వాటిని గురించి తండ్రిని ప్రార్ధిస్తూ.. నీ చిత్తమైతే మేము కోరుకున్నవాటిని ఫలింపచేయమని వేడుకుంటూ .. ప్రార్ధన ముగింపులో ఆమెన్ అని ప్రార్ధిస్తే ఆ ప్రార్ధన తప్పక ఫలిస్తుంది, మన కుటుంబాలు కూడా యేసుక్రీస్తులో గొప్పగా ఫలిస్తాయి.
ఆమెన్ అనే మాటలో ఎంత గొప్ప శక్తి దాగివుందో చూసారా? మనం చేసే ప్రార్ధనలో నమ్మిక, పొందుకోగలమన్న విశ్వాసం గనుక మనకుంటే ఆమెన్ అని అనడానికి మన తండ్రి నిరంతరం సిద్దంగానే ఉన్నాడు. నీకొరకు నాకొరకు ఏనాడో ఆయన తన ప్రణాళికను రచించాడు, మంచి భవిష్యత్తును సిద్ధపరచాడు. మరి ప్రార్ధించి పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేదే ప్రశ్న. ఆలోచించు, నమ్మికతో ప్రార్ధించు, పొందుకోవడానికి సిద్దపడు. ఆమెన్ అని అనడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు, ఆమెన్.
ఈ వీడియోని చూడటానికి ఈ లింకుని క్లిక్ చెయ్యండి
Clik link here: ఆమేన్ అంటే!? - AMEN STORY
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.
April 03, 2019
WOMAN, BE HOLD YOUR SON || 7 WORDS ON THE CROSS || UNBELIEVABLE BIBLE FACTS
యేసు క్రీస్తు తన అమ్మను అలా ఎందుకు పిలిచాడు !?
SEVEN WORDS ON THE CROSS
భాష ఏదైనా అమ్మను మనం పిలిచే పిలుపులో ఎంతో ప్రేమ, మాధుర్యం దాగి ఉంటాయి. ఏ బిడ్డ అయినా అమ్మను అమ్మ అనే పిలుస్తాడు. అనుకోకుండా ఎదురైన ఆపదలో సైతం ప్రతి ఒక్కరు అమ్మనే స్మరించుకుంటారు. కానీ అమ్మను అమ్మ అని కాకుండా స్త్రీ అని కానీ, మహిళా అనికానీ మనం పిలువగలమా? అంతటి కఠిన హృదయాన్ని ఎవరైనా కలిగి ఉంటారా? కనీసం అలాంటి సందర్భాలనైనా మనం ఊహించగలమా...?
ఊహించాలి తప్పదు..! ఎందుకంటే సాక్షాత్తుగా ఆ దేవాదిదేవుడే ఈ ఇలలో కారణభూతునిగా జన్మించడానికి ఒక ధన్యజీవిని ఎన్నుకున్నాడు. ఆమె ద్వారా ఏ పాపమూ అంటకుండా ఈ భూమిపై జన్మించాడు, సకల జగత్తుకు రక్షణ భాగ్యాన్ని అందించాడు.
లోకానికి ప్రేమించడం నేర్పిన ఆ కరుణామయుడే సాక్షాత్తు తన తల్లిని అమ్మ అని కాక పరాయి స్త్రీని పిలిచినట్లుగా స్త్రీ అని పిలవడమేమిటి? అవును..! తెలుగు తమిళ మలయాళం వంటి ప్రాంతీయ భాషల్లో యేసుక్రీస్తు తల్లి మరియను అమ్మా అని సంబోధించినట్లుగా బైబిల్లో చూస్తాము. కానీ మూలభాష నుండి తర్జుమా చేయబడిన ఇంగ్లీష్ బైబిల్లో మాత్రం మరియను స్త్రీ లేదా ఇంగ్లీష్ లో woman అని పిలిచినట్లుగా చూస్తాము. అంటే ప్రాంతీయ భాషల్లో ఉన్నట్లుగా అమ్మా అని కాక యేసుక్రీస్తు తన తల్లి అయిన మరియను స్త్రీ అని సంబోధించాడు. అన్నీ ఎరిగిన ఆ దేవాదిదేవుడే తన తల్లిని అలా ఎందుకు పిలిచాడు? చాలా లోతుగా ఆలోచించవలసిన ప్రశ్న ఇది!
తన మూడున్నర ఏళ్ళ పరిచర్యతో మొత్తం ప్రపంచానికి క్రైస్తవాన్ని, అందులో ఇమిడియున్న ప్రేమను పంచిన ఆ పరమ పునీతునికి ఆ మాత్రం తెలియదా? మహా పండితులను సైతం 12 ఏళ్లకే తన జ్ఞానంతో అలరించిన ఆ దైవకుమారునికి తన తల్లిని ఎలా సంబోధించాలో ఒకరు చెప్పాలా? మరి ఎందుకు అలా అమ్మను అమ్మా అని పిలువక.. ఎవరో బయటవారిని పిలిచినట్లు స్త్రీ అంటూ సంబోధించాడు! ఈ విషయాన్ని గురించి కాస్త లోతుగా చర్చిద్దాం.
పరిశుద్ధ గ్రంధంలో యేసుక్రీస్తు రెండు సందర్భాలలో తన తల్లి మరియను స్త్రీ లేదా woman అని సంబోధించడం మన చూస్తాం. మొదటి సందర్భం కానా విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు కాగా, రెండవసారి సిలువమ్రానుపై వేదన అనుభవిస్తూ అక్కడే ఉన్న యోహానును తన తల్లి మరియ బాధ్యతను అప్పగిస్తూ ఈ విధంగా సంబోధిస్తాడు.
యేసుక్రీస్తు తన ఆధ్యాత్మిక జీవితకాలంలో కుటుంబ వ్యవహారాలకు, కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలకు అతీతంగానే ఉన్నట్లుగా మనకు కనిపిస్తాడు. ఆయన జీవితంలోని కొన్ని సందర్భాలను గనుక మనం పరిశీలిస్తే
ఒకసారి యేసుక్రీస్తు కొంతమంది జనులతో కలిసిఉన్నప్పుడు తల్లి ఐన మరియ ఇంకా ఆయన సోదరులు క్రీస్తును కలవడానికి వస్తారు. ఈ విషయాన్ని ఆయన శిష్యులు వచ్చి యేసు చెబుతారు. అందుకు ఆయన నా తల్లి, సహోదరులు ఎవరు? ఇదిగో నా తల్లి సహోదరులు అంటూ తన చుట్టూ కూర్చున్న వారిని చూయిస్తాడు. అంటే యేసుక్రీస్తు భౌతికమైన బాంధవ్యాలకంటే తండ్రి తనకు అప్పగించిన ఏ పనిమీద ఐతే వచ్చాడో.. ఆ పనికి సంబంధించిన ఆత్మీయ, దైవికమైన సంబంధాలపైనే ఆయన తన దృష్టిని నిలిపాడని మనం అనుకోవాలి.
అదేవిధంగా యేసు 12 ఏళ్ళ ప్రాయంలో పస్కా పండుగ నాడు మరియ దంపతులు యేసును తీసుకుని యెరూషలేము దేవాలయానికి వస్తారు. కానీ తిరిగి వెళ్లేప్పుడు యేసుక్రీస్తు తమతో తిరిగి రాకపోవడం గమనించిన ఆ దంపతులు తిరిగి దేవాలయానికి వచ్చి యేసును గురించి వెదుకుతారు. అక్కడ వేద పండితులతో యేసు దైవికమైన అంశాలను చర్చిస్తూ వారికి కనిపిస్తాడు. యేసు కనిపించక కంగారుపడుతున్న తన తల్లి తండ్రులతో యేసు మీరెలా నన్ను వెదుకుచున్నారు? నేను నాతండ్రి పనులమీద ఉండవలెనని మీరెరుగరా అని ఆ దంపతులతో ఖరాఖండిగా చెప్పడం మనం లూకా గ్రంధము 2:41:49 వచనాలలో చూడవచ్చు.
అంతేకాక లూకా గ్రంధము 14: 26 వ వచనంలో ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని అంటాడు. 27 వ వచనంలో ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు అని కూడా చాలా స్పష్టంగా చెబుతాడు.
అంటే శిష్యులుగా తనను వెంబడింపదలచిన వారు అన్ని బంధకాలను త్రెంచుకొని ఆయన బిడ్డలుగా తండ్రిని చేరుకోవాలి అని ఈ వచనాల్లో మనకు చాలా సూటిగా చెబుతున్నాడు. ఈ రెండు వచనాలు ప్రకారం ప్రభువు మనకు చెప్పేది మనల్ని మన తల్లితండ్రులకు బంధువులకు భార్యా బిడ్డలకు దూరంగా ఉండమని కాదు, అంతకంటే మిన్నగా దేవునియందు మన దృష్టిని లగ్నం చేయాలని ఆయన ఉద్దేశ్యమై ఉండవచ్చు.
ఇక అసలు విషయానికి వస్తే జన్మనిచ్చిన అమ్మను అమ్మ అని అనడంలో ఇవేమి అడ్డుకాదు కదా! అమ్మను అమ్మా అని పిలవడంతో ఇబ్బంది ఏముంది? అనే ప్రశ్న మనలో తప్పక తలెత్తుతుంది.
ఇందుకు సమాధానం మనం చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు అందరిలా పాపములో జన్మించలేదు.ఆయన పుట్టుకకు కన్య మరియను ఒక పాత్రనుగా ఆ తండ్రి తయారుచేసుకున్నాడు. ఈ లోకంలోని ప్రతివారినీ జన్మించక మునుపే ఆయన ఎరిగియున్న రీతిగా మరియను కూడా ఆమె పుట్టకమునుపే ఆయన ఎరిగియున్నాడు. ఆమెను కూడా తన అరచేతులపై చెక్కుకుని యున్నాడు. మరియ యేసుకు ఈ లోకంలో జన్మనీయక మునుపే యేసయ్య మరియకు తండ్రియై జన్మనిచ్చాడు.
అంతేకాక పుట్టుకతో మనమందరమూ పాపులమే, యేసయ్యకు జన్మనిచ్చిన మరియతో సహా. కానీ క్రీస్తు మహా పరిశుద్ధుడు, ఏ పాపమూ అంటని వాడు, కాబట్టే ఆయన తన తల్లిని అమ్మా అని సంబోధించి ఉండకపోవడానికి అది కూడా ఒక కారణం కావచ్చు.
అలాగే క్రీస్తు మరియను స్త్రీ లేదా woman అని పిలవడాన్ని గురించి బైబిల్ పండితులు మరో వాదన కూడా చేస్తారు, అదేంటంటే ఆదికాండము 3:15 లో తెలిపిన విధంగా నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను, అది నిన్ను తలమీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. ఈ వాక్యాన్ని అనుసరించి దేవుడు సృష్టించిన మొదటి స్త్రీ (woman) అవ్వ కాగా దేవునిచే ఎన్నుకోబడి, ఈ భూమ్మీద సాతాను తలమీద కొట్టి తనకు పుట్టబోయే మహాదేవుని ద్వారా ఈ సకల మానవాళికి రక్షణ అందించిన ఆ మాతృమూర్తిని నూతన స్త్రీ (new woman) గా ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికే యేసయ్య తన తల్లిని స్త్రీ అని సంబోధించి ఎనలేని గౌరవాన్ని అందించాడని అంటారు.
చివరిగా తన ప్రియ శిష్యుడైన యోహానుతో ఇదిగో నీ తల్లి అని చెప్పిన విధానాన్ని బట్టి మరియ కేవలం తనకు మాత్రమే తల్లి కాదు, నీకూ తల్లే.. అదేవిధంగా తనను ప్రేమించి ఆరాధించే ఈ సకల మానవాళికీ మరియ మాతృమూర్తి అని పరిచయం చేసి తాను పలికిన చివరి ఏడు మాటల్లో ఒక మాటగా ఆ తల్లికి క్రైస్తవ ప్రపంచంలో సుస్థిర స్థానాన్ని అందించాడు. నిరంతరం ఓ ప్రేమామయిగా, మాతృమూర్తిగా మన మనస్సులో నిలిచి ఉండేలా మన హృదయాల్లో చెరగని ముద్రను వేసాడు కరుణామయుడైన ఆ పరమతండ్రి. ఆమెన్.
ఈ వీడియోని చూడటానికి ఈ లింకుని క్లిక్ చెయ్యండి
Clik link here: యేసు క్రీస్తు తన అమ్మను అలా ఎందుకు పిలిచాడు !?
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.
March 30, 2019
క్రీస్తుద్వారా విమోచన పొందిన గాడిదపిల్ల
గాడిదలా జీవించు...
పరిశుద్ధ గ్రంధం చెబుతున్న అద్భుతకరమైన 3 విషయాలు
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.
పరిశుద్ధ గ్రంధం చెబుతున్న అద్భుతకరమైన 3 విషయాలు
బైబిల్లో చాలా సందర్భాలలో గాడిదకు సంబందించిన ప్రస్తావన వస్తుంది. దేవుడు తన పరిశుద్ధ గ్రంధములో గాడిదకు, గాడిదపిల్లకు ప్రత్యేకమైన స్థానాన్ని అనుగ్రహించాడు అని చెప్పవచ్చు.
దావీదుకు ఆహారాన్ని మోసినా, కరువుకాలంలో యేసేపు తన తండ్రి కుటుంబానికి మూటలకొద్దీ ధాన్యాన్ని ఐగుప్తునుండి తరలించినా, యెహోవా దేవుని దూతనుచూచి బిలామును హెచ్చరించినా, ఇవన్నీ గాడిదకు మాత్రమే సాధ్యపడ్డాయి.
అంతేకాదు గాడిద పచ్చి దవడ ఎముకతో ఆనాడు సమ్సోను వెయ్యిమందిని అవలీలగా అంతమొందించాడంటే అది ఎవరికీ సాధ్యం? అలాగే దావీదు, ఆయన కుమారుడైన సాలొమోను ఇంకా అనేకమంది ప్రవక్తలు గుర్రాలను కాకుండా గాడిదలనే తమ వాహనాలుగా ఎంచుకున్నట్టుగా బైబిల్లో మనం చూడవచ్చు. ఇంకా చెప్పాలంటే పరమ పునీతుడు, పదివేలమందిలో అతిసుందరుడైన మన యేసుక్రీస్తు నాడు యెరూషలేము దేవాలయానికి గాడిదపిల్లను అధిరోహించి వచ్చాడూ అంటే మనకు ఈపాటికే అర్ధం అయ్యే ఉంటుంది గాడిదకు మన తండ్రి ఎంతటి ప్రాధాన్యతను ఇచ్చాడో.
ఇంకా లోతుగా పరిశీలిస్తే బైబిల్లో ప్రకటించబడిన దేవుని వాక్కును ఒకవైపు ప్రవక్తల ద్వారా, మరోవైపు ప్రవక్తల ప్రవచనాల ద్వారా లోకానికి అందించడంలో గాడిదపిల్ల దేవుని ప్రతినిధిగా వ్యవహరించిందని భావించవచ్చు.
అంతటి వైవిధ్యం కలిగిన గాడిదపిల్లను గురించి, దాని గొప్పదనాన్ని వివరించే ఆయా సందర్భాలకు సంబందించిన 3 ముఖ్యమైన విషయాలను మనమిప్పుడు ధ్యానించుకుందాం.
1 గాడిద దేవునిద్వారా విమోచించబడినది.
ప్రతి గాడిద తొలిపిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలెను. నిర్గమకాండము 13:13. మోషే ధర్మశాస్త్రం ప్రకారం మొదట జన్మించిన దూడను గానీ, గొర్రెపిల్లను గానీ యెహోవా దేవునికి సమర్పించవలసి ఉంది. కానీ గాడిదపిల్ల మాత్రం దానికి ప్రతిగా గొర్రెపిల్లను దేవునికి సమర్పించుకుని విమోచింపబడింది.
ప్రతి తొలిచూలు పిల్లయు నాది, నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగాడి దూడయే గానీ గొర్రెపిల్లయే గాని అది నాదగును. గొర్రెపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపించవలెను. దాని విమోచింపని యెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలిచూలువాని విడిపింపవలెను. నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు నిర్గమకాండము 34:19-20. ఈ వాక్యం తేటతెల్లంగా మనకు చెప్పేది ఏమిటంటే గాడిదపిల్ల దేవునిద్వారా విమోచించబడింది అని. ఒకవేళ గాడిదపిల్ల బదులుగా గొర్రెపిల్లను సమర్పించడం ద్వారా గాడిద విమోచింపబడనట్లైతే, గాడిదపిల్లకు ఈ భూమ్మీద జీవించడానికి సాధ్యపడేది కాదు, ఎందుకంటే యేసయ్య దేవుని గొర్రెపిల్ల అని పరిశుద్ధగ్రంధమే చెబుతుంది కాబట్టి (యోహాను సువార్త 1:35-37). కాబట్టి గాడిదను పోలి జీవించుటలో మనం ఏ మాత్రం సిగ్గుపడాల్సిన పనిలేదు. ఎందుకంటే మన ప్రభువైన క్రీస్తుద్వారా మనకు శాశ్వతమైన విమోచనము లభించింది కాబట్టి (ఎఫెసీ 1 :7 , ప్రకటన గ్రంధము 21:27).
2. గాడిద వివేకము కలిగిన ప్రాణి
సంఖ్యాకాండము 22:21-34 వ వచనం వరకు మనం గమనిస్తే ప్రవక్త అయిన బిలాము గ్రహించలేని దానిని ఓ గాడిద గ్రహిస్తుంది. బిలాము చూడలేని దానిని గాడిద చూడగలుగుతుంది. దేవుని దూతను చూడలేని బిలాము గాడిదను అడ్డుకుంటున్నా.. కొడుతున్నా కూడా ఆ గాడిద యెహోవా దూతను చూచి తాను నడుస్తున్న త్రోవను విడిచి పొలాల్లోకి తీసుకువెళుతుంది, చివరకు ప్రాణాలు తీయడానికి ఎదురు నిలిచిన దేవుని దూత ఖడ్గపు బారినుండి బిలామును రక్షించి కాపాడగలుగుతుంది.
అదేవిధంగా 2 పేతురు 2 :16 వచనంలో తెలిపినట్లు గాడిద నోరులేని ప్రాణి అయినా కూడా బిలాముకంటే వివేకము కలిగి వ్యవహరించిందని పేతురు ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో గాడిదను పోలి వివేకంతో జీవించాలి. బిలామును గాడిద ఏ విధంగానైతే హెచ్చరించిందో అదే రీతిగా మనమూ ఈ లోకములో క్రీస్తును ఎరుగని వారికి ఆయన ప్రేమను గురించి, ఆయన అందించే రక్షణ గురించి తెలియచేయాలి. తెలియచేయడం మన బాధ్యత, వింటారో లేదో అది వారి సమస్య. మనం తెలిసీ యేసయ్యను గురించి ప్రకటించకపోవడం మన తప్పు అవుతుంది అని గ్రహించాలి.
దీనికి సంబంధించి పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 2:6-10 వచనాల్లో మన భాద్యతను గురించి చక్కగా వివరించాడు.
3 గాడిద పిల్ల యేసయ్యను మోసి బహు ధన్యతను పొందినది.
సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును, దీనుడునై, గాడిదపిల్లను ఎక్కి నీ యొద్దకు
వచ్చుచున్నాడు. జెకర్యా 9:9. మట్టల ఆదివారం నాడు గాడిదపిల్లను ఎక్కి ప్రజల జయజయధ్వానాల మధ్య యేసుక్రీస్తు యెరూషలేము నగర ప్రవేశం చేస్తాడు. ఆనాడు అలా యేసయ్యను తనపై ఎక్కించుకుని మోయడం ద్వారా గాడిదపిల్ల ఎనలేని గౌరవాన్ని సంపాదించుకుంది.
అందుకే పౌలు మనల్ని ఉత్తేజితులను చేస్తూ రోమా పత్రిక 12:1-2 లో ఇలా అంటున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి రోమా పత్రిక 12:1-2.
చూసారా, మనం దేనికి పనికిరాని వాళ్ళను గాడిదా అని సంబోధిస్తాము, కానీ అదే గాడిదకు పరిశుద్ధ గ్రంధములో మన తండ్రి ఎంతటి గొప్ప స్థానాన్ని ఇచ్చాడో చూడండి. అందుకే మన ఆలోచనలు వేరు, తండ్రి ఆలోచనలు వేరు, మన చిత్తం వేరు ఆయన చిత్తం వేరు. ఆనాడు గాడిదపిల్లను విమోచించడానికి గొర్రెపిల్లను బలి ఇచ్చారు. ఆ తరువాత గాడిదపిల్లల వంటి మనకొరకు యేసయ్య గొర్రెపిల్లగా తనకు తానుగా బలిపశువుగా మారి మనకు శాశ్వత విమోచనము అందించాడు. విమోచింపబడిన మనం ఆయన కృపను మరువక దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయనకు మోసి.. ఈ లోకానికి దేవునివాక్కును, ఆయన అందించిన ప్రేమను పంచి సకల లోక రక్షణకు పాటుపడదాం. ఆమెన్.
ఈ వీడియోని చూడటానికి ఈ లింకుని క్లిక్ చెయ్యండి
Clik link here: క్రీస్తుద్వారా విమోచన పొందిన గాడిదపిల్ల
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.
March 26, 2019
యేసుక్రీస్తు బ్రతికించిన ఆ ముగ్గురు ఎవరు ? || JESUS CHRIST RAISED THE DE...
యేసుక్రీస్తు బ్రతికించిన ఆ ముగ్గురు ఎవరు???
యేసుక్రీస్తు తన మూడున్నరయేళ్ల పరిచర్యలో భాగంగా ఈ భూమ్మీద ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసాడు. స్వస్థతలను అనుగ్రహించాడు, సుమారు 40 కి పైగా అద్భుతకార్యాలు చేసాడని సువార్తలు చెబుతుండగా అంతకుమించి సువార్తల్లో పొందుపరచని మరెన్నో గొప్ప ఆశ్చర్యకార్యాలు యేసుక్రీస్తు చేసాడని యోహాను సువార్తికుడు తన సువార్తలో పేర్కొన్నాడు. ఆయన చేసిన ఆశ్చర్యకార్యల్లో గొప్ప అద్భుతం చనిపోయినవారిని బ్రతికించడం. మరణించిన ముగ్గురిని క్రీస్తు బ్రతికించగా అందులో ఇద్దరినీ చనిపోయిన వెంటనే వెళ్లి బ్రతికించాడు, మరొకర్ని చనిపోయిన నాలుగు రోజుల తరువాత కుళ్లిపోతూ దుర్గంధభరితమైన పరిస్థితిలో యేసు ఆ శవానికి కన్నీటితో ప్రార్ధించి ప్రాణం పోశాడు.
1 యాయీరు కుమార్తెను బ్రతికించాడు.
సమాజ మందిరపు అధికారి అయినా యాయీరు తన కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది, వచ్చి కాపాడమని క్రీస్తును ప్రాధేయపడతాడు. అతని విన్నపాన్ని అంగీకరించిన యేసు యాయీరు ఇంటికి బయలుదేరి వెళతాడు. ఆ మార్గమధ్యం లోనే రక్తస్రావం వ్యాధితో బాధపడుతున్న స్త్రీ యేసు అంగీని తాకి స్వస్థతను పొందుకుంటుంది. ఈలోగా యాయీరు ఇంటికి వెళ్లే దారిలో ఉండగానే ఆ అధికారి కూతురు చనిపోయిందని కబురు వస్తుంది, యేసు భయపడక నమ్మిక మాత్రము ఉంచుము ( మార్కు సువార్త 5:36) అంటూ అతని ఇంటికి వెళ్లి రోదిస్తున్న వారి కుటుంబాన్ని చూచి చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని పలికి..ఆ చిన్నదాని చెయ్యిపెట్టి చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను అని అనగానే పన్నెండు సంవత్సరాల ఆ చిన్నది లేచి నడుస్తుంది. ఇది చనిపోయిన వారిని యేసు బ్రతికించిన మొదటి కార్యము (మార్కు సువార్త 5:22-43, మత్తయి సువార్త 9:18-26 , లూకా సువార్త 8:40-56)
2 విధవరాలి ఒక్కగానొక్క కుమారుడుని బ్రతికించడం
తాబోరు పర్వత సమీపంలోని నాయిని అనే ఊరిలో ఓ విధవరాలు నివసిస్తూ ఉంటుంది, ఒకరోజు ఆ విధవరాలి కుమారుడు చనిపోతాడు. ఆ ఉరి ప్రజలు అతనిని తీసుకుని సమాధి కార్యక్రమాలు నిర్వహించడానికి మోసుకుపోతుండగా యేసుక్రీస్తు అప్పుడే ఆ గ్రామంలోకి ప్రవేశిస్తాడు. వేదనకరంగా రోదిస్తున్న అతని తల్లిని చూచిన యేసు ఆమెపై కనికరపడి ఏడువవద్దని ఆ విధవరాలుని ఓదారుస్తాడు. పాడెను మోస్తున్న వారిని ఆపి, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అని అనగానే ఆ చిన్నవాడు పాడెపై నుండి లేచి కూర్చుని మాట్లాడటం మొదలుపెడతాడు (లూకా సువార్త 7:11-15) ఇది చనిపోయిన వారిని బ్రతికించడంలో యేసు చేసిన రెండవ అద్భుతకార్యం.
3 మరియ మార్తల సహోదరుడైన లాజరును బ్రతికించడం
లాజరు బేతనియాకు చెందిన మరియ మార్తల సహోదరుడు. యేసుక్రీస్తుకు ఎంతో ఇష్టమైనవాడు. లాజరు రోగగ్రస్తుడై చనిపోయిన నాలుగు రోజుల తరువాత యేసు బేతనియా గ్రామం చేరుకుంటాడు. మరియ, మార్త ఇంకా యెరూషలేము, బేతనియా గ్రామాల ప్రజలు వీరితో పాటు యేసు అందరూ కలిసి లాజరు సమాధి దగ్గరకు చేరుకుంటారు. సమాధికి అడ్డుగా ఉన్న రాతిని తొలగించగా భయంకరమైన దుర్గంధం వ్యాపిస్తుంది. యేసు సమాధి ముందర కూర్చుని కన్నీళ్లు విడిచి కన్నులు పైకెత్తి తండ్రిని ప్రార్ధిస్తాడు. ఆపై లాజరూ బయటకు రమ్మని బిగ్గరకా కేక వేస్తాడు. ఆ మాటతో చనిపోయి నాలుగు రోజులక్రితం సమాధి చేయబడిన లాజరూ కాళ్లకు చేతులకు ప్రేత వస్త్రాలు, ముఖానికి రుమాలుతో బయటకు వస్తాడు. యేసు అక్కడ ఉన్న వారితో మీరు అతని కట్లు విప్పి పోనియ్యుడని చెబుతాడు. చనిపోయిన లాజరు బ్రతకడం చూచిన యూదులలో అనేకమంది యేసుక్రీస్తునందు విశ్వాసముంచుతారు.
యేసు తాను సిలువపై మరణించి పునరుత్తానుడయ్యే ముందు చేసిన చివరి అద్భుతకార్యము లాజరును మృత్యువు బారినుండి బ్రతికించడం.
నమ్ముట నీవలనైతే సమస్తమూ సాధ్యమే అన్న మన తండ్రి మాటలను విశ్వసించగలిగితే తప్పక మనమూ మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుతకార్యాలు చూడగలుగుతాము, ఆమెన్.
ఈ వీడియోని చూడటానికి ఈ లింకుని క్లిక్ చెయ్యండి
Clik link here: యేసుక్రీస్తు బ్రతికించిన ఆ ముగ్గురు ఎవరు ?
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.
March 22, 2019
Jesus Fourth Word on the Cross - Eli, Eli, lema sabachthani -
నాదేవా.. నా దేవా.. నన్నెందుకు చెయ్యి విడిచావు
యేసుక్రీస్తు సిలువలో పలికిన నాల్గవ మాట
Jesus Christ Seven Words on the Cross
ఈ వీడియోని చూడటానికి ఈ లింకుని క్లిక్ చెయ్యండి
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.
యేసుక్రీస్తు సిలువలో పలికిన నాల్గవ మాట
Jesus Christ Seven Words on the Cross
యేసుక్రీస్తు తాను సిలువలో మరణించే ముందు పలికిన ఏడు మాటలు గురించి తెలియని క్రైస్తవులు ఉండరు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ దినాలలో ఈ వాక్యాలు మీదే మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం, ధ్యానించుకుంటాం. ఈ ఏడు మాటల్లో ఒకటైన నాల్గవ మాటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదేమిటో.. అందులో ఉన్న మర్మమేమిటో మనమిప్పుడు తెలుసుకుందాం.
నాదేవా.. నా దేవా.. నన్నెందుకు చెయ్యి విడిచావు. మత్తయి సువార్త 27:46
మనకు ఒకింత ఆశ్చర్యం, ఆందోళన కలిగించే మాట ఇది. రోమన్ సైనికులు యేసును బంధించి, ఘోరాతి ఘోరంగా హింసించి ఆపై ఆయనను చంపడానికి సిలువ మ్రానుపై వ్రేలాడదీసిన ఆ శుక్రవారం రోజు.. యేసు సిలువలో మరణవేదన పొందుతూ ఏలి.. ఏలి.. లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేస్తాడు. ఆ మాటకు నాదేవా.. నా దేవా.. నన్నెందుకు చెయ్యి విడిచావు అని అర్ధం. దీనినే మనం సిలువలో నాల్గవ మాటగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము (మత్తయి సువార్త 27:46 ).
క్రీస్తు జన్మించక మునుపే ఆయన దేవుని కుమారుడని ఎన్నో లేఖనాలు వ్రాయబడ్డాయి. యేసే తాను దేవుని కుమారుడనని శిష్యులతో పలుమార్లు ప్రస్తావిస్తాడు కూడా. మరి దేవుని కుమారుడైన యేసు ఓ మామూలు మనిషిలా అలా ఎందుకు తన తండ్రిని నన్నెందుకు చెయ్యి విడిచావు అని ప్రశ్నించాడు?
అంతేకాక యూదా ఇస్కరియోతు ద్వారా తనను బంధించి, మరణశిక్ష విధించి చంపుతారని యేసుకు ముందే తెలుసు, తాను చావుకు ఏమాత్రం భయపడకుండా తనకోసం వెదుకుతున్న సైనికులకు తానె ఎదురెళ్లి మరీ మీరు వెదుకుతున్న యేసును నేనే అని చెప్తాడు. ఇంత తెలిసిన యేసుక్రీస్తు ప్రభువు దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని తన తండ్రిని ప్రశ్నించాడు. ఇందులో ఉన్న మర్మం ఏమిటి? ఇంత లోతైన విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి.. అప్పుడు మన విశ్వాసం మరింతగా బలపడుతుంది..
యేసు ప్రభువు జీవించిన ఆ కాలంలో ఇశ్రాయేలీయులు హెబ్రీ అరామిక్ భాషలను మాట్లాడేవారు. ఈ ఏలి ఏలి లామా సబక్తానీ అనే వాక్యంలో ఏలి అనే పదం హెబ్రీ భాషకు చెందినది అయితే... లామా సబక్తానీ అనే పదం అరామిక్ భాషకు సంబంధించి పదం.
యేసుక్రీస్తు సిలువలో ఈ మాటలు పలికినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు యేసు ప్రవక్త ఐన ఏలీయాను పిలుస్తున్నాడు కాబోలు అని భావిస్తారు. కానీ ఈ మాటకు గ్రంధకర్తలు నాదేవా.. నా దేవా.. నన్నెందుకు చెయ్యి విడిచావు అని సరియైన అర్ధం మనకు అప్పుడే చెప్పారు.
తన తండ్రి తనకు అప్పగించిన పని పూర్తి చేయడానికే తాను ఈ లోకానికి వచ్చానని యేసుకు తెలుసు, అదేవిధంగా తాను ఎవరినైతే వారి పాపాలనుండి రక్షించి పరిపూర్ణమైన విడుదల అనుగ్రహించాలని తలంచాడో ఆ మనుష్యులే నేడు తనను సిలువ వేసి ఘోరంగా చంపుతారని క్రీస్తుకు తెలుసు, అలాగే ఆయన శిష్యులకూ తెలుసు. కాబట్టి ఆయన సిలువపై వేదన చెందడం అక్కడే ఉన్న ఆయన జనాంగానికి పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు కాబట్టి వారూ కంగారు పడలేదు. కానీ అక్కడే ఉన్న యెరూషలేము పట్టణవాసులు మాత్రం వాస్తవాన్ని తెలుసుకోలేక క్రీస్తు ఏలీయాను పిలుస్తున్నాడు కాబోలు అని అనుకున్నారు.
దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని యేసు ఎందుకు తన తండ్రి ప్రశ్నించి ఉంటాడు? ఎందుకు ఓ సాధారణమైన మామూలు మనిషిలా సిలువపై అంత దీనంగా తన తండ్రిని అర్ధించాడు? ఈ విషయాలను లోతుగా అధ్యయనం చేస్తే యేసు మొదట దేవుని కుమారుడు, కానీ తనకు తానుగా ఈ లోకంలో జన్మించాడు కాబట్టి ఆయన మనుష్య కుమారుడు అయ్యాడు. అంటే యేసుక్రీస్తు పరిపూర్ణమైన దేవుని కుమారుడు, అదేవిధంగా ఆయన ఈ భూమిపై జన్మించడం మూలాన పరిపూర్ణమైన మనుష్య కుమారుడుగా కూడా తనను తానూ మార్చుకున్నాడు.
మత్తయి సువార్తలో మనం యేసు సిలువ మరణం పొందే సందర్భాన్ని ధ్యానం చేస్తుంటే కీర్తనలు 22 వ అధ్యాయం మనకు తప్పక జ్ఞాపకం వస్తుంది. ఒక మనిషి మరణానికి చేరువ అవుతుంటే ఆ వ్యక్తి ఎంతటి ఎంతటి వేదనను అనుభవిస్తాడో క్రీస్తు కూడా ఓ సాధారణ మనిషిలా తనకు తానుగా సిలువలో కష్టాన్నిఅనుభవించాడు, మౌనంగా భరించాడు, అందులోని బాధను తన తండ్రికి విన్నవించాడు.. అలా మనకు ప్రతినిధిలా.. తండ్రికి మనకు మధ్య ఓ వారధిలా ఆ రోజు యేసు సిలువలో మన పక్షాన సాధారణ మనిషిలా నిలిచి శిక్షను అనుభవించి దేవుని కుమారునిలా మరణాన్ని జయించి మూడవ రోజు తిరిగి లేచాడు.
కాబట్టి ఆనాడు సిలువలో క్రీస్తు అనుభవించిన ఆ వేదన ఓ సాధారణ మనిషి అనుభవంలా మాత్రమే మనం పరిగణించాల్సి ఉంటుంది. అదేవిధంగా కీర్తనల గ్రంధంలో చెప్పినట్లు.. 'ఈ భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవా తట్టు చేసెదరు (కీర్తనలు 22:27) అనే వాక్యాన్ని తనకూ ఆపాదించుకుంటూ క్రీస్తు కూడా తన తండ్రి వైపు తిరిగి కన్నులెత్తి రోదించాడు అని భావించాలి.
దీన్ని బట్టి యేసు సిలువలో నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని తన తండ్రిని ప్రశ్నించడంలో ఉన్న పరమార్ధం మీకు ఈపాటికి అర్ధం అయ్యే ఉంటుంది. క్రీస్తు మనకొరకు సిలువలో కన్నీరు కార్చాడు, మనకు సమానార్ధమైన శిక్షను తాను భరించాడు. ఓ మానవ మాత్రునిలా మన స్థానంలో ఉండి మనకొరకు తన తండ్రిని సైతం ప్రశ్నించాడు. మరి ఇంకా మన జీవితాలు మారకుంటే క్రీస్తు సిలువలో కార్చిన రక్తానికి ఫలితమేముంటుంది? ఆయన అనుభవించిన వేదనకు అర్ధం ఏముంటుంది? ఆలోచించండి!
యేసు సిలువలో నాదేవా నన్నెందుకు చేయి విడిచావన్నాడు?
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.
December 15, 2018
నజరేతును గురించి మీరు ఊహించలేని 5 విషయాలు - 5 FACTS ABOUT NAZARETH
నజరేతు గురించి తెలియని ఐదు ముఖ్యమైన విషయాలు
బేత్లెహేము కంటే నజరేతు ప్రాముఖ్యమైనదా ? యెషయి మొద్దు చిగురు నజరేతు పట్టణమా ?
నజరేతు పట్టణం..
బేత్లెహేము కంటే నజరేతు ప్రాముఖ్యమైనదా ? యెషయి మొద్దు చిగురు నజరేతు పట్టణమా ?
నజరేతు పట్టణం..
బేత్లెహేములో జన్మించిన క్రీస్తు నజరేయుడైన క్రీస్తు అని అనిపించుకున్నాడు!
దావీదు వంశస్థులు ఎందరో నజరేతు పట్టణం లో తలదాచుకున్నారు? ఎందుకు?
యేసు క్రీస్తును తనవారి నజరేతులో చంపాలని శతవిధాలా ప్రయత్నించారు?
గాబ్రియేలు అనబడే దేవుని దూత కన్య అయిన మరియకు కనిపించి యేసుక్రీస్తు జననం గురించి ఆమెకు తెలియజేసింది ఈ నజరేతు పట్టణంలోనే. పరిశుద్ధ గ్రంధములో బేత్లెహేముకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో.. నజరేతుకు కూడా అంటే ప్రాముఖ్యత ఉంది. అందుకే యేసు ఆనాడు నజరేతువాడు అని పిలిపించుకున్నాడు. అంతటి ప్రాధాన్యత నజరేతుకు ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ ఐదు విషయాలను మనం తప్పక తెలుసుకోవాలి.
1 నజరేతు పట్టణం క్రీస్తు జన్మించే నాటికే పేరొందిన చిన్న పట్టణం
క్రీస్తు జన్మించే నాటికి సుమారు 120 నుండి 150 మంది ప్రజలు నజరేతు పట్టణంలో నివసిస్తూ ఉండేవారని పురావస్తు శాఖ వారి అంచనా. అందుకే యోహాను సువార్త మొదటి అధ్యాయం 46 వ వచనంలో ఫిలిప్పుతో నతానియేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని తన సందేహాన్ని బయటపెడతాడు.
అతని సందేహాన్ని మనం అంత సులభంగా కొట్టేయ్యలేము, ఎందుకంటే నజరేతు వ్యవసాయం మీద ఆధారపడ్డ చిన్న పట్టణం. కొండ అంచులమీద కొద్దిపాటి కుటుంబాలతో నిర్మించబడ్డ గ్రామం. ఆనాడు ఇశ్రాయేలు దేశంలో ప్రసిద్ధి చెందిన వర్తక వ్యాపార కేంద్రాలకు ఎంతో దూరంగా విసిరేయబడినట్టు ఉండేది ఈ నజరేతు గ్రామం. అంతే కాదు... తమను పాలించబోయే మెస్సీయ త్వరలో వస్తాడని భావించే ఇశ్రాయేలు ప్రజలు ఆయన నజరేతునుండి వస్తాడని కలలో కూడా ఊహించలేని చిన్న పట్టణం నజరేతు. అందుకే ఆరోజు నతానియేలు ఫిలిప్పుని అలా ప్రశ్నించాడు.
2 మెస్సీయ నజరేతు నుండే రానున్నాడని యేసు పుట్టడానికి 600 యేళ్లముందే యెషయా ప్రవక్త ప్రవచించాడు.
యెషయా గ్రంధం 11 వ అధ్యాయం 1 వ వచనంలో యెష్షయి మొద్దునుండే చిగురు పుట్టును, వాని అంకురము ఎదిగి ఫలించును అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. హిబ్రు భాషలో నట్జర్ ఆంటే కొమ్మ లేదా చిగురు అని అర్ధం. ఈ నట్జర్ అనే పదం నుండే నజరేతు అనే పదం వచ్చిందని చరిత్రకారులు భావిస్తారు. మరికొంత మంది ఈ నజరేతు పట్టణాన్ని మరొక పట్టణానికి కొమ్మగా.. లేదా చిగురుగా భావిస్తారు. ఆంటే దావీదు వంశం ఉద్భవించిన బేత్లెహేము కాలానుగుణ మార్పులతో మొద్దుగా మారగా ఆ మొద్దు నుండి ఉద్భవించిన చిగురు ఈ నజరేతు పట్టణం చరిత్రకారుల అభిప్రాయం అని మనం భావించవచ్చు.
మత్తయి సువార్తికుడు యెషయా గ్రంధములోని 11 వ అధ్యాయం మొదటి వచనాన్ని గుర్తుచేస్తూ .. మత్తయి సువార్త 2 వ అధ్యాయం 23 వ వచనంలో యోహాను మరియలు గలిలయ ప్రాంతములకు వెళ్లి, నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన (యేసు) నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను అని యెషయా గ్రంధ ప్రవచన నెరవేర్పును ఉదాహరిస్తాడు.
3 ఆనాడు నజరేతులో నివాసముండే వారందరూ రాజకుటుంబానికి చెందినవారే.
పాత నిబంధనా గ్రంధములోని చరిత్రను గమనిస్తే.. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా బాబిలోనుకు తీసుకువెళ్లిన తరువాత క్రి.పూ 538 లో పర్షియా రాజైన కోరెషు యూదులను తిరిగి తమ స్వదేశమైన యూదయ తిరిగి రావడానికి అనుమతిని ఇస్తాడు. ఆ క్రమంలో యూదులు బాబిలోను నుండి యూదయ దేశం తిరిగి రావడం ప్రారంభిస్తారు. అయితే అప్పుడు ప్రారంభమైన ఆ వలస అప్పటినుడి ఆ తరువాత 400 నుండి 500 సం.ల కాలం వరకు యూదులు తిరిగి తమ దేశానికి తిరిగి వస్తూనే ఉంటారు.
ఆ క్రమంలోనే క్రి.పూ 100 సం. ప్రాంతంలో దావీదు వంశానికి చెందిన కొంతమంది ప్రజలు ఇశ్రాయేలు దేశానికీ తిరిగి వచ్చి నజరేతు పట్టణంలో నివాసాలు ఏర్పరచుకుని స్థిరపడతారు. అయితే ఇక్కడ మనకు ఓ సందేహం వస్తుంది. అదేంటంటే ఆ వచ్చినవారు దావీదు సంతతి అయితే వారు తిరిగి యెరూషలేము రావచ్చు కదా! వచ్చి సింహాసనాన్ని ఆక్రమించుకోవచ్చు కదా! అదీ కాకుంటే వారు దావీదు పట్టణమైన బేత్లెహేము వచ్చి అక్కడ స్థిరపడవచు కదా అని.
దీనికి సమాధానం ఆనాడు ఇజ్రాయెలీయిలు వారున్న స్థితికి భయపడి యెరూషలేముకు దూరంగా బేత్లెహేముకు 157 కి.మీ దూరంలో ఓ కొండా చెరియగా ఉన్న నజరేతులో స్థిరపడ్డారని చరిత్రకారుల అభిప్రాయం. ఇశ్రాయేలీయులు అంత భయపడాల్సిన అవసరం ఏంటా అని మనం ఆనాటి సమకాలీన ప్రరిస్థితులను గనుక పరిశీలిస్తే.. నజరేతులో స్థిరపడిన యూదులు బాబిలోను నుండి ఇశ్రాయేలు దేశంలోకి ప్రవేశించే సమయంలో యూదయ దేశాన్ని హాస్మోనియన్స్ పరిపాలిస్తూ ఉంటారు. వీరు యుధులైన దావీదు సంతతి వారు కాదు. ఆ తరువాత కూడా యుదాయేతరుడు అయిన హేరోదు మహారాజు ఇశ్రాయేలు సింహాసనాన్ని ఆక్రమించుకుని పరిపాలిస్తూ ఉంటాడు.
కానీ అధిక సంఖ్యాకులైన యూదా జాతి ప్రజల వలన తన రాజ్యానికి.. అధికారానికి ముప్పు వస్తుందేమో అని హేరోదు అనేకమంది యూదులను పట్టి బంధించి హతమారుస్తాడు. అందులోనూ ప్రత్యేకంగా దావీదు సంతతి వారిని ఎక్కువగా చంపిస్తాడు. మత్తయి సువార్త రెండవ అధ్యాయంలో హేరోదు మానసిక ఆందోళన చెంది భవిష్యత్తులో ముప్పు వస్తుందని.. సింహాసనం చేజారి పోతుందనే భయంతోనే రెండేళ్ల లోపు పసికందులను నిర్దాక్షిణ్యంగా చంపించినట్టు చరిత్ర మనకు తెలియపరుస్తుంది.
అందువలనే దేవదూత యేసేపుకు ప్రత్యక్షమై ఈజిప్టు కు వెళ్లి తలదాచుకొమ్మని చెప్పి మరియా యేసోపులను ఈజిప్టు కు పంపిస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో తమను తాము కాపాడుకోవడానికే ఆనాడు బాబిలోను నుండి వచ్చిన దావీదుకు చెందిన రాజవంశీయుల్లో కొందమంది యెరూషలేముకు దూరంగా నజరేతులో తలదాచుకున్నారు. ఈ వివరణను బట్టి నజరేతు వారు యెష్షయి మొద్దునుండి వచ్చిన చిగురే అని రూఢీ పరుచుకోవచ్చు.
4 నజరేతులు నివసించేవారందరూ ఒకరికి ఒకరు కావలసినవారే
యూదులు ముఖ్యంగా దావీదు సంతతి వారు ఉన్మాది అయినా హేరోదు రాజుకు భయపడి దేశమంతటా చెల్లాచెదరై ఒకరికి ఒకరు సంబంధం లేకుండా.. తమ ఉనికి బయట పడకుండా.. రహస్యంగా చాలా సాదాసీదాగా జీవించేవారు. అలా భయపడి రహస్యంగా జీవించినవారిలో ఒక పెద్ద సమూహమే ఈ నజరేతు పట్టణవాసులు. వీరంతా ఒకరికి ఒకరు దగ్గరి బంధువులే.
అందువలనే యెషయా ప్రవక్త ప్రవచించిన మెస్సీయను నేనే అని యేసుక్రీస్తు ఆనాడు ఈ ప్రపంచానికి చాటగానే.. నజరేతులో నివసిస్తున్న యేసు రక్తసంబంధీకులు అనేకమంది యేసుక్రీస్తు మీద ఉక్రోషాన్ని ప్రదర్శించింది అందుకే. అందుకే ఆనాడు వారు క్రీస్తు వలన తమ కుటుంబాలకు రాజు నుండి ఎలాంటి ప్రమాదం వస్తుందో అని భయపడే.. ఏ మాత్రం దయలేకుండా యేసును కొండచరియ అంచుకు తీసుకెళ్లి క్రిందకు త్రోసి చంపాలని ప్రయత్నించారు.
5 నజరేతు పట్టణం యేసు బోధించిన ఎన్నో ఉపమానాలు ఆదర్శంగా నిలచింది.
నజరేతు చిన్న పట్టణం, అయినా దానికి ఎన్నో విశిష్టతలు ఉన్నట్లు పురావస్తు శాఖవారు జరిపిన త్రవ్వకాలలో రూఢీ అయ్యింది. ఎత్తైన కొండచరియాలను.. ద్రాక్షా తోటలకొరకు అనువుగా మార్చుకుని ఉపయోగించుకోవడం, ద్రాక్ష తోటను పరిశ్రమగా తీర్చిదిద్ది వ్యాపారాభివృద్ధికి అనుకూలంగా మార్చుకోవడం, వ్యవసాయ భూములకు నీటి సరఫరా యంత్రాంగం, కాపలాదారులు ఎత్తైన వాచ్ టవర్స్ నిర్మించడం వంటి వాటిని ఎన్నో మనం ప్రముఖంగా చెప్పుకోవచ్చు.
యేసు జీవించిన కాలంలోనే నజరేతు గొప్పగా అభివృద్ధి చెందినట్లుగా చరిత్ర చెబుతుంది. విత్తువాని గురించి, గోధుమలను గురించిన ఉపమానం, ద్రాక్షతోట యజమాని కుమారుణ్ణి చంపిన పొలం కౌలు వాని గురించి ఎలాంటి ఎన్నో ఉపమానాలు బోధించేప్పుడు యేసుక్రీస్తుకు తన సొంత గ్రామమైన నజరేతు ప్రేరణ తప్పక ఎంతో కొంత ఉండి ఉంటుంది.
ఇవీ నజరేతు పట్టణానికి ఉన్న ప్రత్యేకతలు, చిన్న పట్టణమైన యేసయ్యను కలిగి ఉండడం మూలానా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. ఆరాధ్యనీయుడైన యేసయ్యను మనము మన జీవితాల్లో కలిగిఉంటే అంతే ప్రాముఖ్యత మనకూ.. మన జీవితాలకు తప్పక వస్తుంది, యేసయ్యలో గొప్ప సార్ధకత లభిస్తుంది. ఆమెన్.
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.
ఈ వీడియోని చూడటానికి ఈ లింకుని క్లిక్ చెయ్యండి
Clik Link here: https://youtu.be/6_bbXQR_UzA
ఈ వీడియోని చూడటానికి ఈ లింకుని క్లిక్ చెయ్యండి
Clik Link here: https://youtu.be/6_bbXQR_UzA
December 02, 2018
యేసయ్యా నా హృదయస్పందన నీవేకదా ! - BRO YESANNA ALBUM SONGS - BRO RAVI JOS...
యేసయ్యా నా హృదయస్పందన నీవేకదా !
SINGER: BRO RAVI JOSHUA
BRO YESANNA ALBUM SONGS HOSANNA MINISTRIES ALBUM SONGS
SINGER: BRO RAVI JOSHUA
BRO YESANNA ALBUM SONGS HOSANNA MINISTRIES ALBUM SONGS
Subscribe to:
Posts (Atom)